బ్యాంకింగ్ కార్యకలాపాలు, సదుపాయాలు, గ్రామీణ ప్రాంతాలలోని ప్రజలకు అందజేసే ప్రధాన ఉద్దేశ్యంతో స్థాపించినవే ఈ గ్రామీణ బ్యాంకులు. ప్రభుత్వరంగ బ్యాంకులతో పోలిస్తే జీతభత్యాలు తక్కువ అయినప్పటికీ తమ ప్రాంతాల్లోనే ఉద్యోగం చేయాలనుకునేవారికీ, గ్రామీణ ప్రాంతాలకు సేవచేసే ఉద్దేశమున్న అభ్యర్థులకూ ఇది చక్కని అవకాశం. స్కేల్-1 ఆఫీసర్ (అసిస్టెంట్ మేనేజర్)గా చేరిన అభ్యర్థి మేనేజర్, సీనియర్ మేనేజర్, చీఫ్ మేనేజర్/రీజనల్ మేనేజర్, జనరల్ మేనేజర్ స్థాయి వరకు ఆపై ఛైర్మన్/మేనేజింగ్ డైరెక్టర్ స్థాయి వరకు చేరుకోవచ్చు. అసిస్టెంట్‌గా జాయిన్ అయిన అభ్యర్థులు చీఫ్ మేనేజర్, జనరల్ మేనేజర్ స్థాయిల వరకు చేరుకోవచ్చు.
తాజాగా డిగ్రీ లేదా ఇంజనీరింగ్ పూర్తిచేసిన విద్యార్థులు బ్యాంక్ ఉద్యోగం తమ లక్ష్యంగా వుంటే ఈ నోటిఫికేషన్‌తో పాటు ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో పీవో, క్లర్క్, స్పెషలిస్ట్ ఆఫీసర్ల భర్తీకి ఐబీపీఎస్ త్వరలో విడుదల చేయబోయే నోటిఫికేషన్లలోని పరీక్షలకు శ్రద్ధగా సిద్ధం కావాలి. పరీక్షలన్నీ దాదాపుగా ఒకే విధంగా ఉంటాయి. ఐబీపీఎస్ ఆర్ఆర్బీ పరీక్షకు బాగా ప్రిపేర్ అయితే మిగిలిన పరీక్షలకు సన్నద్ధత తేలిక అవుతుంది.
ప్రిలిమ్స్ పరీక్షలకు దాదాపు 2 నెలల సమయం, మెయిన్స్ పరీక్షకు దాదాపు 3 నెలలకు పైగా సమయం ఉంది. ప్రిలిమ్స్ పరీక్షలో కేవలం రెండు సబ్జెక్టులే వున్నాయి. కాబట్టి రెండు నెలల సమయం సరిపోతుంది. అయితే ప్రిలిమ్స్ పరీక్షలో 80 ప్రశ్నలు సాధించడానికి 45 ని. సమయం వుంటుంది.అందుచేత సాధన చాలా అవసరం.
డిగ్రీ/ ఇంజినీరింగ్ పూర్తయిందా?
Posted Date : 10-02-2021
ప్రత్యేక కథనాలు
- బ్యాంకింగ్ అంశాలపై అవగాహన
- ఆ మూడే కీలకం
- ఆప్టిట్యూడ్‌లో అదరగొడుదాం!
- అర్హతలు ఇవే!
- ప్రశ్నల సరళి
పాత ప్రశ్నపత్రాలు
- ఐబీపీఎస్ ఆర్ఆర్బీ - 2014
- ఐబీపీఎస్ ఆర్ఆర్బీ - 2013
- ఐబీపీఎస్ ఆర్ఆర్బీ - 2013
- ఐబీపీఎస్ ఆర్ఆర్బీ - 2012
- ఐబీపీఎస్ ఆర్ఆర్బీ - 2012
నమూనా ప్రశ్నపత్రాలు
- ఆర్ఆర్బీ ఆఫీసర్(స్కేల్-1) ప్రిలిమ్స్- 1
- ఆర్ఆర్బీ ఆఫీసర్(స్కేల్-1) ప్రిలిమ్స్ - 2
- ఆర్ఆర్బీ ఆఫీసర్(స్కేల్-1) ప్రిలిమ్స్ - 3
- ఆర్ఆర్బీ ఆఫీసర్(స్కేల్-1) ప్రిలిమ్స్ - 4
- ఆర్ఆర్బీ ఆఫీసర్(స్కేల్-1) ప్రిలిమ్స్ - 5