• facebook
  • whatsapp
  • telegram

వెన్ చిత్రాలు

          వెన్ చిత్రాల విభాగం నుంచి వచ్చే ప్రశ్నలు రెండు రకాలు. మొదటి రకంలో 3 వృత్తాలు ఉంటాయి. వీటిలోని సంబంధం అర్థంచేసుకొని దానికి సరిపోయే వెన్ చిత్రాన్ని గుర్తించాలి.
1)  పొడవైన మనుషులు, నల్లటి వెంట్రుకలున్న మనుషులు, భారతీయుల మధ్యఉన్న సంబంధాన్ని తెలిపే రేఖా చిత్రం ఏది?
జవాబు: 
సాధన: కొంతమంది పొడవైన వారికి నల్లని వెంట్రుకలు ఉండవచ్చు. కొంతమంది నల్లని వెంట్రుకలు ఉన్నవారు భారతీయులు కావచ్చు. కొంతమంది పొడవైన వారు భారతీయులై ఉండవచ్చు. ఈ మూడురకాలు కొంత భాగం కలిగి ఉండవచ్చు.

          
2) భూమిపై, నీటిలో నివసించే జంతువులను రెండు పెద్ద వృత్తాలు; నీటిలో, భూమిపై నివసించే జంతువులను   ఒక చిన్న వృత్తంతో సూచిస్తున్నారు. ఈ మూడు అంశాల మధ్య ఉన్న సంబంధం ఏది? 

జవాబు: 
సాధన: భూమిపై ఉండే కొన్ని జంతువులు నీటిలో కూడా ఉంటాయి. నీటిలో ఉండే కొన్ని జంతువులు భూమిపై కూడా ఉంటాయి. కాబట్టి


       
3) స్త్రీలు, తల్లులు, డాక్టర్ల మధ్య ఉన్న సంబంధాన్ని తెలిపే రేఖా చిత్రం ఏది?
జవాబు: 
సాధన: సర్వసాధారణంగా తల్లులు అంటే స్త్రీలే. అంటే ఒక వృత్తం పూర్తిగా మరొక వృత్తంలో ఉంటుంది. డాక్టర్లలో కొంతమంది తల్లులు ఉండవచ్చు, కొంతమంది (తల్లులు కాకపోయినా) స్త్రీలు ఉండవచ్చు. కొంతమంది పురుషులూ ఉండవచ్చు. కాబట్టి
                       


4)  దొంగ, జడ్జి, క్రిమినల్ మధ్య ఉన్న సంబంధాన్ని తెలిపే రేఖా చిత్రాన్ని గుర్తించండి.
జవాబు:  
సాధన: క్రిమినల్స్ అంటే అందులో అన్ని రకాల నేరస్తులూ ఉంటారు. దొంగలు క్రిమినల్స్‌లో ఒక భాగం. జడ్జికి, వారికి ఎలాంటి సంబంధం ఉండదు.
                                             


5) టీ, కాఫీ, పానీయాల మధ్య సంబంధాన్ని తెలియజేసే రేఖా చిత్రం-  
జవాబు: 
సాధన: టీ, కాఫీలు రెండూ కూడా పానీయాలు, కానీ రెండూ విభిన్న రకాల పానీయాలు. వీటిలో ఇవికాకుండా వేరేవి కూడా ఉంటాయి.
                     


6)  భారతదేశంలోని కింది వర్గాల సంబంధాన్ని సరిగ్గా ఏది తెలియజేస్తుంది?
    టెన్నిస్ అభిమానులు, క్రికెట్ఆటగాళ్లు, విద్యార్థులు?
జవాబు: 
సాధన: కొందరు విద్యార్థుల్లో క్రికెట్ ఆటగాళ్లు ఉండవచ్చు. కొందరు క్రికెట్ ఆటగాళ్లు టెన్నిస్ అభిమానులుగా ఉండవచ్చు. కొందరు విద్యార్థులు టెన్నిస్ అభిమానులుగా ఉండవచ్చు.
                      


7) వయసు, సంఖ్య, పదమూడుల మధ్య సంబంధాన్ని తెలియజేసే రేఖా చిత్రం- 
జవాబు: 
సాధన: కొందరి వయసు పదమూడు ఉంటుంది. కొన్ని సంఖ్యలు పదమూడు ఉంటాయి. అప్పుడు-
                           
8) Canines, dogs, pups మధ్య ఉన్న సంబంధాన్ని తెలియజేసే రేఖా చిత్రం-
జవాబు: 
సాధన: 
Pups అంటే కుక్క పిల్లలు. అవి పెద్ద అయితే కుక్కలు అవుతాయి. Canines అంటే తోడేలు లేదా కుక్క కావచ్చు.    

