• facebook
  • whatsapp
  • telegram

నేవీలోకి ఆహ్వానం!

ఎంపికైతే ఉచిత విద్య, ఉద్యోగం
 
దేశ రక్షణ దళాల ఆధ్వర్యంలో ఇంజినీరింగ్‌లో చేరటం అంటే భవితను అద్భుతంగా తీర్చిదిద్దుకునే ఛాన్స్‌ చేజిక్కించుకున్నట్టే! విజయవంతంగా కోర్సు పూర్తిచేస్తే చక్కని హోదాతో ఉద్యోగంలోకి ప్రవేశించవచ్చు. ఇందుకు వీలు కల్పించే నేవీ ఎంట్రీ పథకాలకు సంబంధించిన ప్రకటనలు వెలువడ్డాయి. వివిధ దశల్లో పరీక్షలు నిర్వహించి, ప్రతిభావంతులను ఎంపిక చేస్తారు.

నేవీలో క్యాడెట్‌ ఎంట్రీ స్కీం
ఇండియన్‌ నేవీ విభాగం ఇంటర్మీడియట్‌ విద్యార్థులకు పర్మినెంట్‌ కమిషన్‌ కింద 10+2 క్యాడెట్‌ (బీటెక్‌) ఎంట్రీ స్కీం ప్రవేశాలకు సంక్షిప్త ప్రకటన విడుదలచేసింది. అవివాహిత పురుష అభ్యర్థులు మాత్రమే అర్హులు. జేఈఈ మెయిన్స్‌- 2018లో సాధించిన స్కోరు ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. ఈ విధానంలో ఎంపికైనవారు కేరళ ఎజిమాలలోని నేవల్‌ అకాడెమీలో ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ కమ్యూనికేషన్‌ లేదా మెకానికల్‌ బ్రాంచిల్లో ఇంజినీరింగ్‌ విద్యను ఉచితంగా చదువుకోవచ్చు. నాలుగేళ్ల కోర్సు అనంతరం నేవీలోనే ఉన్నత ఉద్యోగిగా సబ్‌ లెఫ్టినెంట్‌ హోదాతో విధులు కొనసాగించవచ్చు.
 
ఫిజిక్స్‌, కెమిస్ట్రీ, మ్యాథ్స్‌ సబ్జెక్టుల్లో 70 శాతం మార్కులతో ఇంటర్‌ ఉత్తీర్ణులైనవారు దరఖాస్తు చేసుకోవచ్చు. దీంతోపాటు పదోతరగతి లేదా ఇంటర్‌ ఇంగ్లిష్‌లో కనీసం 50 శాతం మార్కులు సాధించి ఉండాలి. జనవరి 2, 2000 - జులై 1, 2002 మధ్య జన్మించినవారు అర్హులు. నిర్దిష్ట శారీరక, వైద్య ప్రమాణాలు తప్పనిసరి.
జేఈఈ ర్యాంకు, వివిధ రకాల పరీక్షలు, గ్రూప్‌ డిస్కషన్‌, ఇంటర్వ్యూలు, ఫిజికల్‌ టెస్టు, వైద్య ఆరోగ్య పరీక్షల ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
 
ఆన్‌లైన్‌ రిజిస్ట్రేషన్‌ ప్రక్రియ తేదీలు: 03.11.2018 నుంచి 22.11.2018 వరకు. పూర్తి వివరాలకు 03.11.2018 నాటి ఎంప్లాయిమెంట్‌ న్యూస్‌ చూడవచ్చు.
 
వెబ్‌సైట్‌: https://www.joinindiannavy.gov.in/
 
నేవీలో 10+2 (బీటెక్‌) క్యాడెట్ ఎంట్రీ స్కీం

 ఎంపికైన‌వారికి ఉచితంగా బీటెక్
 అనంత‌రం స‌బ్ లెఫ్టినెంట్‌ ఉద్యోగం
 నెల‌కు రూ.83 వేల‌కు పైగా వేత‌నం
 ఇంట‌ర్ ఎంపీసీ విద్యార్థుల‌కు అవ‌కాశం

10+2 బీటెక్ క్యాడెట్ ఎంట్రీ స్కీం ద్వారా ఇంట‌ర్ ఎంపీసీ విద్యార్థుల‌కు అద్భుత అవ‌కాశాన్ని క‌ల్పిస్తోంది ఇండియ‌న్ నేవీ. ఈ విధానంలో ఎంపికైన‌వారు కేర‌ళ‌లోని నేవ‌ల్ అకాడెమీ- ఎజిమాల‌లో ఎల‌క్ట్రానిక్స్ అండ్ క‌మ్యూనికేష‌న్ లేదా మెకానిక‌ల్ బ్రాంచీల్లో నాలుగేళ్లపాటు ఇంజినీరింగ్ విద్యను ఉచితంగా చ‌దువుకోవ‌చ్చు. భోజ‌నం, వ‌స‌తి, పుస్తకాలు, దుస్తులు అన్నీ ఉచితమే. అనంత‌రం స‌బ్ లెఫ్టినెంట్‌ హోదాతో నెల‌కు రూ.83 వేలకు పైగా వేత‌నంతో నేవీలోనే ఉద్యోగిగా కొన‌సాగ‌వ‌చ్చు. నోటిఫికేష‌న్‌కు సంబంధించి పూర్తి స‌మాచారం తెలుసుకుందాం.
 
ఎంపిక ఇలా:
ద‌ర‌ఖాస్తు చేసుకున్న అభ్యర్థుల‌ను జేఈఈ-2017 మెయిన్స్‌లో సాధించిన ర్యాంకు ద్వారా షార్ట్‌లిస్టు చేస్తారు. జేఈఈ మెయిన్స్‌లో అర్హత సాధించిన‌వారే 10+2 క్యాడెట్ ఎంట్రీ స్కీంకు అర్హులు. జేఈఈ మెయిన్ ర్యాంకు ఆధారంగా షార్ట్‌లిస్ట్ చేసిన అభ్యర్థుల‌ను స‌ర్వీసెస్ సెల‌క్షన్ బోర్డు (ఎస్ఎస్‌బీ)... బెంగ‌ళూరు, భోపాల్‌, కోయంబ‌తూర్‌, విశాఖ‌ప‌ట్నంల్లో ఏదోఒక చోట జులై - అక్టోబ‌రు మ‌ధ్య కాలంలో ఇంట‌ర్వ్యూలు నిర్వహిస్తుంది. వీటిని రెండు ద‌శ‌ల్లో చేప‌డ‌తారు. మొత్తం 5 రోజుల పాటు ఇంటర్వ్యూలు కొన‌సాగుతాయి. తొలిరోజు స్టేజ్-1 ప‌రీక్షను నిర్వహిస్తారు. ఇందులో భాగంగా ఇంటెలిజెన్స్ టెస్టు, పిక్చర్ పెర్సెప్షన్‌ టెస్టు, గ్రూప్ డిస్కష‌న్ ఉంటాయి. ఇందులో అర్హత సాధించిన‌వారికి మిగిలిన 4 రోజుల పాటు స్టేజ్‌-2 ఇంట‌ర్వ్యూలు కొన‌సాగుతాయి. దీనిలో భాగంగా సైక‌లాజిక‌ల్ ప‌రీక్షలు, గ్రూప్ ప‌రీక్షలు, ముఖాముఖి నిర్వహిస్తారు. ఇందులోనూ అర్హత సాధిస్తే ఫిజిక‌ల్ టెస్టు (ఎత్తు, బరువు), వైద్య ఆరోగ్య ప‌రీక్షలు నిర్వహించి తుదిద‌శ నియామ‌కాలు చేప‌డ‌తారు.

నేవీలో ఉద్యోగాలెన్నో...
 
శిక్షణ‌..
ఎంపికైన‌వారికి శిక్షణ త‌ర‌గ‌తులు జులై 2018 నుంచి ప్రారంభ‌వుతాయి. అభ్యర్థులు ఇంట‌ర్వ్యూలో సాధించిన మార్కులు, ఖాళీల‌కు అనుగుణంగా ఇండియ‌న్ నేవ‌ల్ అకాడెమీ, ఎజిమాల (కేర‌ళ‌)లో బీటెక్ అప్లైడ్ ఎల‌క్ట్రానిక్స్ అండ్ క‌మ్యూనికేష‌న్ ఇంజినీరింగ్ లేదా ఎల‌క్ట్రానిక్స్ అండ్ క‌మ్యూనికేష‌న్ ఇంజినీరింగ్ లేదా మెకానిక‌ల్ ఇంజినీరింగ్ విద్యను నాలుగేళ్లపాటు అభ్యసిస్తారు. విజ‌య‌వంతంగా కోర్సు పూర్తిచేసుకున్నవారికి జ‌వ‌హ‌ర్‌లాల్ నెహ్రూ యూనివ‌ర్సిటీ (జేఎన్‌యూ)-న్యూదిల్లీ ఇంజినీరింగ్‌ డిగ్రీని ప్రదానం చేస్తుంది. కోర్సు ఫీజు, భోజ‌నం, వ‌స‌తి, దుస్తులు..ఈ ఖ‌ర్చుల‌న్నీ నేవీ భ‌రిస్తుంది. కోర్సు అనంత‌రం స‌బ్ లెఫ్టినెంట్ హోదాతో నేవీలో విధుల్లోకి చేర‌తారు. ఈ స‌మ‌యంలో అన్నీ క‌లుపుకుని నెల‌కు రూ.83 వేల‌కు పైగా వేత‌నంగా పొంద‌వ‌చ్చు.

ఇవీ అర్హత‌లు
విద్యార్హత‌: ఫిజిక్స్‌, కెమిస్ట్రీ, మ్యాథ్స్‌ల్లో 70 శాతం మార్కుల‌తో ఇంట‌ర్ ఉత్తీర్ణత‌. దీంతోపాటు ప‌దోత‌ర‌గ‌తి లేదా ఇంట‌ర్ ఇంగ్లిష్‌లో క‌నీసం 60 శాతం మార్కులు సాధించాలి.
వ‌యోప‌రిమితి: 17 - 19 1/2 ఏళ్ల మ‌ధ్యలో ఉండాలి. అంటే జ‌న‌వ‌రి 2, 1999 - జులై 1, 2001 మ‌ధ్య జ‌న్మించిన‌వాళ్లే అర్హులు.
ఇత‌ర అర్హత‌లు: అభ్యర్థులు జేఈఈ మెయిన్ -2017 లో అర్హత సాధించిన‌వారై ఉండాలి. మెయిన్‌లో సాధించిన ర్యాంకు ఆధారంగా షార్ట్‌లిస్ట్ చేసిన వారిని ఎస్ఎస్‌బీ ఇంట‌ర్వ్యూలు నిర్వహిస్తుంది. ఈ పోస్టుల‌కు అవివాహిత పురుష అభ్యర్థులు మాత్రమే అర్హులు. ఎత్తు క‌నీసం 157 సెం.మీ. ఉండాలి. ఎత్తుకు త‌గ్గ బ‌రువు త‌ప్పనిస‌రి.

ద‌ర‌ఖాస్తులు
ఆన్‌లైన్‌లోనే ద‌ర‌ఖాస్తు చేసుకోవాలి. అనంత‌రం ప్రింట‌వుట్లు తీసుకోవాలి. ఒక సెట్ ప్రింట‌వుట్‌ను రిఫ‌రెన్స్ కోసం ఉంచుకోవాలి. ఒక సెట్ ప్రింట‌వుట్‌ను ఎస్ఎస్‌బీ ఇంట‌ర్వ్యూకు తీసుకుని వెళ్లాలి.

ఆన్‌లైన్ రిజిస్ట్రేష‌న్‌కు చివ‌రి తేదీ: న‌వంబ‌రు 30
 
వెబ్‌సైట్‌: https://www.joinindiannavy.gov.in/

నేవీలోకి ఆహ్వానం!

‣ ఎంపికైతే ఉచిత విద్య, ఉద్యోగం
 
ఇండియన్‌ కోస్టు గార్డులో ఉద్యోగాలు

ధైర్యసాహసాలూ, అంకితభావం ఉన్న ఉత్సాహవంతులైన పట్టభద్రుల కోసం భారతీయ సాగర తీరదళం ఎదురుచూస్తోంది. అసిస్టెంట్‌ కమిషనర్‌ ఆఫ్‌ పోలీస్‌ (ఏసీపీ) / డెప్యూటీ సూపరింటెండెంట్‌ ఆఫ్‌ పోలీస్‌ (డీఎస్పీ) స్థాయులకు సమాన హోదాలో ఉండే ‘అసిస్టెంట్‌ కమాండెంట్‌’ ఉద్యోగానికి యువతీ యువకుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. ఎంపికైతే నేరుగా గ్రూప్‌-ఎ గెజిటెడ్‌ ఆఫీసర్‌ పోస్టు సొంతం చేసుకోవచ్చు.
 
ఎంట్రీ స్థాయిలోవైనప్పటికీ ఈ అసిస్టెంట్‌ కమాండెంట్‌ పోస్టులు కీలకమైనవి. అందుకే ఎంపికైనవారిని నేవల్‌ అకాడమీలో శిక్షణ ద్వారా సుశిక్షితులుగా చేస్తారు. ఉద్యోగ బాధ్యతల్లో భాగంగా సీనియర్‌ అధికారుల, నావికుల మార్గదర్శకత్వంలో నైపుణ్యాలు మెరుగుపరుచుకోవటం వీరి కర్తవ్యం. మంచి ఫిట్‌నెస్‌తో, ఉత్సాహంగా తీర రక్షణ విధులు నిర్వహించాల్సి ఉంటుంది.
 
ఈ పోస్టుల నియామక ప్రక్రియ వివిధ దశలతో సంక్లిష్టంగా ఉంటుంది. రాతపరీక్ష, ఇంటర్వ్యూ, వైద్య పరీక్షల ద్వారా ఎంపికలు చేపడతారు. ముందుగా వచ్చిన దరఖాస్తులను పరిశీలించి మదింపు చేస్తారు. వీరికి స్టేజ్‌ -1 పరీక్ష నిర్వహిస్తారు. ప్రాథమిక ఎంపికలో భాగంగా మెంటల్‌ ఎబిలిటీ టెస్టు/ కాగ్నిటివ్‌ ఆప్టిట్యూడ్‌ టెస్టు, పిక్చర్‌ పర్సెప్షన్‌ అండ్‌ డిస్కషన్‌ టెస్టు (పీపీ అండ్‌ డీటీ) ఉంటాయి.
 
