• facebook
  • twitter
  • whatsapp
  • telegram

జేఎన్ఎంఎఫ్‌లో పీహెచ్‌డీ స్కాల‌ర్‌షిప్‌లు

న్యూదిల్లీలోని జ‌వ‌హ‌ర్‌లాల్ నెహ్రూ మెమోరియ‌ల్ ఫండ్‌(జేఎన్ఎంఎఫ్‌) పీహెచ్‌డీ విద్యార్థుల‌కు స్కాల‌ర్‌షిప్ అందిస్తోంది. దీనికి అర్హులైన వారి నుంచి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు..
* పీహెచ్‌డీ చ‌దువుతున్న ఇండియ‌న్ విద్యార్థుల‌కు, ఇత‌ర ఆసియా దేశ‌పు విద్యార్థుల‌కు స్కాల‌ర్‌షిప్‌లు.
స్కాలర్‌షిప్ వ్య‌వ‌ధి:  రెండేళ్లు.
స్పెష‌లైజేష‌న్లు: ఇండియ‌న్ హిస్ట‌రీ అండ్ సివిలైజేష‌న్‌, సోషియాల‌జీ, కంపారిటీవ్ స్ట‌డీస్ ఇన్ రిలీజియ‌న్ అండ్ క‌ల్చ‌ర్‌, ఎక‌న‌మిక్స్‌, జియోగ్ర‌ఫీ, ఫిలాస‌ఫీ, ఎకాల‌జీ అండ్ ఎన్విరాన్‌మెంట్‌.
అర్హ‌త‌: స‌ంబంధిత స్పెష‌లైజేష‌న్లలో ఏదో ఒక దానిలో పీహెచ్‌డీ రిజిస్ట్రేష‌న్ అయి ఉండాలి. గ్రాడ్యుయేష‌న్‌, పోస్టు గ్రాడ్యుయేష‌న్‌లో ఫ‌స్ట్‌క్లాస్ ఉత్తీర్ణ‌త‌.
వ‌య‌సు: 35 ఏళ్లు మించ‌కూడ‌దు.
ద‌ర‌ఖాస్తు విధానం: ఆఫ్‌లైన్‌.
చివ‌రితేది: 31.05.2020.
చిరునామా: జ‌వ‌హ‌ర్‌లాల్ నెహ్రూ మెమోరియ‌ల్ ఫండ్‌, టీన్ ముర్తి హౌజ్‌, న్యూదిల్లీ-110011.

 

Notification Information

Posted Date: 20-03-2020