 

9) ఒక విందు భోజనంలో చేపలు, మాంసం వడ్డించారు. కొందరు చేపలు మాత్రమే తిన్నారు. కొందరు మాంసం, కొందరు శాకాహారం మాత్రమే తిన్నారు. మిగిలిన వారు చేపలు, మాంసం రెండింటినీ తిన్నారు. వీరికి సరిపోయే రేఖాచిత్రం ఏది?
జవాబు: 
సాధన: కొందరు చేపలు, మాంసం తిన్నారు. అంటే కొంత భాగం చేపల్లో మరికొంత భాగం మాంసంలో ఉంటుంది. కొందరు శాకాహారం మాత్రమే అంటే ఈ రెండింటికీ ఎలాంటి సంబంధం ఉండదు. అప్పుడు
                              


10) హిందీ, ఇంగ్లిష్, ఫ్రెంచ్‌ల మధ్య సంబంధాన్ని తెలియజేసే రేఖా చిత్రం-
జవాబు: 
సాధన: హిందీ, ఇంగ్లిష్, ఫ్రెంచ్ అనేవి భాషలు. కానీ మూడూ కూడా వేరువేరు భాషలు. అప్పడు
                          


11. ట్రక్, షిప్, గూడ్స్ మధ్య సంబంధాన్ని తెలియజేసే రేఖా చిత్రం-
జవాబు:  


12. ఇచ్చిన వెన్ చిత్రాన్ని చదివి ఆర్ట్స్, కామర్స్ చదువుతూ ఎకనమిక్స్ చదవని విద్యార్థులను సూచించే ప్రాంతాన్ని గుర్తించండి.     
జవాబు: V
సాధన: ఎకనమిక్స్‌ను సూచించే వృత్తానికి బయట ఉండి ఆర్ట్స్, కామర్స్‌లను సూచించే వృత్తాల ఛేదన ప్రాంతం ఆర్ట్స్, కామర్స్.  చదువుతూ ఎకనమిక్స్ చదవని విద్యార్థులను సూచిస్తుంది. కింది ఛాయా ప్రాంతం ఆర్ట్స్, కామర్స్ చదువుతూ ఎకనమిక్స్, చదవని విద్యార్థులను సూచిస్తుంది.
                 


13. సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాల మధ్య ఉన్న సంబంధాలను తెలియజేసే వెన్ చిత్రాన్ని గుర్తించండి.
జవాబు: 
సాధన: సూర్యుడు ఒక నక్షత్రం, చంద్రుడు నక్షత్రం కాదు. కాబట్టి ఈ రెండింటికీ ఎలాంటి సంబంధం ఉండదు. అప్పుడు

   

                    
15. ఘన, ద్రవ, వాయు పదార్థాల సంబంధాన్ని సూచించే వెన్ చిత్రాన్ని గుర్తించండి?
జవాబు: 
సాధన: ఘన, ద్రవ, వాయు పదార్థాలు మూడు ఒకదానికొకటి విభిన్నాలు. అప్పుడు
                             

 

 

లాజికల్ వెన్ చిత్రాలు

రెండో రకం వెన్ చిత్రాలు: ఈ రకం ప్రశ్నల్లో ఒక వెన్ చిత్రం ఇస్తారు. ఆ వెన్ చిత్రంలో ఉన్న వివిధ జ్యామితీయ చిత్రాలు వివిధ అంశాలకు చెందినవిగా ఉంటాయి. ఆ వెన్ చిత్రాన్ని పూర్తిగా చదివి దానికి సంబంధించిన ప్రశ్నలకు తగిన విధంగా జవాబులివ్వాలి.
  కింది వెన్ చిత్రంలో మూడు రకాల మనుషులున్నారు. త్రిభుజం స్కూల్ టీచర్లను, చతురస్రం పెళ్లైనవారిని, వృత్తం ఉమ్మడి కుటుంబంలో నివసించే వారిని సూచిస్తాయి.
                          
1. ఉమ్మడి కుటుంబంలో ఉంటూ వివాహమై, స్కూల్ టీచర్లు కానివారిని సూచించే ప్రాంతం ఏది?
జవాబు:  ఈ ప్రశ్నలో ఉమ్మడి కుటుంబంలో ఉండి వివాహమైన అంటే చతురస్రం, వృత్తంలో ఉండాలి. కానీ వారు స్కూల్ టీచర్లు కాకూడదు. అంటే త్రిభుజంలో ఉండకూడదు. ఆ ప్రాంతం D అవుతుంది.


