• facebook
  • twitter
  • whatsapp
  • telegram

నేషనల్ టాలెంట్ సెర్చ్ ఎగ్జామ్-ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ 

నేషనల్ టాలెంట్ సెర్చ్ ఎగ్జామ్ (ఎన్‌టీఎస్ఈ) మొదటి స్థాయి పరీక్షకు ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ ప్రభుత్వ పరీక్షల విభాగం దరఖాస్తులు కోరుతోంది. రాష్ట్రాలవారీ ఇందులో అర్హత సాధించిన అభ్యర్థులను రెండో స్థాయి పరీక్షకు ఎంపిక చేస్తారు. రెండో దశలో దేశవ్యాప్తంగా ఎంపికైన అభ్యర్థులకు 11వ తరగతి నుంచి పీహెచ్‌డీ వరకు ఉపకారవేతనాలు అందిస్తారు.  
వివరాలు.... 
ఉపకారవేతనాల సంఖ్య: 2000
స్కాల‌ర్‌షిప్‌: 11, 12 తరగతులకు నెలకు రూ.1250; యూజీ, పీజీ అభ్యర్థులకు నెలకు రూ.2000; పీహెచ్‌డీ అభ్యర్థులకు యూజీసీ నిబంధనల ప్రకారం చెల్లిస్తారు.
అర్హత: ప్రభుత్వ లేదా ప్రభుత్వ గుర్తింపు పొందిన పాఠశాలలో పదోతరగతి చదువుతున్నవారు.
ఎంపిక: రెండంచెల పరీక్ష ఆధారంగా.
మొదటి స్థాయి పరీక్షతేది: 13.12.2020.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌.
దరఖాస్తు ఫీజు: రూ.200.
ఆన్‌లైన్ రిజిస్ట్రేష‌న్‌కు చివ‌రి తేది: 06.11.2020.
 

Notification Information

Posted Date: 15-10-2020