ఆప్టిట్యూడ్‌ టెస్టు ఆంగ్ల మాధ్యమంలో ఉంటుంది. ఆబ్జెక్టివ్‌ తరహా ప్రశ్నలు వస్తాయి. పీపీ అండ్‌ డీటీ కోసం ఆంగ్లం లేదా హిందీలో మాట్లాడాలి. ఇందులో భాగంగా ఏదైనా చిత్రాన్ని చూపించి వ్యాఖ్యానించమంటారు.
స్టేజ్‌-1లో ఎంపికైనవారికి స్టేజ్‌-2 నిర్వహిస్తారు.ఇందులో సైకలాజికల్‌ పరీక్షలు, గ్రూప్‌ టాస్క్‌, ఇంటర్వ్యూ ఉంటాయి.

స్టేజ్‌-2లోనూ ఎంపికైనవారికి మెడికల్‌ పరీక్షలు నిర్వహించి తుది నియామకాలు చేపడతారు. ఉద్యోగానికి ఎంపికైనవారి వివరాలు మే, 2019లో కోస్టు గార్డు వెబ్‌ సైట్‌లో ప్రకటిస్తారు. వీరికి జూన్‌ ఆఖరు నుంచి ఇండియన్‌ నేవల్‌ అకాడెమీ (ఐఎన్‌ఏ), ఎజిమలలో శిక్షణ ప్రారంభమవుతుంది.
 
ఏ పోస్టుకు ఎవరు అర్హులు?
అసిస్టెంట్‌ కమాండెంట్లు (గ్రూప్‌-ఎ గెజిటెడ్‌ ఆఫీసర్‌)

1. జనరల్‌ డ్యూటీ (పురుషులు)
కనీసం 60 శాతం అగ్రిగేట్‌ మార్కులతో బ్యాచిలర్స్‌ డిగ్రీ ఉత్తీర్ణత ఉన్నవారు అర్హులు. ఇంటర్మీడియట్లో మ్యాథమేటిక్స్‌, ఫిజిక్స్‌ సబ్జెక్టులను చదివిఉండాలి. అభ్యర్థులు 01.07.1994 - 30.06.1998 మధ్య జన్మించి ఉండాలి.

2. జనరల్‌ డ్యూటీ (ఎస్‌ఎస్‌ఏ) మహిళలు
కనీసం 60శాతం అగ్రిగేట్‌ మార్కులతో బ్యాచిలర్స్‌ డిగ్రీ ఉత్తీర్ణత ఉన్నవారు అర్హులు. . ఇంటర్మీడియట్లో మ్యాథమేటిక్స్‌, ఫిజిక్స్‌ సబ్జెక్టులను చదివి ఉండాలి. అభ్యర్థినులు 01.07.1994 - 30.06.1998 మధ్య జన్మించి ఉండాలి.

3. కమర్షియల్‌ పైలట్‌ ఎంట్రీ (ఎస్‌ఎస్‌ఏ) పురుషులు/ మహిళలు
మ్యాథమేటిక్స్‌, ఫిజిక్స్‌ సబ్జెక్టులతో పన్నెండో తరగతిలో 60 శాతం మార్కులతో ఉత్తీర్ణతతోపాటు కమర్షియల్‌ పైలట్‌ లైసెన్స్‌ ఉండాలి. అభ్యర్థులు 01.07.1994 - 30.06.2000 మధ్య జన్మించి ఉండాలి.

4. లా- పురుషులు/ మహిళలు
కనీసం 60శాతం మార్కులతో డిగ్రీ (లా) ఉత్తీర్ణులైవుండాలి. అభ్యర్థులు 01.07.1989 - 30.06.1998 మధ్య జన్మించి ఉండాలి.
అసిస్టెంట్‌ కమాండెంట్‌ జనరల్‌ డ్యూటీ, లా విభాగాలకు పురుషులు 157, మహిళలు 152 సెం.మీ. ఎత్తు ఉండడం తప్పనిసరి. అలాగే ఎత్తుకు తగ్గ బరువు ఉండాలి. అభ్యర్థులు ఏదైనా ఒక విభాగానికి మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి. ఒకటి కంటే ఎక్కువ దరఖాస్తులు చేసుకుంటే అన్నింటినీ రద్దు చేస్తారు.

వీటిని తీసుకెళ్లాలి...
ప్రిలిమినరీ పరీక్షలకు వెళ్లినప్పుడే అడ్మిట్‌ కార్డు ప్రింటవుట్‌లు రెండు తీసుకుని వాటికి కలర్‌ పాస్‌పోర్టు పరిమాణం ఫొటోలు జతచేయాలి. 10, 12 (ఇంటర్‌), డిగ్రీ ఒరిజినల్‌ సర్టిఫికెట్లు, ఏదైనా ఒక ఐడీ ప్రూఫ్‌, రిజర్వేషన్‌ ఉన్నవాళ్లు సంబంధిత (ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ) సర్టిఫికెట్లు తీసుకెళ్లాలి. పరీక్ష తేదీకి ఆరు నెలల్లోపు తీసుకున్న క్యారక్టర్‌ సర్టిఫికెట్‌, ఇటీవల తీసుకున్న 12 పాస్‌పోర్టు పరిమాణం ఉన్న ఫొటోలు నీలం బ్యాక్‌ గ్రౌండ్‌తో ఉండేవి తీసుకెళ్లాలి. సర్టిఫికెట్లను పరిశీలించి పరీక్ష అనంతరం తిరిగి ఇచ్చేస్తారు. సర్టిఫికెట్లు లేకుండా పరీక్షకు అనుమతించరు.

విజయవంతంగా శిక్షణ పూర్తిచేసుకున్నవారిని అసిస్టెంట్‌ కమాండెంట్‌ హోదాతో విధుల్లోకి తీసుకుంటారు. ఈ సమయంలో రూ.56,100 మూలవేతనం చెల్లిస్తారు. డీఏ, హెచ్‌ఆర్‌ఏ, పలు ఇతర అలవెన్సులు ఉంటాయి.
 
తక్కువ వ్యవధిలోనే డెప్యూటీ కమాండెంట్‌, కమాండెంట్‌ హోదాలు పొందవచ్చు. భారత సముద్రతీరాన్ని కాపాడటం వీరి ప్రాథమిక విధి. ప్రమాదంలో చిక్కుకున్న మత్స్యకారులనూ రక్షించాలి. కింది స్థాయి ఉద్యోగులకు దిశానిర్దే్దేశం చేయాలి.
 
ముఖ్య తేదీలు
ఆన్‌లైన్‌ దరఖాస్తుల ప్రారంభ తేదీ: 18.11.2018.
చివరి తేదీ: 30.11.2018 సాయంత్రం 5 వరకు
ప్రవేశపత్రాలు: డిసెంబరు 9 నుంచి కోస్టుగార్డు వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంటాయి.
స్టేజ్‌-1 ప్రాథమిక పరీక్ష: డిసెంబరు 17, 2018 - జనవరి 17, 2019 మధ్య ఎప్పుడైనా జరగవచ్చు.
పరీక్ష కేంద్రాలు: ముంబయి, చెన్నై, కోల్‌కతా, నోయిడాల్లో నిర్వహిస్తారు.
వెబ్‌సైట్‌: 
https://www.joinindiancoastguard.gov.in/

సీడీఎస్ఈలో ఎంపిక ఇలా..

డిగ్రీ పూర్త‌యిన యువ‌త డిఫెన్స్ రంగంలో ఉద్యోగంలో స్థిర‌ప‌డాలంటే కంబైన్డ్ డిఫెన్స్ సర్వీసెస్ ఎగ్జామినేషన్ (సీడీఎస్ఈ) మంచి మ‌ర్గాన్ని చూపుతుంది. ఇందుకు అనుగుణంగా సీడీఎస్ఈ ఎంపికరెండు దశల్లో జరుగుతుంది. మొద‌టి స్టేజ్లో రాత పరీక్ష, త‌రువాతి స్టేజ్లో ఇంటెలిజెన్స్ అండ్ పర్సనాలిటీ, వైద్య పరీక్షలు నిర్వహిస్తారు.  
రాత పరీక్షలో ఇంగ్లిష్, జనరల్ నాలెడ్జ్, ఎలిమెంటరీ మ్యాథమేటిక్స్ అంశాల నుంచి ప్రశ్నపత్రాలు అడుగుతారు. ఒక్కో పేపర్కు 100 మార్కుల చొప్పున మొత్తం 300 మార్కులకు పరీక్ష ఉంటుంది. ఈ మూడు విభాగాలకు రెండు గంటల చొప్పున సమయం కేటాయించారు. ఆఫీసర్స్ ట్రైనింగ్ అకాడమీ పోస్టులకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు ఎలిమెంటరీ మ్యాథమేటిక్స్ ప్రశ్నపత్రం లేదు. అన్ని విభాగాల్లోని ప్రశ్నలకు బహుళైచ్ఛిక రూపంలోనే సమాధానాలు రాయాల్సి ఉంటుంది. జవాబు తప్పుగా రాస్తే రుణాత్మక మార్కులు ఉంటాయి. ఇంగ్లిష్ విభాగం మినహా మిగిలిన ప్రశ్నపత్రాలు ఇంగ్లిష్, హిందీ మాధ్యమాల్లో ఇస్తారు. ఈ రాత పరీక్షలో ఎంపికైతే స్టేజ్కు అర్హత లభిస్తుంది. స్టేజ్లో నిర్వహించే ఇంటెలిజెన్స్ అండ్ పర్సనాలిటీ టెస్ట్ మిగిలిన ఇంటర్వ్యూలతో పోలిస్తే కఠినతరమైనదనే చెప్పవచ్చు. ఇది అయిదు రోజులపాటు కొనసాగుతుంది. ఇంటర్వ్యూ, గ్రూప్ టెస్ట్లు, సైకలాజికల్  పరిశీలనల ద్వారా అభ్యర్థుల తీరును క్షుణ్ణంగా సర్వీస్ సెలక్షన్ బోర్డు పరీక్షిస్తుంది. ఏపీ, తెలంగాణ రాష్ట్రాలవిద్యార్థులకు బెంగళూరు కేంద్రంలో ఇవి జరుగుతాయి. ఇందులో ఎంపికైతే వైద్య పరీక్షలు నిర్వహించి శిక్షణకు ఎంపిక చేస్తారు. ఎంపికైన వారు ఆర్మీలో చేరితే లెఫ్టినెంట్, నేవీలో సబ్ లెప్టినెంట్, ఎయిర్ఫోర్స్లో ఫ్లయింగ్ ఆఫీసర్ హోదాలు లభిస్తాయి.

సిలబస్ అవగాహన

ఇంగ్లిష్: అభ్యర్థి ఆంగ్లభాషను ఏ విధంగా అర్థం చేసుకుంటున్నారో పరీక్షించేలా ఈ విభాగంలో ప్రశ్నలు ఉంటాయి.

జనరల్ నాలెడ్జ్: వర్తమాన అంశాలకు ప్రాధాన్యం ఉంటుంది. సైన్స్ అండ్ టెక్నాలజీ, భారతదేశ చరిత్ర, భౌగోళిక శాస్త్ర అంశాలపై అభ్యర్థి అవగాహనను పరీక్షిస్తారు. ఎక్కువ ప్రశ్నలు దైనందిన జీవితానికి, ముఖ్యమైన కరెంట్ అఫైర్స్కు సంబంధించనవే ఉంటాయి.

ఎలిమెంటరీ మ్యాథమేటిక్స్: ఇందులో అడిగే ప్రశ్నలు పదో తరగతి స్థాయిలోనే ఉంటాయి. అరిథ్మెటిక్, బీజగణితం, జ్యామితి, త్రికోణమితి, క్షేత్రగణితం, స్టాటిస్టిక్స్ టాపిక్ల నుంచి అడుగుతారు.

ఇంజినీరింగ్ అర్హ‌త‌తో ఉద్యోగాలు

ఇంజినీరింగ్ బ్రాంచ్ (నావ‌ల్ ఆర్కిటెక్ట్‌)

నిరుద్యోగ‌ యువ‌త‌కు భార‌త నౌకాద‌ళం ఉద్యోగావ‌కాశాలు క‌ల్పిస్తోంది. ప‌దోత‌ర‌గ‌తి మొద‌లు డిగ్రీ, ఇంజినీరింగ్ ఆపై చ‌దువులున్న వారికి ప్రత్యేక‌మైన ఉద్యోగాలెన్నో నేవీలో ఉన్నాయి. త‌క్కువ అర్హత‌తో చేరిన‌ప్పటికీ కెరీర్‌లో ఎదుగుద‌ల‌కూ అవ‌కాశాలు ఉన్నాయి. నేవీలో ఇంజినీరింగ్ అర్హ‌త‌తో ఉద్యోగాలు, వాటికి కావాల్సిన అర్హత‌లేమిటో చూద్దాం...