2. ఉమ్మడి కుటుంబంలో ఉంటూ పెళ్లికానివారు, స్కూల్ టీచర్లు కాని వారిని సూచించే ప్రాంతం ఏది?
జవాబు:  ఈ ప్రశ్నలో పెళ్లికానివారు, స్కూల్ టీచర్లుకానివారు అంటే చతురస్రంలోగాని, త్రిభుజంలో గానీ ఉండకూడదు. అంటే వృత్తంలో మాత్రమే ఉండే ప్రాంతం E అవుతుంది.


3. ఉమ్మడి కుటుంబంలో ఉంటూ, వివాహమైన ఉపాధ్యాయులను సూచించే ప్రాంతం ఏది?
జవాబు:  ఈ ప్రశ్నలో ఉమ్మడి కుటుంబంలో ఉంటూ వివాహమైన ఉపాధ్యాయులు అంటే మూడు ప్రాంతాలు కలిసింది. అంటే B అవుతుంది.


4. స్త్రీలు, టీచర్లు, డాక్టర్లు ఈ ముగ్గురికి మధ్య సంబంధాన్ని సూచించే వెన్ చిత్రం ఏది?
జవాబు  అవుతుంది. ఈ ప్రశ్నలోని స్త్రీలు కొంతమంది డాక్టర్లు, మరికొంతమంది టీచర్లు. మిగతా గ్రూపుల్లో కూడా స్త్రీలు ఉంటారు.
                            


5. టెన్నిస్ ప్లేయర్స్, క్రికెట్ ప్లేయర్స్, విద్యార్థుల మధ్య సంబంధాన్ని సూచించే వెన్ చిత్రం ఏది?
జవాబు  అవుతుంది. ఈ ప్రశ్నలో కొంతమంది విద్యార్థులు క్రికెట్ ప్లేయర్స్ మరికొంతమంది విద్యార్థులు టెన్నిస్ ప్లేయర్స్. మరికొంతమంది ఇతర ఆటల ప్లేయర్స్ ఉండవచ్చు.
    


6. ఏనుగులు, జింకలు, జంతువుల మధ్య సంబంధాన్ని తెలియజేసే వెన్ చిత్రం ఏది?
జవాబు  అవుతుంది. ఈ ప్రశ్నలో ఏనుగులు, జింకలు అనేవి జంతువుల్లో ఉంటాయి. కానీ అవి రెండు వేర్వేరు గ్రూప్‌లకు చెందినవి.
                       


7. స్త్రీలు, తల్లులు, భర్తను కోల్పోయినవారు (Widows) వీరి మధ్య సంబంధాన్ని తెలియజేసే వెన్ చిత్రమేది?
జవాబు  అవుతుంది.
ఈ ప్రశ్నలో తల్లి కావాలంటే తప్పకుండా స్త్రీ అయి ఉండాలి. కొంతమంది తల్లులు భర్తలను కోల్పోయి ఉండొచ్చు. కొంతమంది స్త్రీలు తల్లులు కాకపోవచ్చు.


8. న్యాయవాదులు, దొంగలు, క్రిమినల్స్‌ను సూచించే వెన్ చిత్రం ఏది?
జవాబు  అవుతుంది. ఈ ప్రశ్నలో దొంగలందరూ క్రిమినల్స్ అవుతారు. న్యాయవాదులకు వీటితో సంబంధం లేదు. 
         

9. కింది వెన్ చిత్రంలో మూడు రకాల తరగతులకు చెందిన ఆటలు ఉన్నాయి. దాని ఆధారంగా ప్రశ్నలకు సమాధానాలు రాయండి.
                                       
i) పై పటంలో అన్ని ఆటలను సూచించే అక్షరం ఏది?
జవాబు
(c) అవుతుంది. ఈ ప్రశ్నలో అన్ని ఆటలను సూచించే అక్షరం c అవుతుంది.


ii) పై పటంలో టెన్నిస్, వాలీబాల్ ఆటలను సూచించేది, బ్యాడ్మింటన్‌ను సూచించని అక్షరం ఏది?
జవాబు (b) అవుతుంది. ఈ ప్రశ్నలో బ్యాడ్మింటన్ ఆడనివారు అంటే అందులో లేకుండా మిగిలిన రెండు వృత్తాల్లో ఉమ్మడి భాగాన్ని సూచించే అక్షరం b అవుతుంది.


iii) పై పటంలో టెన్నిస్, బ్యాడ్మింటన్ ఆడి వాలీబాల్ ఆడనివారిని సూచించే అక్షరం ఏది?
జవాబు (d) అవుతుంది. ఈ ప్రశ్నలో వాలీబాల్ ఆడనివారు అంటే మిగిలిన రెండు వృత్తాల్లో ఉండే అక్షరం d అవుతుంది.

Posted Date : 06-02-2021