• facebook
  • whatsapp
  • telegram

అనాల‌జీ

* ప్రశ్నలోని రెండు భాగాల్లో మొదటి రెండు పదాల మధ్య ఉండే సంబంధం/పోలిక ఆధారంగా సమాధానాన్ని గుర్తించాలి.


1. ఫ్యాక్టరీకి కార్మికుడిలా ల్యాబొరేటరీకి ......? 
  1) ఉద్యోగి     2) శాస్త్రవేత్త     3) టెస్ట్‌ట్యూబ్‌     4) డాక్టర్‌
సమాధానం: 2
సాధన: ఫ్యాక్టరీలో పని చేసేది కార్మికుడు అయితే ల్యాబొరేటరీలో పనిచేసేది శాస్త్రవేత్త.


2. రైతు : నాగలి : : డాక్టర్‌ : ?

  1) దుస్తులు     2) డబ్బులు     3) బిల్డింగ్‌     4) స్టెతస్కోప్‌
సమాధానం: 4
సాధన: రైతుకు పొలం సాగు చేయడానికి నాగలి అవసరమైతే డాక్టర్‌కు రోగిని పరీక్షించడానికి స్టెతస్కోప్‌ అవసరం.


* దీనిలో రెండు భాగాలకు ఒకే భాగాన్ని ఇస్తారు. అదే సంబంధం గల రెండో భాగాన్ని సమాధానంగా గుర్తించాలి. 

 

1. గాలం : చేప : : ?
   1) సింపోజియం : మ్యూజిక్‌       2) గ్లౌజ్‌ : బంతి
   3) స్టేడియం : ఆటలు             4) స్థలం : సభావళి
సమాధానం: 2
సాధన: చేపను గాలంతో పట్టుకుంటారు అలాగే బంతిని పట్టుకోవడానికి గ్లౌజ్‌ అవసరం.  


2. ప్రయోగశాల : క్రిములు : : ?
   1) గ్రంథాలయం : పుస్తకాలు     2) పాఠశాల : విద్యార్థులు
   3) వేదశాల : గ్రహాలు           4) ఆటస్థలం : ఆటలు
సమాధానం: 3

సాధన: క్రిముల గురించి ప్రయోగశాలలో అధ్యయనం చేస్తారు అలాగే గ్రహాల గురించి వేదశాలలో అధ్యయనం చేస్తారు. 
 

* దీనిలో రెండు భాగాల్లో కొన్ని ఆంగ్ల అక్షరాలను ఇస్తారు. ఆ ఆంగ్ల అక్షర క్రమంలోని అంతరం ఆధారంగా సమాధానాన్ని గుర్తించాలి.

 

1. E : S : : C : ?
   1) P           2) R            3) Q            4) S 
సమాధానం: 3


2. NFX : PHM : : AXH : ?
   1)BYI       2) DAK        3) CZJ          4)  DAN
సమాధానం: 3


మాదిరి ప్రశ్నలు


1. డాక్టర్‌ : ఆసుపత్రి : : టీచర్‌ : ?
1) పాకశాల           2) ప్రయోగశాల          3) కళాశాల         4) కర్మాగారం
సమాధానం: 3
సాధన: డాక్టర్‌ పని ప్రదేశం ఆసుపత్రి అయితే టీచర్‌ పని ప్రదేశం కళాశాల. 


2. విద్యార్థులు : తరగతి : : మంత్రులు : ?
1) సభ             2) మండలి           3) సమావేశం          4) సమితి
సమాధానం: 2
సాధన: విద్యార్థుల సమూహం తరగతి, మంత్రుల సమూహం మండలి.


3. రచయిత : కలం : : చెఫ్‌ : ?
1) సూది          2) చాకు           3) రంపం        4) గొడ్డలి
సమాధానం: 2
సాధన: రచయిత ఉపయోగించే సాధనం కలం అయితే చెఫ్‌కు చాకు అవసరం. 


4. రచయిత : పుస్తకం : : రైతు : ?
1) పొలం           2) పంట         3) చెట్లు         4) నేల
సమాధానం: 2
సాధన: రచయిత అంతిమ ఫలితం పుస్తకం కాబట్టి రైతు అంతిమ ఫలితం పంట అవుతుంది.  


5. ఫర్నిచర్‌ : కలప : : గోడ : ?
1) విత్తనం        2) సిమెంటు          3) ఇటుక          4) నీరు
సమాధానం: 3
సాధన: ఫర్నిచర్‌ తయారీకి కలప అవసరమవుతుంది అలాగే గోడ కట్టడానికి ఇటుక కావాలి.


6. పెన్సిల్‌ : ఎరేజర్‌ : : కప్‌ : ?
1) ఆన్సర్‌           2) సాసర్‌          3) బ్రౌజర్‌          4) ప్లేట్‌
సమాధానం: 2
సాధన: పెన్సిల్‌ - ఎరేజర్‌ మాదిరి కప్‌ - సాసర్‌ కూడా జంట పదాలు.


7. వ్యాధులు : పాథాలజీ : : రాయడం : ?
1) ఆస్ట్రాలజీ           2) పెడాలజీ          3) వైరాలజీ          4) పాలియోగ్రఫీ
సమాధానం: 4
సాధన: వ్యాధి అధ్యయన శాస్త్రం పాథాలజీ, రాతలను అధ్యయనం చేసే శాస్త్రం పాలియోగ్రఫీ.


8. బోటనీ : ఫిజియోలజీ : : మొక్కలు : ?
1) మానవుడు         2) మానవ శరీరం      3) కళ్లు           4) అస్థిపంజరం
సమాధానం: 2
సాధన: మొక్కల అధ్యయన శాస్త్రం బోటనీ, మానవ శరీరం గురించి అధ్యయనం చేసే శాస్త్రం ఫిజియోలజీ.


9. డిగ్రీలు : ఆంపియర్‌ : : ఉష్ణోగ్రత : ?
1) ద్రవ్యరాశి          2) విద్యుత్‌ ప్రవాహం         3) విద్యుత్‌ నిరోధం        4) యాంగిల్‌
సమాధానం: 2
సాధన: ఉష్ణోగ్రతకు ప్రమాణం డిగ్రీలు అయితే విద్యుత్‌ ప్రవాహానికి ప్రమాణం ఆంపియర్‌.


గత పరీక్షల్లో వచ్చిన ప్రశ్నలు


1. సమయం : గడియారం : : కాంతి : ?
1) దీపం            2) బుడగ           3) విత్తనం         4) భూమి


2. Engagement : Marriage : : ?
     1) Success : Failure                           2) Explosion : Destruction 
     3) Boy : Man                                     3) Talk : Exaggeration


3. Good : Exacellent : : ?
     1) Bad : Immoral                             2) Hill : Mountain
     3) Caution : careless                        4) Jealously : Respect


4. జర్నలిజం : న్యూస్‌ పేపర్‌ : : ?
1) కరెన్సీ : అర్థశాస్త్రం           2) భూవిజ్ఞానం : భూమి
3) ద్రవ్యం : బ్యాంకు            4) పాలు : వెన్న


5. 248 : 403 : : 594 : ?
1) 676              2) 295              3) 749            4) 711


6. 17 : 289 : : 25 : ?
1) 262             2) 306           3) 650           4) 625


7. దిగుమతి : ఎగుమతి : : ఖర్చు : ?
1) అప్పు           2) లాభం          3) ఆదాయం          4) లోటు


సమాధానాలు: 1-1; 2-2; 3-2; 4-2; 5-3; 6-4; 7-3.


రచయిత: జేవీఎస్‌ రావు

Posted Date : 06-02-2021