10+2 (బీటెక్‌) క్యాడెట్ ఎంట్రీ
అర్హత‌: ఫిజిక్స్‌, కెమిస్ట్రీ, మ్యాథ్స్‌ల‌తో ఇంట‌ర్ ఉత్తీర్ణత‌. దీంతోపాటు పీసీఎంలో క‌నీసం 70 శాతం మార్కులు సాధించాలి. అలాగే టెన్త్ లేదా ఇంట‌ర్ ఇంగ్లిష్‌లో క‌నీసం 50 శాతం మార్కులు ఉండాలి.(పురుషులు మాత్రమే అర్హులు)
వ‌యోప‌రిమితి: 16 1/2-19 ఏళ్లు

షార్ట్ స‌ర్వీస్ క‌మిష‌న్ ఎంట్రీ
అర్హత‌: మెకానిక‌ల్‌/ సివిల్‌/ ఏరోనాటిక్స్‌/ మెట‌ల‌ర్జిక‌ల్‌/ ఏరోస్పేస్ ఇంజినీరింగ్ బ్రాంచ్‌లో 60 శాతం మార్కుల‌తో బీఈ/ బీటెక్ ఉత్తీర్ణత‌
వ‌యోప‌రిమితి: 21-25 ఏళ్లు (మ‌హిళ‌లు కూడా ద‌ర‌ఖాస్తు చేసుకోవ‌చ్చు)

యూనివ‌ర్సిటీ ఎంట్రీ స్కీం (ఎస్ఎస్‌సీ)
అర్హత‌: 60 శాతం మార్కుల‌తో నావ‌ల్ ఆర్కిటెక్చర్‌, మెకానిక‌ల్‌, సివిల్‌, ఏరోనాటిక‌ల్‌, మెట‌ల‌ర్జిక‌ల్‌, ఏరోస్పేస్ ఇంజినీరింగ్‌లో బీఈ/ బీటెక్ లేదా బీ ఆర్క్‌
వ‌యోప‌రిమితి: 19-24 ఏళ్లు (మ‌హిళ‌లు కూడా అర్హులే)

స్పెష‌ల్ నావ‌ల్ ఆర్కిటెక్ట్ ఎంట్రీ స్కీం (ఎస్ఎన్ఎఇఎస్‌)
అర్హత‌: నావ‌ల్ ఆర్కిటెక్చర్‌లో 60 శాతం మార్కుల‌తో బీఈ/ బీటెక్‌
ఎంపిక విధానం: క్యాంప‌స్ రిక్రూట్‌మెంట్ ద్వారా

ఎల‌క్ట్రిక‌ల్ విభాగం
ఇందులో స‌బ్ మెరైన్ ఎలక్ట్రిక‌ల్ ఆఫీసర్ హోదాతో విధులు నిర్వర్తిస్తారు.

క్యాడెట్ ఎంట్రీ (ఎన్‌డీఏ)
అర్హత‌: మ్యాథ్స్‌, ఫిజిక్స్‌తో ఇంట‌ర్ ఉత్తీర్ణత (పురుషులు మాత్రమే అర్హులు)
వ‌యోప‌రిమితి: 16 1/2- 19 ఏళ్లు

10+2 బీటెక్ క్యాడెట్ ఎంట్రీ
అర్హత‌: ఎంపీసీ గ్రూప్‌తో ఇంట‌ర్ ఉత్తీర్ణత‌. అలాగే ఫిజిక్స్‌, కెమిస్ట్రీ, మ్యాథ్స్ స‌బ్జెక్టుల్లో క‌నీసం 70 శాతం మార్కులు సాధించాలి. దీంతోపాటు టెన్త్ లేదా ఇంట‌ర్ ఇంగ్లిష్‌లో 50 శాతం మార్కులు త‌ప్పనిస‌రి.

యూనివ‌ర్సిటీ ఎంట్రీ స్కీం (ఎస్ఎస్‌సీ)
అర్హత‌: ఎల‌క్ట్రిక‌ల్‌, ఎల‌క్ట్రానిక్స్‌, ప‌వ‌ర్ ఇంజినీరింగ్‌, ఇన్‌స్ట్రుమెంటేష‌న్ అండ్ కంట్రోల్‌, ఎల‌క్ట్రానిక్స్ అండ్ ఇన్‌స్ట్రుమెంటేష‌న్‌, ఎల‌క్ట్రానిక్స్ అండ్ క‌మ్యూనికేష‌న్‌, ఇన్‌స్ట్రుమెంటేష‌న్ అండ్ కంట్రోల్‌, కంట్రోల్ సిస్టం, ప‌వ‌ర్ ఎల‌క్ట్రానిక్స్, కంప్యూట‌ర్ సైన్స్ ఇంజినీరింగ్‌, ఇన్‌స్ట్రుమెంటేష‌న్ ఇంజినీరింగ్‌లో బీఈ/ బీటెక్‌లో అప్పటిదాకా 60 శాతం మార్కుల‌తో ఫైన‌ల్‌, ప్రీ ఫైన‌ల్ విద్యార్థులు అర్హులు.
వ‌యోప‌రిమితి: ప్రి ఫైన‌ల్ ఇయ‌ర్ విద్యార్థులైతే 19 1/2- 25 ఏళ్లు, ఫైన‌ల్ ఇయ‌ర్ విద్యార్థులైతే 19-24 ఏళ్లు (పురుషులు మాత్రమే అర్హులు)

షార్ట్ స‌ర్వీస్ క‌మిష‌న్ (జీఎస్‌)
అర్హత‌: క‌నీసం 60 శాతం మార్కుల‌తో ఏదైనా విభాగంలో బీఈ/ బీటెక్ ఉత్తీర్ణత (పురుషులు మాత్రమే అర్హులు)
వ‌యోప‌రిమితి: 19 1/2- 25 ఏళ్లు

షార్ట్ స‌ర్వీస్ క‌మిష‌న్ (స‌బ్‌మెరైన్‌)
అర్హత‌: ఎల‌క్ట్రిక‌ల్‌, ఎల‌క్ట్రానిక్స్‌, కంట్రోల్ ఇంజినీరింగ్‌, టెలిక‌మ్యూనికేష‌న్ ఇంజినీరింగ్‌లో ఎందులోనైనా 60 శాతం మార్కుల‌తో బీఈ/ బీటెక్‌
వ‌యోప‌రిమితి: 19 1/2-25 ఏళ్లు (పురుషులు మాత్రమే అర్హులు)

త్రివిధ దళాల్లోకి తిరుగులేని దారి

కంబైన్డ్ డిఫెన్స్ సర్వీసెస్ ఎగ్జామినేషన్ (1)- 2021 నోటిఫికేషన్ విడుదల

భారత త్రివిధ దళాల్లో చేరి దేశ సేవలో భాగస్వాములు కావాలనుందా? చిన్న వయసులోనే రక్షణ రంగంలో అత్యున్నత స్థాయికి చేరుకోవాలనుకుంటున్నారా? జీవితంలో సవాళ్లను స్వీకరించాలని ఉందా? అయితే కంబైన్డ్ డిఫెన్స్ సర్వీసెస్ ఎగ్జామినేషన్ (సీడీఎస్ఈ) మీకు ఆ అవకాశం కల్పిస్తోంది. డిగ్రీ పూర్తి చేసిన పాతికేళ్ల లోపు యువతకు ఈ పరీక్ష వరంలాంటిది. ఆసక్తితోపాటు ప్రతిభావంతులైన యువతను గుర్తించి, వారి ప్రతిభకు పదునుపెట్టి, సుశిక్షితులుగా తీర్చిదిద్దడానికి ఆర్మీ, నేవీ, ఎయిర్ఫోర్స్ ఎదురుచూస్తున్నాయి. ఇందులో ఎంపికైతే గౌరవం, హోదా లభిస్తాయి. ఆర్థికంగానూ మంచి అభివృద్ధి ఉంటుంది. శిక్షణ కాలం నుంచే పెద్ద వేతనాన్ని పొందవచ్చు.  ‌సీడీఎస్ ప‌రీక్ష యూపీఎస్సీ ఆధ్వ‌ర్యంలో జ‌రుగుతుంది.

ఖాళీలు.. దరఖాస్తు ప్రక్రియ

మొత్తం ఖాళీలు: 345, ఇండియన్ మిలిటరీ అకాడమీ, డెహ్రాడూన్-100, ఇండియన్ నేవెల్ అకాడమీ, ఎజిమళ -26 , ఎయిర్ ఫోర్స్ అకాడమీ, హైదరాబాద్-32, ఆఫీసర్స్ ట్రైనింగ్ అకాడమీ, చెన్నై(ఎస్ఎస్సీ మెన్ నాన్ టెక్నికల్)-170, ఆఫీసర్స్ ట్రైనింగ్ అకాడమీ, చెన్నై (ఎస్ఎస్సీ విమెన్ నాన్ టెక్నికల్)-17.

దరఖాస్తు: వెబ్సైట్ http://upsconline.nic.in ద్వారా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి. చివరి తేది నవంబరు 17, 2020 సాయంత్రం 6 గంటల వరకు. అర్హత కలిగిన అభ్యర్థులు పరీక్ష తేదీ మూడు వారాల ముందు నుంచి ఈ-అడ్మిట్కార్డులను వెబ్సైట్ http://upsc.gov.in నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు.

పరీక్ష ఫీజు:  రూ.200 (మహిళలు, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు చెల్లించాల్సిన అవసరం లేదు). ఆన్లైన్ లేదా ఎస్బీఐ బ్రాంచిలో చెల్లించవచ్చు.

తెలుగు రాష్ట్రాల్లో పరీక్ష కేంద్రాలు: హైదరాబాద్,తిరుపతి, విశాఖపట్నం.

అర్హతలు
25 సంవత్సరాల లోపు వయసుతో పాటు అవివాహితులై ఉండాలి. ఏదైనా డిగ్రీ పూర్తి చేసిన వారు అర్హులు. ఇండియన్ మిలటరీ, ఇండియన్ నేవెల్ అకాడమీ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు 2 జ‌న‌వ‌రి 1998 - 1 జ‌న‌వ‌రి 2003 మ‌ధ్య జ‌న్మించిన వారు అర్హులు... ఎయిర్ ఫోర్స్ అకాడమీ పోస్టులకైతే జనవరి 1, 2022 నాటికి 20 నుంచి 24 ఏళ్ల వయసు మధ్య ఉండాలి. జనవరి 2, 1998 ముందు, జనవరి 1, 2002 తర్వాత జన్మించిన వారు అర్హులు కారు. ఆఫీసర్స్ ట్రైనింగ్ అకాడమీ పోస్టులకు జనవరి 2, 1997 ముందు, జనవరి 1, 2003 తర్వాత జన్మించి ఉండకూడదు.

నేవీలో 10+2 (బీటెక్‌) క్యాడెట్ ఎంట్రీ స్కీం

ఎంపికైన‌వారికి ఉచితంగా బీటెక్
అనంత‌రం స‌బ్ లెఫ్టినెంట్‌ ఉద్యోగం
నెల‌కు రూ.83 వేల‌కు పైగా వేత‌నం
ఇంట‌ర్ ఎంపీసీ విద్యార్థుల‌కు అవ‌కాశం
 
10+2 బీటెక్ క్యాడెట్ ఎంట్రీ స్కీం ద్వారా ఇంట‌ర్ ఎంపీసీ విద్యార్థుల‌కు అద్భుత అవ‌కాశాన్ని క‌ల్పిస్తోంది ఇండియ‌న్ నేవీ. ఈ విధానంలో ఎంపికైన‌వారు కేర‌ళ‌లోని నేవ‌ల్ అకాడెమీ- ఎజిమాల‌లో ఎల‌క్ట్రానిక్స్ అండ్ క‌మ్యూనికేష‌న్ లేదా మెకానిక‌ల్ బ్రాంచీల్లో నాలుగేళ్లపాటు ఇంజినీరింగ్ విద్యను ఉచితంగా చ‌దువుకోవ‌చ్చు. భోజ‌నం, వ‌స‌తి, పుస్తకాలు, దుస్తులు అన్నీ ఉచితమే. అనంత‌రం స‌బ్ లెఫ్టినెంట్‌ హోదాతో నెల‌కు రూ.83 వేలకు పైగా వేత‌నంతో నేవీలోనే ఉద్యోగిగా కొన‌సాగ‌వ‌చ్చు. నోటిఫికేష‌న్‌కు సంబంధించి పూర్తి స‌మాచారం తెలుసుకుందాం.
 
ఎంపిక ఇలా:
ద‌ర‌ఖాస్తు చేసుకున్న అభ్యర్థుల‌ను జేఈఈ-2017 మెయిన్స్‌లో సాధించిన ర్యాంకు ద్వారా షార్ట్‌లిస్టు చేస్తారు. జేఈఈ మెయిన్స్‌లో అర్హత సాధించిన‌వారే 10+2 క్యాడెట్ ఎంట్రీ స్కీంకు అర్హులు. జేఈఈ మెయిన్ ర్యాంకు ఆధారంగా షార్ట్‌లిస్ట్ చేసిన అభ్యర్థుల‌ను స‌ర్వీసెస్ సెల‌క్షన్ బోర్డు (ఎస్ఎస్‌బీ)... బెంగ‌ళూరు, భోపాల్‌, కోయంబ‌తూర్‌, విశాఖ‌ప‌ట్నంల్లో ఏదోఒక చోట జులై - అక్టోబ‌రు మ‌ధ్య కాలంలో ఇంట‌ర్వ్యూలు నిర్వహిస్తుంది. వీటిని రెండు ద‌శ‌ల్లో చేప‌డ‌తారు. మొత్తం 5 రోజుల పాటు ఇంటర్వ్యూలు కొన‌సాగుతాయి. తొలిరోజు స్టేజ్-1 ప‌రీక్షను నిర్వహిస్తారు. ఇందులో భాగంగా ఇంటెలిజెన్స్ టెస్టు, పిక్చర్ పెర్సెప్షన్‌ టెస్టు, గ్రూప్ డిస్కష‌న్ ఉంటాయి. ఇందులో అర్హత సాధించిన‌వారికి మిగిలిన 4 రోజుల పాటు స్టేజ్‌-2 ఇంట‌ర్వ్యూలు కొన‌సాగుతాయి. దీనిలో భాగంగా సైక‌లాజిక‌ల్ ప‌రీక్షలు, గ్రూప్ ప‌రీక్షలు, ముఖాముఖి నిర్వహిస్తారు. ఇందులోనూ అర్హత సాధిస్తే ఫిజిక‌ల్ టెస్టు (ఎత్తు, బరువు), వైద్య ఆరోగ్య ప‌రీక్షలు నిర్వహించి తుదిద‌శ నియామ‌కాలు చేప‌డ‌తారు.
 
