భారత ప్రభుత్వ టెక్స్టైల్ మంత్రిత్వశాఖకు చెందిన నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ(నిఫ్ట్) దేశవ్యాప్తంగా ఉన్న క్యాంపస్‌లలో 2021 విద్యాసంవత్సరానికి
బ్యాచిలర్స్, మాస్టర్స్ ప్రోగ్రాముల్లో ప్రవేశాల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
వివరాలు..
బ్యాచిలర్ ప్రోగ్రాములు:
1) బ్యాచిలర్ ఆఫ్ డిజైన్: యాక్సెసరీ డిజైన్, ఫ్యాషన్ కమ్యూనికేషన్, ఫ్యాషన్ డిజైన్, క్నిట్వేర్ డిజైన్, లెదర్ డిజైన్, టెక్స్టైల్ డిజైన్.
అర్హత: 10+2 విధానంలో ఇంటర్మీడియట్/ మూడు లేదా నాలుగేళ్ల డిప్లొమా ఉత్తీర్ణత.
వయసు: అడ్మిషన్ తీసుకునే సంవత్సరంలో ఆగస్టు 1నాటికి 24 ఏళ్లు మించకూడదు. గరిష్ఠ వయసులో ఎస్సీ/ ఎస్టీ/ పీడబ్ల్యూడీ అభ్యర్థులకు ఐదేళ్ల సడలింపు ఉంటుంది.
2) బ్యాచిలర్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ (బీఎఫ్ టెక్): అప్పరెల్ ప్రొడక్షన్
అర్హత: ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథమేటిక్స్ సబ్జెక్టులతో 10+2 విధానంలో ఇంటర్మీడియట్/ ఏదైనా ఇంజినీరింగ్ బ్రాంచ్‌లో మూడు లేదా నాలుగేళ్ల డిప్లొమా ఉత్తీర్ణత.
వయసు: అడ్మిషన్ తీసుకునే సంవత్సరంలో ఆగస్టు 1నాటికి 24 ఏళ్లు మించకూడదు. గరిష్ఠ వయసులో ఎస్సీ/ ఎస్టీ/ పీడబ్ల్యూడీ అభ్యర్థులకు ఐదేళ్ల సడలింపు ఉంటుంది.
మాస్టర్స్ ప్రోగ్రాములు:
1) మాస్టర్ ఆఫ్ డిజైన్
అర్హత: ఏదైనా అండర్గ్రాడ్యుయేట్ డిగ్రీ/ ఎన్ఐఎఫ్టీ లేదా ఎన్ఐడీలో కనీసం మూడేళ్ల అండర్ గ్రాడ్యుయేట్ డిప్లొమా ఉత్తీర్ణత.
2) మాస్టర్ ఆఫ్ ఫ్యాషన్ మేనేజ్మెంట్
అర్హత: ఏదైనా అండర్గ్రాడ్యుయేట్ డిగ్రీ/ ఎన్ఐఎఫ్టీ లేదా ఎన్ఐడీలో కనీసం మూడేళ్ల అండర్ గ్రాడ్యుయేట్ డిప్లొమా ఉత్తీర్ణత.
3) మాస్టర్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ
అర్హత: నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీలో బ్యాచిలర్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ/ బీఈ/ బీటెక్ ఉత్తీర్ణత.
ఎంపిక విధానం: రాతపరీక్ష, గ్రూప్ డిస్కషన్, పర్సనల్ ఇంటర్వ్యూ ఆధారంగా.
రాతపరీక్ష ద్వారా ఎంపిక ఉంటుంది. ఇందులో క్రియేటివ్ ఎబిలిటీ టెస్ట్(క్యాట్), జనరల్ ఎబిలిటీ టెస్ట్ (జీఏటీ), సిచువేషన్ టెస్ట్ ద్వారా షార్ట్‌లిస్టింగ్ చేస్తారు.
షార్ట్‌లిస్ట్ అయిన విద్యార్థులను గ్రూప్ డిస్కషన్, పర్సనల్ ఇంటర్వ్యూ ఆధారంగా తుది ఎంపిక చేస్తారు.
పరీక్షా విధానం: విద్యార్థులు తాము కోరుకున్న విధంగా పరీక్షా కేంద్రాలను ఎంపిక చేసుకోవచ్చు. 32 నగరాల్లో ఫిబ్రవరి 14, 2021 నాడు యూజీ, పీజీ ప్రోగ్రాములకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు పేపర్ బేస్డ్ పద్ధతిలో ఈ పరీక్షను నిర్వహిస్తారు.
తెలుగురాష్ట్రాల్లో పరీక్షా కేంద్రాలు: హైదరాబాద్, విశాఖపట్నం.
ముఖ్యమైన తేదీలు:
* ఆన్లైన్ దరఖాస్తు ప్రారంభం: 14.12.2020.
* ఆనలైన్ దరఖాస్తులకు చివరి తేది: 21.01.2021.
* రూ.5000 ఆలస్య రుసుంతో చివరి తేది: 24.01.2021.
* అడ్మిట్ కార్డులు అందుబాటులో ఉండే తేది: 01.02.2021.
* రాత పరీక్ష తేది: 14.02.2021.
* రాత పరీక్షా ఫలితాలు: ఫిబ్రవరి/ మార్చి 2021.
వైఎస్సార్ఏఎఫ్యూ-ఏడీసెట్ 2020
ఇండియన్ నేవీలో కేడెట్ ఎంట్రీ స్కీమ్
ఎన్‌పీటీఐలో పీజీ డిప్లొమా కోర్సులు
కేఎన్ఆర్యూహెచ్ఎస్లో యూజీ ఆయుష్ కోర్సులు
నిమ్స్‌లో పారా మెడికల్ పీజీడీ కోర్సులు
ఎన్ఐఏలో పీజీడీఎం ప్రోగ్రాం
ఎన్ఐబీఏం, పుణెలో పీజీడీఎం ప్రోగ్రాం
బార్క్‌లో ఎంఎస్సీ కోర్సులో ప్రవేశాలు
ఐఐటీల్లో ఏంబీఏ ప్రోగ్రాం
ఎస్వీ ఓరియంటల్ డిగ్రీ కాలేజ్, తిరుపతిలో ప్రవేశాలు
ఎన్టీపీసీ స్కూల్ ఆఫ్ బిజినెస్‌లో పీజీడీఎం ప్రోగ్రాములు
నార్మ్-హైదరాబాద్‌లో పీజీడీఎం-ఏబీఎం ప్రవేశాలు
ఎస్వీవీయూ, తిరుపతిలో మాస్టర్స్, పీహెచ్డీ ప్రోగ్రాములు
క్లాట్-2021
ఎన్టీఏ-జీప్యాట్ 2021
ఎన్టీఏ-సీమ్యాట్ 2021
ఐఐఎఫ్ఎం, భోపాల్‌లో పీజీ డిప్లొమా ప్రోగ్రాములు
జస్ట్-2021
బీహెచ్‌యూలో ఎంబీఏ ప్రోగ్రాములు
ఐఐఎం, అహ్మాదాబాద్‌లో పీహెచ్డీ ప్రోగ్రాములు