• facebook
  • whatsapp
  • telegram

వంద శాతం మార్కులు ఖాయం

న్యూమరికల్‌ ఆప్టిట్యూడ్‌
* తేలికగా 25 మార్కులు  

కంబైన్డ్ గ్రాడ్యుయేట్ లెవెల్ పరీక్షలోని న్యూమరికల్ ఆప్టిట్యూడ్ విభాగంలో వందశాతం మార్కులు తేలిగ్గా సాధించుకోవచ్చు. మెరుగైన ర్యాంకు సాధనకు ఇది దోహదపడుతుంది. కాస్త కష్టపడితే  దీనికి కేటాయించి మొత్తం 25 మార్కులు సంపాదించుకోవచ్చు. 
           ముందుగా సాధారణ అరిథ్‌మెటిక్‌ ఫంక్షన్స్‌ పర్సంటేజెస్‌, ప్రాఫిట్‌ అండ్‌ లాస్‌, రేషియో అండ్‌ ప్రపోర్షన్‌, యావరేజస్‌, ఇంట్రెస్ట్‌ క్యాలిక్యులేషన్‌, డిస్కౌంట్స్‌ తదితరాలను బాగా ప్రాక్టీస్‌ చేయాలి. టేబుల్స్‌-గ్రాఫ్‌ల వినియోగం, మెన్సురేషన్‌, టైమ్‌ అండ్‌ డిస్టెన్స్‌, రేషియో అండ్‌ టైమ్‌, టైమ్‌ అండ్‌ వర్క్‌ ప్రశ్నలను సాధన చేయాలి. ఒక్కో చాప్టర్‌ నుంచి సాధారణంగా రెండు నుంచి ఏడు ప్రశ్నలు వస్తున్నాయి. కేటాయించిన సమయంలో పరిష్కరించగలిగిన స్థాయిలోనే ప్రశ్నలు ఉంటాయి. పాత ప్రశ్నపత్రాలను పరిశీలిస్తే ఈ విషయం అర్థమవుతుంది. అవసరమైన సూత్రాలన్నింటినీ ఒక పుస్తకంలో రాసుకొని ఎప్పటికప్పుడు గుర్తుచేసుకోవాలి.

Posted Date : 04-02-2021

 

ప్రత్యేక కథనాలు

పాత ప్రశ్నప‌త్రాలు

 

నమూనా ప్రశ్నపత్రాలు