నేవీలో ఉద్యోగాలెన్నో...
 
శిక్షణ‌..
ఎంపికైన‌వారికి శిక్షణ త‌ర‌గ‌తులు జులై 2018 నుంచి ప్రారంభ‌వుతాయి. అభ్యర్థులు ఇంట‌ర్వ్యూలో సాధించిన మార్కులు, ఖాళీల‌కు అనుగుణంగా ఇండియ‌న్ నేవ‌ల్ అకాడెమీ, ఎజిమాల (కేర‌ళ‌)లో బీటెక్ అప్లైడ్ ఎల‌క్ట్రానిక్స్ అండ్ క‌మ్యూనికేష‌న్ ఇంజినీరింగ్ లేదా ఎల‌క్ట్రానిక్స్ అండ్ క‌మ్యూనికేష‌న్ ఇంజినీరింగ్ లేదా మెకానిక‌ల్ ఇంజినీరింగ్ విద్యను నాలుగేళ్లపాటు అభ్యసిస్తారు. విజ‌య‌వంతంగా కోర్సు పూర్తిచేసుకున్నవారికి జ‌వ‌హ‌ర్‌లాల్ నెహ్రూ యూనివ‌ర్సిటీ (జేఎన్‌యూ)-న్యూదిల్లీ ఇంజినీరింగ్‌ డిగ్రీని ప్రదానం చేస్తుంది. కోర్సు ఫీజు, భోజ‌నం, వ‌స‌తి, దుస్తులు..ఈ ఖ‌ర్చుల‌న్నీ నేవీ భ‌రిస్తుంది. కోర్సు అనంత‌రం స‌బ్ లెఫ్టినెంట్ హోదాతో నేవీలో విధుల్లోకి చేర‌తారు. ఈ స‌మ‌యంలో అన్నీ క‌లుపుకుని నెల‌కు రూ.83 వేల‌కు పైగా వేత‌నంగా పొంద‌వ‌చ్చు.
 
ఇవీ అర్హత‌లు
విద్యార్హత‌: ఫిజిక్స్‌, కెమిస్ట్రీ, మ్యాథ్స్‌ల్లో 70 శాతం మార్కుల‌తో ఇంట‌ర్ ఉత్తీర్ణత‌. దీంతోపాటు ప‌దోత‌ర‌గ‌తి లేదా ఇంట‌ర్ ఇంగ్లిష్‌లో క‌నీసం 60 శాతం మార్కులు సాధించాలి.
వ‌యోప‌రిమితి: 17 - 19 1/2 ఏళ్ల మ‌ధ్యలో ఉండాలి. అంటే జ‌న‌వ‌రి 2, 1999 - జులై 1, 2001 మ‌ధ్య జ‌న్మించిన‌వాళ్లే అర్హులు.
ఇత‌ర అర్హత‌లు: అభ్యర్థులు జేఈఈ మెయిన్ -2017 లో అర్హత సాధించిన‌వారై ఉండాలి. మెయిన్‌లో సాధించిన ర్యాంకు ఆధారంగా షార్ట్‌లిస్ట్ చేసిన వారిని ఎస్ఎస్‌బీ ఇంట‌ర్వ్యూలు నిర్వహిస్తుంది. ఈ పోస్టుల‌కు అవివాహిత పురుష అభ్యర్థులు మాత్రమే అర్హులు. ఎత్తు క‌నీసం 157 సెం.మీ. ఉండాలి. ఎత్తుకు త‌గ్గ బ‌రువు త‌ప్పనిస‌రి.
 
ద‌ర‌ఖాస్తులు
ఆన్‌లైన్‌లోనే ద‌ర‌ఖాస్తు చేసుకోవాలి. అనంత‌రం ప్రింట‌వుట్లు తీసుకోవాలి. ఒక సెట్ ప్రింట‌వుట్‌ను రిఫ‌రెన్స్ కోసం ఉంచుకోవాలి. ఒక సెట్ ప్రింట‌వుట్‌ను ఎస్ఎస్‌బీ ఇంట‌ర్వ్యూకు తీసుకుని వెళ్లాలి.
 
ఆన్‌లైన్ రిజిస్ట్రేష‌న్‌కు చివ‌రి తేదీ: న‌వంబ‌రు 30
 
వెబ్‌సైట్‌: https://www.joinindiannavy.gov.in/
 
 ఇంటర్‌తో నావిక్‌ కొలువులు

భారతీయ తీర గస్తీ దళం (ఇండియన్‌ కోస్టు గార్డు) నావిక్‌ (జనరల్‌ డ్యూటీ) 10+2 ఎంట్రీ పోస్టుల భర్తీకి ప్రకటన విడుదలచేసింది. ఇంటర్‌ అర్హతతో వీటికి పోటీ పడవచ్చు. ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి. రాతపరీక్ష, శరీరదార్ఢ్య, వైద్య పరీక్షల ద్వారా నియామకాలు చేపడతారు. ఎంపికైనవారికి ఫిబ్రవరి నుంచి శిక్షణ మొదలవుతుంది. ఉద్యోగంలో చేరిన మొదటి నెల నుంచే రూ.35,000 వరకు వేతన రూపంలో పొందవచ్చు.
 
యాభై శాతం మార్కులతో ఇంటర్మీడియట్‌ (ఎంపీసీ గ్రూప్‌) ఉత్తీర్ణులైనవారు నావిక్‌ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. మ్యాథ్స్‌, ఫిజిక్స్‌ల్లో కనీసం 50 శాతం మార్కులు ఉండాలి. ఎస్సీ, ఎస్టీలైతే 45 శాతం సరిపోతుంది.
 
వయసు కనిష్ఠంగా 18 ఏళ్లు, గరిష్ఠంగా 22 ఏళ్లు ఉండాలి. అంటే ఫిబ్రవరి 1, 1998- జనవరి 31, 2002ల మధ్య అభ్యర్థులు జన్మించి ఉండాలి. ఎస్సీ, ఎస్టీలకు అయిదేళ్లు; ఓబీసీలకు మూడేళ్లు గరిష్ఠ వయసులో సడలింపు ఉంది.
 
పరీక్షల్లో నెగ్గి ఎంపికైనవారికి ప్రాథమిక శిక్షణ ఐఎన్‌ఎస్‌ చిల్కలో ప్రారంభమవుతుంది. ఇక్కడ మరోసారి వైద్య పరీక్షలు నిర్వహిస్తారు. విజయవంతంగా శిక్షణ పూర్తిచేసుకున్నవారికి పోస్టింగు ఇస్తారు. విధుల్లో చేరినవారికి రూ.21,700 మూలవేతనం చెల్లిస్తారు. దీనికి డీఏ, హెచ్‌ఆర్‌ఏ ఇతర అలవెన్సులు అదనం. వేతనంతోపాటు ఇతర ప్రయోజనాలు (క్యాంటీన్‌, వసతి, దుస్తులు, ఎల్‌టీసీ...మొదలైనవి) ఉంటాయి. అన్ని ప్రోత్సాహకాలూ కలుపుకుని రూ.35 వేల వరకు వేతన రూపంలో పొందవచ్చు. భవిష్యత్తులో ప్రధానాధికారి హోదా వరకూ చేరుకోవచ్చు.
 
రాత పరీక్ష ఇలా..
సెప్టెంబరులో పరీక్షలు ఉంటాయి. ఈ పరీక్షను ఆబ్జెక్టివ్‌ విధానంలో నిర్వహిస్తారు. ఇంటర్‌ మ్యాథ్స్‌, ఫిజిక్స్‌, బేసిక్‌ కెమిస్ట్రీలతోపాటు ఆంగ్లభాషా పరిజ్ఞానం అంశాల్లో ప్లస్‌ 2 (ఇంటర్మీడియట్‌) స్థాయిలో ప్రశ్నలు ఉంటాయి. జనరల్‌ నాలెడ్జ్‌, కరెంట్‌ అఫైర్స్‌, క్వాంటిటేటివ్‌ ఆప్టిట్యూడ్‌, రీజనింగ్‌ల నుంచీ ప్రశ్నలు వస్తాయి. రాత పరీక్షలో అర్హత సాధించినవారికి శరీరదార్ఢ్య పరీక్షలు నిర్వహిస్తారు.

అభ్యర్థుల వివరాలను రాతపరీక్ష సమయంలో పరిశీలిస్తారు. పరీక్షకు వెళ్లేటప్పుడే పదోతరగతి, ఇంటర్‌ ఒరిజినల్‌ సర్టిఫికెట్లు, ఫొటోలు, ఏదైనా ఐడీ, సర్టిఫికెట్ల నకళ్లు తీసుకెళ్లాలి.
 
శరీరదార్ఢ్య పరీక్ష (పీఈటీ): ఎత్తు కనీసం 157 సెం.మీ. ఉండాలి. ఊపిరి పీల్చకముందు, పీల్చిన తర్వాత ఛాతీ కొలత వ్యత్యాసం కనీసం 5 సెం.మీ. ఉండాలి. ఈ విభాగంలో అర్హత సాధించడానికి 7 నిమిషాల్లో 1.6 కి.మీ. దూరం పరుగెత్తాలి. 20 గుంజీలు, 10 పుష్‌అప్‌లు తీయగలగాలి. పీఈటీలో అర్హత పొందితే వైద్య పరీక్షలు నిర్వహిస్తారు. స్పష్టమైన కంటిచూపు ఉండాలి, వినికిడి లోపం ఉండకూడదు.
 
తుది ఎంపిక: రాతపరీక్ష, పీఈటీ, మెడికల్‌ టెస్టుల్లో ఉత్తీర్ణులైనవారితో తుది నియామకాలు చేపడతారు. ఎంపికైనవారి వివరాలను కోస్ట్‌గార్డు వెబ్‌సైట్‌లో ఉంచుతారు.
 
ముఖ్యమైన తేదీలు
ఆన్‌లైన్‌ దరఖాస్తుల ప్రారంభం: 26.08.2019
ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరి తేదీ: 01.09.2019
పరీక్ష కేంద్రం: ఏపీ విద్యార్థులకు విశాఖపట్నం. తెలంగాణ అభ్యర్థులకు సికింద్రాబాద్‌.
వెబ్‌సైట్‌: 
https://www.joinindiancoastguard.gov.in/

త్రివిధ దళాల్లోకి తిరుగులేని దారి

 కంబైన్డ్ డిఫెన్స్ సర్వీసెస్ ఎగ్జామినేషన్ (1)- 2021 నోటిఫికేషన్ విడుదల

భారత త్రివిధ దళాల్లో చేరి దేశ సేవలో భాగస్వాములు కావాలనుందా? చిన్న వయసులోనే రక్షణ రంగంలో అత్యున్నత స్థాయికి చేరుకోవాలనుకుంటున్నారా? జీవితంలో సవాళ్లను స్వీకరించాలని ఉందా? అయితే కంబైన్డ్ డిఫెన్స్ సర్వీసెస్ ఎగ్జామినేషన్ (సీడీఎస్ఈ) మీకు ఆ అవకాశం కల్పిస్తోంది. డిగ్రీ పూర్తి చేసిన పాతికేళ్ల లోపు యువతకు ఈ పరీక్ష వరంలాంటిది. ఆసక్తితోపాటు ప్రతిభావంతులైన యువతను గుర్తించి, వారి ప్రతిభకు పదునుపెట్టి, సుశిక్షితులుగా తీర్చిదిద్దడానికి ఆర్మీ, నేవీ, ఎయిర్ఫోర్స్ ఎదురుచూస్తున్నాయి. ఇందులో ఎంపికైతే గౌరవం, హోదా లభిస్తాయి. ఆర్థికంగానూ మంచి అభివృద్ధి ఉంటుంది. శిక్షణ కాలం నుంచే పెద్ద వేతనాన్ని పొందవచ్చు.  ‌సీడీఎస్ ప‌రీక్ష యూపీఎస్సీ ఆధ్వ‌ర్యంలో జ‌రుగుతుంది.

ఖాళీలు.. దరఖాస్తు ప్రక్రియ

మొత్తం ఖాళీలు: 345, ఇండియన్ మిలిటరీ అకాడమీ, డెహ్రాడూన్-100, ఇండియన్ నేవెల్ అకాడమీ, ఎజిమళ -26 , ఎయిర్ ఫోర్స్ అకాడమీ, హైదరాబాద్-32, ఆఫీసర్స్ ట్రైనింగ్ అకాడమీ, చెన్నై(ఎస్ఎస్సీ మెన్ నాన్ టెక్నికల్)-170, ఆఫీసర్స్ ట్రైనింగ్ అకాడమీ, చెన్నై (ఎస్ఎస్సీ విమెన్ నాన్ టెక్నికల్)-17.

దరఖాస్తు: వెబ్సైట్ 
http://upsconline.nic.in ద్వారా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి. చివరి తేది నవంబరు 17, 2020 సాయంత్రం 6 గంటల వరకు. అర్హత కలిగిన అభ్యర్థులు పరీక్ష తేదీ మూడు వారాల ముందు నుంచి ఈ-అడ్మిట్కార్డులను వెబ్సైట్ http://upsc.gov.in నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు.

పరీక్ష ఫీజు:  రూ.200 (మహిళలు, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు చెల్లించాల్సిన అవసరం లేదు). ఆన్లైన్ లేదా ఎస్బీఐ బ్రాంచిలో చెల్లించవచ్చు.

తెలుగు రాష్ట్రాల్లో పరీక్ష కేంద్రాలు: హైదరాబాద్,తిరుపతి, విశాఖపట్నం.

అర్హతలు
25 సంవత్సరాల లోపు వయసుతో పాటు అవివాహితులై ఉండాలి. ఏదైనా డిగ్రీ పూర్తి చేసిన వారు అర్హులు. ఇండియన్ మిలటరీ, ఇండియన్ నేవెల్ అకాడమీ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు 2 జ‌న‌వ‌రి 1998 - 1 జ‌న‌వ‌రి 2003 మ‌ధ్య జ‌న్మించిన వారు అర్హులు... ఎయిర్ ఫోర్స్ అకాడమీ పోస్టులకైతే జనవరి 1, 2022 నాటికి 20 నుంచి 24 ఏళ్ల వయసు మధ్య ఉండాలి. జనవరి 2, 1998 ముందు, జనవరి 1, 2002 తర్వాత జన్మించిన వారు అర్హులు కారు. ఆఫీసర్స్ ట్రైనింగ్ అకాడమీ పోస్టులకు జనవరి 2, 1997 ముందు, జనవరి 1, 2003 తర్వాత జన్మించి ఉండకూడదు.

సీడీఎస్ఈలో ఎంపిక ఇలా..

డిగ్రీ పూర్త‌యిన యువ‌త డిఫెన్స్ రంగంలో ఉద్యోగంలో స్థిర‌ప‌డాలంటే కంబైన్డ్ డిఫెన్స్ సర్వీసెస్ ఎగ్జామినేషన్ (సీడీఎస్ఈ) మంచి మ‌ర్గాన్ని చూపుతుంది. ఇందుకు అనుగుణంగా సీడీఎస్ఈ ఎంపికరెండు దశల్లో జరుగుతుంది. మొద‌టి స్టేజ్లో రాత పరీక్ష, త‌రువాతి స్టేజ్లో ఇంటెలిజెన్స్ అండ్ పర్సనాలిటీ, వైద్య పరీక్షలు నిర్వహిస్తారు.  
రాత పరీక్షలో ఇంగ్లిష్, జనరల్ నాలెడ్జ్, ఎలిమెంటరీ మ్యాథమేటిక్స్ అంశాల నుంచి ప్రశ్నపత్రాలు అడుగుతారు. ఒక్కో పేపర్కు 100 మార్కుల చొప్పున మొత్తం 300 మార్కులకు పరీక్ష ఉంటుంది. ఈ మూడు విభాగాలకు రెండు గంటల చొప్పున సమయం కేటాయించారు. ఆఫీసర్స్ ట్రైనింగ్ అకాడమీ పోస్టులకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు ఎలిమెంటరీ మ్యాథమేటిక్స్ ప్రశ్నపత్రం లేదు. అన్ని విభాగాల్లోని ప్రశ్నలకు బహుళైచ్ఛిక రూపంలోనే సమాధానాలు రాయాల్సి ఉంటుంది. జవాబు తప్పుగా రాస్తే రుణాత్మక మార్కులు ఉంటాయి. ఇంగ్లిష్ విభాగం మినహా మిగిలిన ప్రశ్నపత్రాలు ఇంగ్లిష్, హిందీ మాధ్యమాల్లో ఇస్తారు. ఈ రాత పరీక్షలో ఎంపికైతే స్టేజ్కు అర్హత లభిస్తుంది. స్టేజ్లో నిర్వహించే ఇంటెలిజెన్స్ అండ్ పర్సనాలిటీ టెస్ట్ మిగిలిన ఇంటర్వ్యూలతో పోలిస్తే కఠినతరమైనదనే చెప్పవచ్చు. ఇది అయిదు రోజులపాటు కొనసాగుతుంది. ఇంటర్వ్యూ, గ్రూప్ టెస్ట్లు, సైకలాజికల్  పరిశీలనల ద్వారా అభ్యర్థుల తీరును క్షుణ్ణంగా సర్వీస్ సెలక్షన్ బోర్డు పరీక్షిస్తుంది. ఏపీ, తెలంగాణ రాష్ట్రాలవిద్యార్థులకు బెంగళూరు కేంద్రంలో ఇవి జరుగుతాయి. ఇందులో ఎంపికైతే వైద్య పరీక్షలు నిర్వహించి శిక్షణకు ఎంపిక చేస్తారు. ఎంపికైన వారు ఆర్మీలో చేరితే లెఫ్టినెంట్, నేవీలో సబ్ లెప్టినెంట్, ఎయిర్ఫోర్స్లో ఫ్లయింగ్ ఆఫీసర్ హోదాలు లభిస్తాయి.

సిలబస్ అవగాహన

ఇంగ్లిష్: అభ్యర్థి ఆంగ్లభాషను ఏ విధంగా అర్థం చేసుకుంటున్నారో పరీక్షించేలా ఈ విభాగంలో ప్రశ్నలు ఉంటాయి.

జనరల్ నాలెడ్జ్: వర్తమాన అంశాలకు ప్రాధాన్యం ఉంటుంది. సైన్స్ అండ్ టెక్నాలజీ, భారతదేశ చరిత్ర, భౌగోళిక శాస్త్ర అంశాలపై అభ్యర్థి అవగాహనను పరీక్షిస్తారు. ఎక్కువ ప్రశ్నలు దైనందిన జీవితానికి, ముఖ్యమైన కరెంట్ అఫైర్స్కు సంబంధించనవే ఉంటాయి.

ఎలిమెంటరీ మ్యాథమేటిక్స్: ఇందులో అడిగే ప్రశ్నలు పదో తరగతి స్థాయిలోనే ఉంటాయి. అరిథ్మెటిక్, బీజగణితం, జ్యామితి, త్రికోణమితి, క్షేత్రగణితం, స్టాటిస్టిక్స్ టాపిక్ల నుంచి అడుగుతారు.

ఎడ్యుకేష‌న్ విభాగంలో ఎంపిక ఇలా..

నేవీ రంగంలో ఉద్యోగంలో స్థిర‌ప‌డాలని యువ‌త ఎంతో ఎదురుచూస్తోంది. ఇందులో వివిధ విభాగాల్లో ఉద్యోగాలు క‌ల్పిస్తున్నారు. అందులో భాగంగా ఎడ్యుకేష‌‌న్ ఆఫీస‌ర్ హోదాతో ఉద్యోగాలు ఉంటాయి. ఈ విభాగంలోని పోస్టుల‌ను ప‌ర్మనెంట్ క‌మిష‌న్‌, షార్ట్ స‌ర్వీస్ క‌మిష‌న్ రెండు విభాగాల ద్వారా భ‌ర్తీ చేస్తారు.

ప‌ర్మనెంట్ క‌మిష‌న్ (పీసీ)
అర్హత‌: మెకానిక‌ల్‌/ ఐటీ/ కంప్యూట‌ర్ సైన్స్ బ్రాంచ్‌ల్లో 60 శాతం మార్కుల‌తో బీఈ/ బీటెక్‌. లేదా మెకానిక‌ల్‌, కంప్యూట‌ర్ సైన్స్‌, ఐటీ, మెటీరియాల‌జీ, ఓష‌నోగ్రఫీలో 60 శాతం మార్కుల‌తో ఎంటెక్ లేదా ఫిజిక్స్‌, మ్యాథ్స్‌, ఆప‌రేష‌న‌ల్ రీసెర్చ్‌, ఎనాల‌సిస్‌, మెటీరియాల‌జీ, ఓష‌నోగ్రఫీ లో 50 శాతం మార్కుల‌తో ఎమ్మెస్సీ లేదా 50 శాతం మార్కుల‌తో ఎంఏ ఇంగ్లిష్‌, హిస్టరీ.
వ‌యోప‌రిమితి: 21-25 ఏళ్లు (పురుషులు మాత్రమే అర్హులు)

షార్ట్ స‌ర్వీస్ క‌మిష‌న్ (ఎస్ఎస్‌సీ)
అర్హత‌: మెకానిక‌ల్‌/ ఐటీ/ కంప్యూట‌ర్ సైన్స్ బ్రాంచ్‌ల్లో 60 శాతం మార్కుల‌తో బీఈ/ బీటెక్‌. లేదా మెకానిక‌ల్‌, కంప్యూట‌ర్ సైన్స్‌, ఐటీ, మెటీరియాల‌జీ, ఓష‌నోగ్రఫీ, అట్మాస్ఫిరిక్ సైన్సెస్‌లో 60 శాతం మార్కుల‌తో ఎంటెక్ లేదా ఫిజిక్స్‌, మ్యాథ్స్‌, ఆప‌రేష‌న‌ల్ రీసెర్చ్‌, ఎనాల‌సిస్‌, మెటీరియాల‌జీ, ఓష‌నోగ్రఫీ, అట్మాస్ఫిరిక్ సైన్సెస్‌ లో 60 శాతం మార్కుల‌తో ఎమ్మెస్సీ
వ‌యోప‌రిమితి: 21-25 ఏళ్లు (మ‌హిళ‌లు కూడా ద‌ర‌ఖాస్తు చేసుకోవ‌చ్చు)

మెడిక‌ల్ విభాగం
నేవీ ఆస్పత్రుల్లో వైద్యులుగా సేవ‌లందించ‌డానికి మెడిక‌ల్ విభాగంలో పోస్టులు భ‌ర్తీ చేస్తారు. ప‌ర్మనెంట్ క‌మిష‌న్‌, షార్ట్ స‌ర్వీస్ క‌మిష‌న్ విధానంలో వైద్యుల‌ను ఎంపిక చేస్తారు.
షార్ట్ స‌ర్వీస్ క‌మిష‌న్‌
ఈ విధానంలో ఏడాదికి రెండుసార్లు వైద్య పోస్టులు భ‌ర్తీ చేస్తారు. మ‌హిళ‌లు కూడా డాక్టర్ పోస్టుల‌కు అర్హులే. అభ్యర్థుల‌ను ఇంట‌ర్వ్యూ, మెడిక‌ల్ టెస్టుల ద్వారా ఉద్యోగానికి భ‌ర్తీ చేస్తారు. వ‌యోప‌రిమితి గ‌రిష్ఠంగా 45 ఏళ్లకు మించ‌రాదు.

ప‌ర్మనెంట్ క‌మిష‌న్‌
ఈ విధానంలో ఎంపికైన‌వాళ్లు ఫుల్ టైం ఉద్యోగిగా కొన‌సాగొచ్చు. ఏడాదికి ఒక‌సారి ప్రక‌ట‌న వెలువ‌డుతుంది. వ‌యోప‌రిమితి ఎంబీబీఎస్ పూర్తిచేసినవాళ్లైతే 30 ఏళ్లు, పీజీ డిప్లొమా అభ్యర్థులైతే 31 ఏళ్లు, పీజీ పూర్తిచేసిన‌వాళ్లైతే 35 ఏళ్లు.

ఉమెన్ ఎంట్రీ
ఎగ్జిక్యూటివ్ విభాగంలో: ఎస్ఎస్‌సీ- ఏటీసీ, అబ్జర్వర్‌, లా, లాజిస్టిక్స్ బ్రాంచ్‌ల్లో చేర‌డానికి మ‌హిళ‌లు అర్హులు.
ఎడ్యుకేష‌న్ విభాగంలో: ఎస్ఎస్‌సీ-ఎడ్యుకేష‌న్ బ్రాంచ్‌లో మ‌హిళ‌లు చేరొచ్చు.
ఇంజినీరింగ్ విభాగంలో: ఎస్ఎస్‌సీ-నేవ‌ల్ ఆర్కిటెక్చర్‌, ఎస్ఎస్‌సీ-యూనివ‌ర్సిటీ ఎంట్రీ స్కీం ద్వారా నేవ‌ల్ ఆర్కిటెక్చర్ బ్రాంచ్‌ల్లో చేరొచ్చు.

వెబ్‌సైట్లు: http://nausena-bharti.nic.in, https://www.upsc.gov.in/

టెన్త్‌తో కోస్ట్‌గార్డ్ కొలువు

 50 ఖాళీలతో ప్రకటన విడుదల
 
పదోతరగతి విద్యార్హతతో నావిక్‌ పోస్టుల భర్తీకి ఇండియన్‌ కోస్ట్‌ గార్డ్‌ ప్రకటన విడుదలచేసింది. ఎంపికైనవారిని డొమెస్టిక్‌ బ్రాంచ్‌ కుక్, స్టివార్డ్‌ హోదాల్లో తీసుకుంటారు. రాత పరీక్ష, దేహదార్ఢ్య, వైద్య పరీక్షల ద్వారా నియామకాలు చేపడతారు. ఉద్యోగంలో చేరినవారికి ప్రారంభంలో రూ.21,700 మూలవేతనంగా చెల్లిస్తారు. అన్ని అలవెన్సులతో కలుపుకుని మొదటి నెల నుంచే రూ.35,000 వేతనం రూపంలో పొందవచ్చు. పురుష అభ్యర్థులకే ఈ అవకాశం!  
 
నావిక్‌ ఉద్యోగానికి నిర్వహించే రాత పరీక్ష ఆబ్జెక్టివ్‌ తరహాలో ఉంటుంది. క్వాంటిటేటివ్‌ ఆప్టిట్యూడ్, మ్యాథ్స్, జనరల్‌ సైన్స్, జనరల్‌ ఇంగ్లిష్, జనరల్‌ అవేర్‌నెస్‌ (కరెంట్‌ అఫైర్స్, జనరల్‌ నాలెడ్జ్‌), రీజనింగ్‌ (వెర్బల్‌ అండ్‌ నాన్‌ వెర్బల్‌) అంశాల నుంచి ప్రశ్నలు వస్తాయి. అభ్యర్థులు పరీక్ష కేంద్రానికి ఫొటోను జతచేసిన మూడు అడ్మిట్‌ కార్డులు, పదో తరగతి ఒరిజినల్‌ సర్టిఫికెట్, మార్కుల పత్రం, ఎస్సీ, ఎస్టీ, ఓబీసీలైతే కుల ధ్రువీకరణ సర్టిఫికెట్‌; డొమిసైల్‌ సర్టిఫికెట్, ఏదో ఒక గుర్తింపు పత్రం (ఓటర్‌ ఐడీ లేదా పాన్‌కార్డు లేదా ఆధార్‌ కార్డు లేదా కాలేజీ ఐడీ) తీసుకెళ్లాలి. వీటన్నింటికీ 3 సెట్ల ఫొటో కాపీలు తీసుకెళ్లాలి.
 
దేహదార్ఢ్య పరీక్షలు
రాత పరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థులకు దేహదార్ఢ్య పరీక్షలు నిర్వహిస్తారు. ఇందులో భాగంగా 1.6 కి.మీ. దూరాన్ని 7 నిమిషాల్లో పూర్తిచేయాలి. స్క్వేట్‌ అప్స్‌- 20, పుష్‌అప్స్‌ -10 తీయగలగాలి. అభ్యర్థులు కనీసం 157 సెం.మీ. ఎత్తు ఉండాలి. ఊపిరి పీల్చక ముందు, పీల్చిన తర్వాత ఛాతీ కొలతలో వ్యత్యాసం కనీసం 5 సెం.మీ. రావాలి. దేహదార్ఢ్య పరీక్షలో అర్హత సాధించినవారికి వైద్యపరీక్షలు నిర్వహిస్తారు. ఇందులోనూ విజయవంతమైతే రాత పరీక్షలో చూపిన ప్రతిభ ప్రాతిపదికన మెరిట్‌ ఆధారంగా తుది నియామకాలు చేపడతారు. జోన్లవారీ ఎంపికైన అభ్యర్థుల వివరాలను మార్చిలో ఇండియన్‌ కోస్ట్‌ గార్డు వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచుతారు.

ఎంపికైతే... 
అన్ని దశలూ విజయవంతంగా పూర్తిచేసుకుని ఎంపికైన అభ్యర్థులకు ఏప్రిల్‌ నుంచి ఐఎన్‌ఎస్‌ చిల్కలో శిక్షణ మొదలవుతుంది. శిక్షణ ప్రారంభానికి ముందే మరోసారి మెడికల్‌ పరీక్షలు నిర్వహిస్తారు. ఇందులో అర్హత సాధించినవారికి మాత్రమే శిక్షణ ఉంటుంది. శిక్షణ పూర్తయ్యాక విధుల్లోకి తీసుకుంటారు. కుక్‌గా ఎంపికైనవారు కోస్ట్‌ గార్డు ఉద్యోగులకు మెనూ ప్రకారం శాకాహార, మాంసాహార వంటకాలు తయారుచేయాల్సి ఉంటుంది. స్టివార్డ్‌గా విధుల్లో చేరినవాళ్లు భోజన వడ్డన, హౌస్‌ కీపింగ్, స్టోర్స్‌ నిర్వహణ తదితర సహకార పనులు చేయాల్సి ఉంటుంది. భవిష్యత్తులో వీరు ప్రధాన అధికారి (లెవెల్‌ 8) హోదా వరకు చేరుకోవచ్చు.

ముఖ్యమైన అంశాలు
ఖాళీలు: 50. వీటిలో అన్‌ రిజర్వ్‌ డ్‌ 20, ఓబీసీ 14, ఎస్సీ 8, ఎస్టీ 3, ఈడబ్ల్యుఎస్‌ 5 ఉన్నాయి. 
అర్హత: పదోతరగతిలో 50 శాతం మార్కులతో ఉత్తీర్ణత (ఎస్సీ, ఎస్టీ విద్యార్థులైతే 45 శాతం). పురుష విద్యార్థులు అర్హులు. 
వయసు: ఏప్రిల్‌ 1, 2021 నాటికి 18 - 22 ఏళ్లలోపు ఉండాలి. అంటే ఏప్రిల్‌ 1, 1999 - మార్చి 31, 2003 మధ్య జన్మించినవారే అర్హులు. ఎస్సీ, ఎస్టీలకు అయిదేళ్లు; ఓబీసీలకు మూడేళ్లు గరిష్ఠ వయసులో సడలింపులు వర్తిస్తాయి. 
ఎంపిక విధానం: రాత పరీక్ష, దేహదార్ఢ్య పరీక్ష, వైద్య పరీక్షల ద్వారా ఆన్‌లైన్‌ దరఖాస్తులు: నవంబరు 30 నుంచి 
సమర్పణకు గడువు: డిసెంబరు 7 సాయంత్రం 5 వరకు 
రాత పరీక్ష: జనవరిలో నిర్వహిస్తారు.
తెలుగు రాష్ట్రాల విద్యార్థులకు పరీక్ష కేంద్రం: విశాఖపట్నం.
వెబ్‌సైట్‌: 
https://joinindiancoastguard.gov.in/

ఇంజినీరింగ్ అర్హ‌త‌తో ఉద్యోగాలు

ఇంజినీరింగ్ బ్రాంచ్ (నావ‌ల్ ఆర్కిటెక్ట్‌)

నిరుద్యోగ‌ యువ‌త‌కు భార‌త నౌకాద‌ళం ఉద్యోగావ‌కాశాలు క‌ల్పిస్తోంది. ప‌దోత‌ర‌గ‌తి మొద‌లు డిగ్రీ, ఇంజినీరింగ్ ఆపై చ‌దువులున్న వారికి ప్రత్యేక‌మైన ఉద్యోగాలెన్నో నేవీలో ఉన్నాయి. త‌క్కువ అర్హత‌తో చేరిన‌ప్పటికీ కెరీర్‌లో ఎదుగుద‌ల‌కూ అవ‌కాశాలు ఉన్నాయి. నేవీలో ఇంజినీరింగ్ అర్హ‌త‌తో ఉద్యోగాలు, వాటికి కావాల్సిన అర్హత‌లేమిటో చూద్దాం...

10+2 (బీటెక్‌) క్యాడెట్ ఎంట్రీ
అర్హత‌: ఫిజిక్స్‌, కెమిస్ట్రీ, మ్యాథ్స్‌ల‌తో ఇంట‌ర్ ఉత్తీర్ణత‌. దీంతోపాటు పీసీఎంలో క‌నీసం 70 శాతం మార్కులు సాధించాలి. అలాగే టెన్త్ లేదా ఇంట‌ర్ ఇంగ్లిష్‌లో క‌నీసం 50 శాతం మార్కులు ఉండాలి.(పురుషులు మాత్రమే అర్హులు)
వ‌యోప‌రిమితి: 16 1/2-19 ఏళ్లు

షార్ట్ స‌ర్వీస్ క‌మిష‌న్ ఎంట్రీ
అర్హత‌: మెకానిక‌ల్‌/ సివిల్‌/ ఏరోనాటిక్స్‌/ మెట‌ల‌ర్జిక‌ల్‌/ ఏరోస్పేస్ ఇంజినీరింగ్ బ్రాంచ్‌లో 60 శాతం మార్కుల‌తో బీఈ/ బీటెక్ ఉత్తీర్ణత‌
వ‌యోప‌రిమితి: 21-25 ఏళ్లు (మ‌హిళ‌లు కూడా ద‌ర‌ఖాస్తు చేసుకోవ‌చ్చు)

యూనివ‌ర్సిటీ ఎంట్రీ స్కీం (ఎస్ఎస్‌సీ)
అర్హత‌: 60 శాతం మార్కుల‌తో నావ‌ల్ ఆర్కిటెక్చర్‌, మెకానిక‌ల్‌, సివిల్‌, ఏరోనాటిక‌ల్‌, మెట‌ల‌ర్జిక‌ల్‌, ఏరోస్పేస్ ఇంజినీరింగ్‌లో బీఈ/ బీటెక్ లేదా బీ ఆర్క్‌
వ‌యోప‌రిమితి: 19-24 ఏళ్లు (మ‌హిళ‌లు కూడా అర్హులే)

స్పెష‌ల్ నావ‌ల్ ఆర్కిటెక్ట్ ఎంట్రీ స్కీం (ఎస్ఎన్ఎఇఎస్‌)
అర్హత‌: నావ‌ల్ ఆర్కిటెక్చర్‌లో 60 శాతం మార్కుల‌తో బీఈ/ బీటెక్‌
ఎంపిక విధానం: క్యాంప‌స్ రిక్రూట్‌మెంట్ ద్వారా
వ‌యోప‌రిమితి: 21-25 ఏళ్లు (మ‌హిళ‌లు కూడా ద‌ర‌ఖాస్తు చేసుకోవ‌చ్చు)

ఎల‌క్ట్రిక‌ల్ విభాగం
ఇందులో స‌బ్ మెరైన్ ఎలక్ట్రిక‌ల్ ఆఫీసర్ హోదాతో విధులు నిర్వర్తిస్తారు.

క్యాడెట్ ఎంట్రీ (ఎన్‌డీఏ)
అర్హత‌: మ్యాథ్స్‌, ఫిజిక్స్‌తో ఇంట‌ర్ ఉత్తీర్ణత (పురుషులు మాత్రమే అర్హులు)
వ‌యోప‌రిమితి: 16 1/2- 19 ఏళ్లు

10+2 బీటెక్ క్యాడెట్ ఎంట్రీ
అర్హత‌: ఎంపీసీ గ్రూప్‌తో ఇంట‌ర్ ఉత్తీర్ణత‌. అలాగే ఫిజిక్స్‌, కెమిస్ట్రీ, మ్యాథ్స్ స‌బ్జెక్టుల్లో క‌నీసం 70 శాతం మార్కులు సాధించాలి. దీంతోపాటు టెన్త్ లేదా ఇంట‌ర్ ఇంగ్లిష్‌లో 50 శాతం మార్కులు త‌ప్పనిస‌రి.

యూనివ‌ర్సిటీ ఎంట్రీ స్కీం (ఎస్ఎస్‌సీ)
అర్హత‌: ఎల‌క్ట్రిక‌ల్‌, ఎల‌క్ట్రానిక్స్‌, ప‌వ‌ర్ ఇంజినీరింగ్‌, ఇన్‌స్ట్రుమెంటేష‌న్ అండ్ కంట్రోల్‌, ఎల‌క్ట్రానిక్స్ అండ్ ఇన్‌స్ట్రుమెంటేష‌న్‌, ఎల‌క్ట్రానిక్స్ అండ్ క‌మ్యూనికేష‌న్‌, ఇన్‌స్ట్రుమెంటేష‌న్ అండ్ కంట్రోల్‌, కంట్రోల్ సిస్టం, ప‌వ‌ర్ ఎల‌క్ట్రానిక్స్, కంప్యూట‌ర్ సైన్స్ ఇంజినీరింగ్‌, ఇన్‌స్ట్రుమెంటేష‌న్ ఇంజినీరింగ్‌లో బీఈ/ బీటెక్‌లో అప్పటిదాకా 60 శాతం మార్కుల‌తో ఫైన‌ల్‌, ప్రీ ఫైన‌ల్ విద్యార్థులు అర్హులు.
వ‌యోప‌రిమితి: ప్రి ఫైన‌ల్ ఇయ‌ర్ విద్యార్థులైతే 19 1/2- 25 ఏళ్లు, ఫైన‌ల్ ఇయ‌ర్ విద్యార్థులైతే 19-24 ఏళ్లు (పురుషులు మాత్రమే అర్హులు)

షార్ట్ స‌ర్వీస్ క‌మిష‌న్ (జీఎస్‌)
అర్హత‌: క‌నీసం 60 శాతం మార్కుల‌తో ఏదైనా విభాగంలో బీఈ/ బీటెక్ ఉత్తీర్ణత (పురుషులు మాత్రమే అర్హులు)
వ‌యోప‌రిమితి: 19 1/2- 25 ఏళ్లు

షార్ట్ స‌ర్వీస్ క‌మిష‌న్ (స‌బ్‌మెరైన్‌)
అర్హత‌: ఎల‌క్ట్రిక‌ల్‌, ఎల‌క్ట్రానిక్స్‌, కంట్రోల్ ఇంజినీరింగ్‌, టెలిక‌మ్యూనికేష‌న్ ఇంజినీరింగ్‌లో ఎందులోనైనా 60 శాతం మార్కుల‌తో బీఈ/ బీటెక్‌
వ‌యోప‌రిమితి: 19 1/2-25 ఏళ్లు (పురుషులు మాత్రమే అర్హులు)

నేవీలో ఉద్యోగాలెన్నో...

ఆస‌క్తి ఉన్న యువ‌త‌కు భార‌త నౌకాద‌ళం ఆహ్వానం ప‌లుకుతోంది. ప‌దోత‌ర‌గ‌తి, ఇంట‌ర్‌, ఇంజినీరింగ్‌, డిగ్రీ, పీజీ ఇలా ప్రతి కోర్సుకూ సంబంధించి ప్రత్యేక‌మైన ఉద్యోగాలెన్నో నేవీలో ఉన్నాయి. త‌క్కువ అర్హత‌తో చేరిన‌ప్పటికీ కెరీర్‌లో ఎదుగుద‌ల‌కూ అవ‌కాశాలు ఉన్నాయి. ఎంపికైన‌వారికి ఆక‌ర్షణీయ వేత‌నంతోపాటు ప‌లు ర‌కాల ప్రోత్సాహకాలు ల‌భిస్తాయి. నేవీలో వివిధ విభాగాల్లో ఉన్న ఉద్యోగాలు, వాటికి కావాల్సిన అర్హత‌లేమిటో చూద్దాం...
 
సైల‌ర్ ఎంట్రీ
సైల‌ర్ పోస్టుల కోసం ఏటా రెండు సార్లు నావికాద‌ళం ప్రక‌ట‌న విడుద‌ల‌చేస్తుంది. సైల‌ర్‌గా ఎంపికైన‌వాళ్లు ఎగ్జిక్యూటివ్ బ్రాంచ్‌, ఏవియేష‌న్ బ్రాంచ్‌, స‌బ్ మెరైన్ బ్రాంచ్‌, ఎల‌క్ట్రిక‌ల్ బ్రాంచ్‌, ఇంజినీరింగ్ బ్రాంచ్‌, మెడిక‌ల్ బ్రాంచ్‌ల్లో చేరొచ్చు.సాధార‌ణంగా సైల‌ర్ పేరుతో నాలుగు ర‌కాల పోస్టుల‌కు ప్రక‌ట‌న వెలువ‌డుతుంది. అవి...ఆర్టిఫీషియ‌ల్ అప్రెంటిస్‌, సీనియ‌ర్ సెకండ‌రీ రిక్రూట్‌, మెట్రిక్ రిక్రూట్ అండ్ నాన్ మెట్రిక్ రిక్రూట్‌, మ్యుజీషియ‌న్స్‌. వీటి గురించి వివరంగా ..

ఆర్టిఫీషియ‌ల్ అప్రెంటిస్‌

అర్హత‌: ఫిజిక్స్‌, కెమిస్ట్రీ, మ్యాథ్స్‌ల‌తో ఇంట‌ర్ ఉత్తీర్ణత‌
వ‌యోప‌రిమితి: 17-20 ఏళ్లు
ఎంపిక‌: రాత ప‌రీక్ష, ఫిజిక‌ల్ టెస్ట్‌, మెడిక‌ల్ టెస్ట్‌ల ద్వారా
శిక్షణ‌: ఎంపికైన‌వాళ్లకు 9 వారాల ప్రాథ‌మిక శిక్షణ చిల‌క స‌ర‌స్సులో ఉంటుంది. దీంతోపాటు 8 వారాల స‌ముద్ర శిక్షణ నిర్వహిస్తారు. అనంత‌రం నాలుగేళ్లు డిప్లొమాలో ఎలక్ట్రిక‌ల్‌/ మెకానిక‌ల్‌/ ఏరోనాటిక‌ల్ బ్రాంచ్‌ల్లో శిక్షణ ఉంటుంది. అంటే అభ్యర్థులకు ఉద్యోగంతోపాటు ఇంజినీరింగ్‌లో డిప్లొమా కూడా సొంత‌మైన‌ట్టే. ఈ డిప్లొమాతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల్లోని ఉద్యోగాల‌కు ద‌ర‌ఖాస్తు కూడా చేసుకోవ‌చ్చు. ఆర్టిఫీషియ‌ల్ అప్రెంటిస్‌కు ఎంపికైన‌వాళ్లు క‌నీసం 20 ఏళ్లపాటు నేవీలో ప‌నిచేయాల‌నే నిబంధ‌న ఉంది. కావాల‌నుకుంటే ఆ త‌ర్వాత కూడా కొన‌సాగొచ్చు.

సీనియ‌ర్ సెకెండ‌రీ రిక్రూట్‌
అర్హత‌: ఇంట‌ర్‌/ ప్లస్‌2లో ఫిజిక్స్‌, మ్యాథ్స్ కంప‌ల్సరీ స‌బ్జెక్టులుగా; కెమిస్ట్రీ/బ‌యాల‌జీ/ కంప్యూట‌ర్స్ వీటిలో ఏదైనా ఒక‌టి ఆప్షన‌ల్ స‌బ్జెక్టుగా చ‌దివుండాలి.
వ‌యోప‌రిమితి: 17-21 ఏళ్లు

శిక్షణ‌: ఎంపికైన‌వాళ్లకు 24 వారాల బేసిక్ ట్రైనింగ్ ఐఎన్ఎస్ చిల‌క‌లో ఉంటుంది. అనంత‌రం అభ్యర్థుల‌కు కేటాయించిన ట్రేడ్‌లో 24 వారాల ప్రొఫెష‌న‌ల్ ట్రైనింగ్ నేవ‌ల్ సంస్థలో దేశంలో ఎక్కడైనా ఉంటుంది. ఎంపికైన అభ్యర్థులు క‌నీసం 15 ఏళ్లపాటు నేవీలో ప‌నిచేయాలి. అనంత‌రం కావాల‌నుకుంటే స‌ర్వీస్ పొడిగించుకోవ‌చ్చు.

మెట్రిక్ రిక్రూట్‌మెంట్ అండ్ నాన్ మెట్రిక్ రిక్రూట్‌మెంట్‌(ఎంఆర్ అండ్ ఎన్ఎంఆర్‌)
మెట్రిక్ రిక్రూట్‌మెంట్ విభాగంలోకి స్టివార్డ్‌, కుక్ వ‌స్తారు.
అర్హత‌: ప‌దోత‌ర‌గ‌తి ఉత్తీర్ణత‌
నాన్ మెట్రిక్ విధానంలో టోపాస్ పోస్టులు భ‌ర్తీ చేస్తారు.
అర్హత‌: ఆరోత‌ర‌గ‌తి ఉత్తీర్ణత‌
పై రెండు పోస్టుల‌కు వ‌యోప‌రిమితి: 17-21 ఏళ్లు
ఎంపిక విధానం: రాత ప‌రీక్ష, ఫిజిక‌ల్ టెస్ట్‌, మెడిక‌ల్ టెస్టుల ద్వారా
శిక్షణ‌: ఎంపికైన‌వాళ్లకు 15 వారాల పాటు ఐఎన్ఎస్ చిల‌క‌లో ప్రాథ‌మిక శిక్షణ ఉంటుంది. అనంత‌రం ప్రొఫెష‌న‌ల్ ట్రైనింగ్ ఏదైనా నేవ‌ల్ కేంద్రంలో చేప‌డ‌తారు.

మ్యుజీషియ‌న్‌
నేవీ బ్యాండ్‌లో ప‌నిచేయ‌డానికి మ్యుజీషియ‌న్లను ఎంపిక చేస్తారు. ద‌ర‌ఖాస్తు చేసుకున్నవాళ్లకు మ్యూజిక్ ప‌రిక‌రాల‌పై ప్రావీణ్యం ఉండాలి.
అర్హత‌: ప‌దోత‌ర‌గ‌తి ఉత్తీర్ణత‌
వ‌యోప‌రిమితి: 17-21 ఏళ్లు
ఎంపిక‌: మ్యూజిక్ ప‌రిక‌రాల్లో ప్రావీణ్యం, ఫిజిక‌ల్ టెస్టు, మెడిక‌ల్ టెస్టుల ద్వారా

ఆఫీస‌ర్ ఎంట్రీ
వివిధ విభాగాల్లో నేవీలో ఆఫీస‌ర్ స్థాయి ఉద్యోగాలు ఉన్నాయి. ఆ విభాగాలు...ఎగ్జిక్యూటివ్‌, ఇంజినీరింగ్‌, ఎల‌క్ట్రిక‌ల్‌, ఎడ్యుకేష‌న్‌, మెడిక‌ల్‌. ఈ విభాగాల‌కు సంబందించి ఒక్కో విభాగంలోనూ ప‌లు పోస్టులు భ‌ర్తీ చేస్తున్నారు.

ఎగ్జిక్యూటివ్ విభాగం...
ఇందులో జ‌న‌ర‌ల్ సర్వీస్ ఆఫీస‌ర్‌, హైడ్రోగ్రాఫిక్ ఆఫీస‌ర్‌, నేవ‌ల్ ఆర్నమెంట్ ఇన్‌స్పెక్షన్ ఆఫీస‌ర్‌, ప్రోవోస్ట్ ఆఫీస‌ర్‌, పైల‌ట్ ఆఫీస‌ర్‌, అబ్జర్వర్ ఆఫీస‌ర్‌, స‌బ్ మెరైన్ ఆఫీస‌ర్‌, డైవింగ్ ఆఫీస‌ర్‌, లా ఆఫీస‌ర్‌, లాజిస్టిక్ ఆఫీస‌ర్‌, ఇన్ఫర్మేష‌న్ టెక్నాల‌జీ ఉద్యోగాలు ఉంటాయి. ఈ పోస్టుల కోసం నిర్వహించే ప‌రీక్షల వివ‌రాలు తెలుసుకుందాం...

ఎన్‌డీఏ
ప‌రీక్ష: నేష‌న‌ల్ డిఫెన్స్ అకాడెమీ (ఎన్‌డీఏ)
నిర్వహ‌ణ‌: యూపీఎస్‌సీ
ప్రక‌ట‌న‌: ఏడాదికి రెండు సార్లు
అర్హత‌: ఫిజిక్స్‌, మ్యాథ్స్‌తో ఇంట‌ర్‌/ ప్లస్‌2, పురుషులు మాత్రమే అర్హులు
వ‌యోప‌రిమితి: 16 1/2- 19 ఏళ్లు

ఇండియ‌న్ నేవ‌ల్ అకాడెమీ, ఎజిమాల‌
ప‌రీక్ష: ఎన్‌డీఏ ద్వారా భ‌ర్తీ చేస్తారు

గ్రాడ్యుయేట్ స్పెష‌ల్ ఎంట్రీ స్కీం(జీఎస్ఈఎస్‌)
ప్రవేశం: ఇండియ‌న్ నేవ‌ల్ అకాడెమీ, ఎజిమాల‌
ఎంపిక‌: యూపీఎస్‌సీ ద్వారా
అర్హత‌: మ్యాథ్స్‌, ఫిజిక్స్‌తో బీఎస్సీ లేదా బీఈ, పురుషులు మాత్రమే
వ‌యోప‌రిమితి: 19-22 ఏళ్లు

ఎన్‌సీసీ స్పెష‌ల్ ఎంట్రీ

అర్హత‌: మ్యాథ్స్‌, ఫిజిక్స్‌తో బీఎస్సీ లేదా బీఈతోపాటు నేవ‌ల్ వింగ్ సీనియ‌ర్ డివిజ‌న్ ఎన్‌సీసీ సి స‌ర్టిఫికెట్‌ పురుషులు మాత్రమే
వ‌యోప‌రిమితి: 19-24 ఏళ్లు

పీసీ నేవ‌ల్ ఆర్నమెంట్ ఇన్‌స్పెక్షన్ కేడ‌ర్‌
అర్హత‌: ఎల‌క్ట్రానిక్స్‌/ఎల‌క్ట్రిక‌ల్‌/ మెకానిక‌ల్‌లో ఇంజినీరింగ్ లేదా ఎల‌క్ట్రానిక్స్‌/ ఫిజిక్స్‌లో పీజీ. పురుషులు మాత్రమే అర్హులు
వ‌యోప‌రిమితి: 19 1/2 - 25 ఏళ్లు

పీసీ లా క్యాడ‌ర్
అర్హత‌: క‌నీసం 55 శాతం మార్కుల‌తో లాలో డిగ్రీ, పురుషులు మాత్రమే అర్హులు
వ‌యోప‌రిమితి: 22-27 ఏళ్లు

పీసీ లాజిస్టిక్ క్యాడ‌ర్‌
అర్హత‌: 60 శాతం మార్కుల‌తో బీకాం/ ఎంకాం/ ఎంఏ (ఎక‌నామిక్స్‌)/ బీఏ(ఎక‌నామిక్స్‌)/ ఎంబీఏ/ బీబీఎ/ బీబీఎం/ ఎంసీఏ/ బీసీఏ/ బీఎస్సీ(ఐటీ)/ బీటెక్‌/ బీఆర్క్‌/ సీఏ/ ఐసీడ‌బ్ల్యుఏ/ మెటీరియ‌ల్ మేనేజ్‌మెంట్‌లో పీజీ ఉత్తీర్ణత (పురుషులు మాత్రమే అర్హులు)
వ‌యోప‌రిమితి: 19 1/2- 25 ఏళ్లు

ఎస్ఎస్‌సీ ఎగ్జిక్యూటివ్ జ‌న‌ర‌ల్ స‌ర్వీస్‌
అర్హత‌: 60 శాతం మార్కుల‌తో బీఈ/బీటెక్‌, పురుషులు మాత్రమే అర్హులు
వ‌యోప‌రిమితి: 19 1/2- 25 ఏళ్లు

ఎస్ఎస్‌సీ హైడ్రోగ్రాఫిక్‌
అర్హత‌: 55 శాతం మార్కుల‌తో ఫిజిక్స్‌, మ్యాథ్స్‌ల‌తో బీఎస్సీ లేదా ఎమ్మెస్సీ లేదా 55 శాతం మార్కుల‌తో బీఈ/ బీటెక్ లేదా బీఎస్సీ(మ్యాథ్స్‌, ఫిజిక్స్‌)తోపాటు ఎన్‌సీసీ నేవ‌ల్ వింగ్ సీ స‌ర్టిఫికెట్ లేదా 75 శాతం మార్కుల‌తో ఆప‌రేష‌న‌ల్ రీసెర్చ్‌/ క్వాంటిటీటివ్ మెథడ్స్‌లో డిగ్రీ/ పీజీ లేదా మ్యాథ్స్‌తో క‌లిసి స్టాటిస్టిక్స్‌/ ప్రాబ‌బిలిటీలో డిగ్రీ/ పీజీలో 75 శాతం మార్కుల‌తో ఉత్తీర్ణత (పురుషులు మాత్రమే అర్హులు)
వ‌యోప‌రిమితి: 19 1/2- 25 ఏళ్లు

ఎస్ఎస్‌సీ ఏటీసీ
అర్హత‌: ఫిజిక్స్‌, మ్యాథ్స్‌, ఎల‌క్ట్రానిక్స్‌తో ప్రథ‌మ శ్రేణితో డిగ్రీ ఉత్తీర్ణత లేదా ఈ స‌బ్జెక్టుల్లో ఎందులోనైనా 55 శాతం మార్కుల‌తో పీజీ
వ‌యోప‌రిమితి: 19 1/2 - 25 ఏళ్లు (మ‌హిళ‌లు కూడా ద‌ర‌ఖాస్తు చేసుకోవ‌చ్చు)

ఎస్ఎస్‌సీ లా క్యాడ‌ర్‌
అర్హత‌: 55 శాతం మార్కుల‌తో లా డిగ్రీ ఉత్తీర్ణత‌
వ‌యోప‌రిమితి: 22-27 ఏళ్లు (మ‌హిళ‌లు కూడా ద‌ర‌ఖాస్తు చేసుకోవ‌చ్చు)

ఎస్ఎస్‌సీ లాజిస్టిక్స్ క్యాడ‌ర్‌
అర్హత‌: ప్రథ‌మ శ్రేణితో బీఏ(ఎక‌నామిక్స్‌), బీకాం, బీఎస్సీ(ఐటీ) సీఏ, ఐసీడ‌బ్ల్యుఏ, బీసీఏ, ఎంసీఏ, క్యాట‌రింగ్ టెక్నాల‌జీ, బీఈ/ బీటెక్‌(మెకానిక‌ల్‌, ఎల‌క్ట్రిక‌ల్‌, మెరైన్‌, ఎల‌క్ట్రానిక్స్‌, సివిల్‌, ఐటీ, కంప్యూట‌ర్‌, ఆర్కిటెక్చర్‌) లేదా పీజీ డిప్లొమా ఇన్ మెటీరియ‌ల్ మేనేజ్‌మెంట్‌.
వ‌యోప‌రిమితి: 19 1/2 -25 ఏళ్లు

ఎస్ఎస్‌సీ పైల‌ట్‌
అర్హత‌: క‌నీసం 60 శాతం మార్కుల‌తో ఏదైనా విభాగంలో బీఈ/ బీటెక్‌లో ఉత్తీర్ణత‌. అలాగే ఇంట‌ర్‌లో ఫిజిక్స్‌, మ్యాథ్స్ చ‌దివుండాలి.
వ‌యోప‌రిమితి: 19-23 ఏళ్లు (పురుషులు మాత్రమే అర్హులు)

ఎస్ఎస్‌సీ అబ్జర్వర్‌
అర్హత‌: క‌నీసం 60 శాతం మార్కుల‌తో ఏదైనా విభాగంలో బీఈ/ బీటెక్‌లో ఉత్తీర్ణత. అలాగే ఇంట‌ర్‌లో ఫిజిక్స్‌, మ్యాథ్స్ చ‌దివుండాలి.
వ‌యోప‌రిమితి: 19-23 ఏళ్లు (మ‌హిళ‌లు కూడా ద‌ర‌ఖాస్తు చేసుకోవ‌చ్చు)

ఎస్ఎస్‌సీ నేవ‌ల్ ఆర్నమెంట్ ఇన్‌స్పెక్షన్ క్యాడ‌ర్‌
అర్హత‌: ఎల‌క్ట్రానిక్స్‌, ఎల‌క్ట్రిక‌ల్‌, మెకానిక‌ల్ ఇంజినీరింగ్‌లో డిగ్రీ లేదా ఫిజిక్స్‌, ఎల‌క్ట్రానిక్స్‌లో పీజీ

ఎస్ఎస్‌సీ ఇన్ఫర్మేష‌న్ టెక్నాల‌జీ
అర్హత‌: కంప్యూట‌ర్ సైన్స్‌, కంప్యూట‌ర్ ఇంజినీరింగ్‌, ఐటీలో బీఈ/ బీటెక్ లేదా బీఎస్సీ (ఐటీ), బీసీఏ, ఎంసీఏ, ఎమ్మెస్సీ కంప్యూట‌ర్ సైన్స్‌, ఎంటెక్ కంప్యూట‌ర్ సైన్స్‌లో 50 శాతం మార్కుల‌తో ఉత్తీర్ణత‌.
వ‌యోప‌రిమితి: 19 1/2- 25 ఏళ్లు

ఇంజినీరింగ్ విభాగం
ఇందులో ఇంజినీరింగ్ జ‌న‌ర‌ల్ స‌ర్వీస్ ఆఫీస‌ర్‌, స‌బ్ మెరైన్ ఇంజినీర్‌ ఆఫీస‌ర్‌, నావ‌ల్ క‌న్‌స్ట్రక్షన్ ఆఫీస‌ర్ ఉద్యోగాలున్నాయి.

ఎన్డీఏ క్యాడెట్ ఎంట్రీ
అర్హత‌: ఫిజిక్స్‌, మ్యాథ్స్‌తో ఇంట‌ర్ ఉత్తీర్ణత (పురుషులు మాత్రమే అర్హులు)
వ‌యోప‌రిమితి: 16 1/2 - 19 ఏళ్లు
ఎంపిక‌: యూపీఎస్‌సీ నిర్వహించే ఎన్డీఏ రాత‌ప‌రీక్ష, ఇంట‌ర్వ్యూ, మెడిక‌ల్ టెస్టుల ద్వారా

10+2 (బీటెక్‌) క్యాడెట్ ఎంట్రీ
అర్హత‌: ఎంపీసీ గ్రూప్‌తో ఇంట‌ర్ ఉత్తీర్ణత దీంతోపాటు ఫిజిక్స్‌, కెమిస్ట్రీ, మ్యాథ్స్‌లో క‌నీసం 70 శాతం మార్కులు సాధించాలి. అలాగే ప‌ది లేదా ఇంట‌ర్‌లో ఇంగ్లిష్ స‌బ్జెక్టులో 50 శాతం మార్కులు సాధించాలి.(పురుషులు మాత్రమే అర్హులు)
వ‌యోప‌రిమితి: 16 1/2-19 ఏళ్లు

యూనివ‌ర్సిటీ ఎంట్రీ స్కీం (ఎస్ఎస్‌సీ)
అర్హత‌: మెకానిక‌ల్‌, మెరైన్‌, ఏరోనాటిక‌ల్‌, ఏరోస్పేస్‌, ఆర్కిటెక్చర్‌, ఆటో మొబైల్‌, సివిల్‌, నావ‌ల్ ఆర్కిటెక్చర్‌, ఇండ‌స్ట్రియ‌ల్ అండ్ ప్రొడ‌క్షన్‌, మెట‌ల‌ర్జీ, ఎల‌క్ట్రిక‌ల్‌, ఇన్‌స్ట్రుమెంటేష‌న్ అండ్ క‌మ్యూనికేష‌న్‌, టెలి క‌మ్యూనికేష‌న్‌, ప‌వ‌ర్ ఎల‌క్ట్రానిక్స్‌, ఇన్‌స్ట్రుమెంటేష‌న్‌, మెక‌ట్రానిక్స్‌, కంట్రోల్ ఇంజినీరింగ్ ఏ బ్రాంచ్‌లోనైనా క‌నీసం 60 శాతం మార్కుల‌తో ఉత్తీర్ణత (ఫైన‌ల్ ఇయ‌ర్ చ‌దువుతున్న విద్యార్థులైతే 6వ సెమిస్టర్ వ‌ర‌కు, ప్రీ ఫైన‌ల్ విద్యార్థులైతే 4వ సెమిస్టర్ వ‌ర‌కు 60 శాతం మార్కులు ఉండాలి)
వ‌యోప‌రిమితి: ఫైన‌ల్ విద్యార్థులైతే 19-24 ఏళ్లు, ప్రీ ఫైన‌ల్ విద్యార్థులైతే 19 1/2-25 ఏళ్లు

షార్ట్ స‌ర్వీస్ క‌మిష‌న్ (జీఎస్‌)
అర్హత‌: క‌నీసం 60 శాతం మార్కుల‌తో బీఈ/ బీటెక్ ఉత్తీర్ణత‌
వ‌యోప‌రిమితి: 19-25 ఏళ్లు (పురుషులు మాత్రమే అర్హులు)

షార్ట్ స‌ర్వీస్ కమిష‌న్ (స‌బ్ మెరైన్ ఇంజినీరింగ్‌)
అర్హత‌: 60 శాతం మార్కుల‌తో మెకానిక‌ల్ బ్రాంచ్‌లో బీఈ/ బీటెక్ ఉత్తీర్ణత‌
వ‌యోప‌రిమితి: 19 1/2- 25 ఏళ్లు (పురుషులు మాత్రమే అర్హులు)

బీటెక్‌తో పాటు సబ్‌ లెఫ్టినెంట్‌ ఉద్యోగం

నేవీ 10+2 క్యాడెట్‌ ఎంట్రీ స్కీమ్‌తో అవకాశం

ఇంటర్‌ విద్యార్థులు ఉచితంగా బీటెక్‌ చదువుకుని ఉద్యోగం చేసుకునే అవకాశం వచ్చింది. ఇందుకు నేవీ 10+2 టెక్నికల్‌ ఎంట్రీ స్కీం దారిచూపుతుంది. ఎంపికైతే చాలు.. ఇంజినీరింగ్‌ విద్యతో పాటు పుస్తకాలు, యూనిఫాం, వసతి, భోజనం అన్నీ పైసా చెల్లించకుండానే లభిస్తాయి. అనంతరం సబ్‌ లెఫ్టినెంట్‌ హోదాతో నేవీలో విధుల్లోకి తీసుకుంటారు. మొదటి నెల నుంచే లక్ష రూపాయలు వేతనంగా అందుతుంది. జేఈఈ మెయిన్స్‌లో సాధించిన ర్యాంకు, ఎస్‌ఎస్‌బీ ఇంటర్వ్యూలతో నియామకాలు చేపడతారు! 

జేఈఈ-2020 మెయిన్‌లో సాధించిన ర్యాంకుతో మెరిట్‌ ప్రకారం వచ్చిన దరఖాస్తులను మదింపు చేస్తారు. ఈ దశలో సుమారు 900 మందిని ఇంటర్వ్యూకు ఎంపిక చేస్తారు. వీరికి సర్వీసెస్‌ సెలక్షన్‌ బోర్డు (ఎస్‌ఎస్‌బీ)... బెంగళూరు, భోపాల్, కోల్‌కతా, విశాఖపట్నంల్లో ఎక్కడైనా మార్చి నుంచి జూన్‌ లోపు ఇంటర్వ్యూలు నిర్వహిస్తుంది. మొత్తం 5 రోజుల పాటు ఇవి రెండు దశల్లో కొనసాగుతాయి. తొలిరోజు స్టేజ్‌-1 పరీక్షలో భాగంగా ఇంటలిజెన్స్‌ టెస్టు, పిక్చర్‌ పర్సెప్షన్‌ టెస్టు, గ్రూప్‌ డిస్కషన్‌ ఉంటాయి. ఇందులో అర్హత సాధించినవారికే మిగిలిన 4 రోజుల పాటు స్టేజ్‌-2 ఇంటర్వ్యూలు చేపడతారు. దీనిలో భాగంగా సైకలాజికల్‌ పరీక్షలు, గ్రూప్‌ పరీక్షలు, ముఖాముఖి నిర్వహిస్తారు. వీటిలో విజయవంతమైనవారికి ఆరోగ్య పరీక్షలు నిర్వహిస్తారు. అందులోనూ నిలిచినవారిని తుది నియామకాలకు పరిగణనలోకి తీసుకుంటారు. ఎస్‌ఎస్‌బీలో సాధించిన మెరిట్‌ ప్రకారం అర్హులకు అవకాశం కల్పిస్తారు. 

శిక్షణ ఇలా..

ఎంపికైనవారికి శిక్షణ తరగతులు జూన్‌ 2021 నుంచి ప్రారంభమవుతాయి. అభ్యర్థులు ఇంటర్వ్యూలో సాధించిన మార్కులు, ఖాళీలకు అనుగుణంగా ఇండియన్‌ నేవల్‌ అకాడెమీ, ఎజిమాల (కేరళ)లో బీటెక్‌ అప్లైడ్‌ ఎల్రక్టానిక్స్‌ అండ్‌ కమ్యూనికేషన్‌ ఇంజినీరింగ్‌ లేదా మెకానికల్‌ ఇంజినీరింగ్‌ కోర్సుల్లోకి తీసుకుంటారు. చదువుతోపాటు వసతి, భోజనం, పుస్తకాలు, యూనిఫాం అన్నీ ఉచితంగా అందిస్తారు. విజయవంతంగా కోర్సు పూర్తిచేసుకున్నవారికి జవహర్‌లాల్‌ నెహ్రూ యూనివర్సిటీ (జేఎన్‌యూ)-న్యూదిల్లీ ఇంజినీరింగ్‌ డిగ్రీని ప్రదానం చేస్తుంది. కోర్సు అనంతరం సబ్‌ లెఫ్టినెంట్‌ హోదాతో నేవీలో విధుల్లోకి చేరతారు. చేరిన కోర్సును అనుసరించి వీరికి ఎగ్జిక్యూటివ్‌ అండ్‌ టెక్నికల్‌ లేదా ఎడ్యుకేషన్‌ బ్రాంచ్‌ కేటాయిస్తారు. 

వీరికి లెవెల్‌ 10 మూలవేతనం అంటే రూ.56,100 అందుతుంది. మిలటరీ సర్వీస్‌ పే కింద రూ.15,500 చెల్లిస్తారు. డీఏ, హెచ్‌ఆర్‌ఏ, ఇతర అలవెన్సులు ఉంటాయి. ఈ సమయంలో అన్నీ కలుపుకుని గరిష్ఠంగా రూ.లక్ష వరకు వేతనరూపంలో అందుకోవచ్చు. దీంతోపాటు పిల్లల చదువులకు ప్రోత్సాహకాలు, కుటుంబానికి ఆరోగ్య బీమా, ప్రయాణ ఛార్జీల్లో రాయితీలు, తక్కువ ధరకు క్యాంటీన్‌ సామగ్రి, తక్కువ వడ్డీకి గృహ, వాహన రుణాలు..మొదలైన రాయితీలెన్నో పొందవచ్చు. 60 వార్షిక, 20 సాధారణ సెలవులు లభిస్తాయి.

ముఖ్యమైన తేదీలు

ఖాళీలు: మొత్తం 26 ఉన్నాయి. వీటిలో 21 ఎగ్జిక్యూటివ్‌ అండ్‌ టెక్నికల్‌ బ్రాంచిలో, 5 ఎడ్యుకేషన్‌ బ్రాంచిలో ఉన్నాయి. 

విద్యార్హత: ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథ్స్‌ల్లో 70 శాతం మార్కులతో ఇంటర్‌ ఉత్తీర్ణతతోపాటు పదోతరగతి లేదా ఇంటర్‌ ఇంగ్లిష్‌లో కనీసం 50 శాతం మార్కులు సాధించాలి. వీటితోపాటు అభ్యర్థులు జేఈఈ మెయిన్‌ -2020లో అర్హత సాధించినవారై ఉండాలి. అవివాహిత పురుషులు మాత్రమే అర్హులు. ఎత్తు కనీసం 157   సెం.మీ. ఉండాలి. అలాగే

ఎత్తుకు తగ్గ బరువు తప్పనిసరి.

వయసు: జనవరి 2, 2002 - జులై 1, 2004 మధ్య జన్మించినవారు అర్హులు

ఆన్‌లైన్‌ దరఖాస్తులు: జనవరి 29 నుంచి  మొదలవుతాయి.

దరఖాస్తులకు చివరి తేదీ: ఫిబ్రవరి 9