తెలంగాణ ప్రభుత్వానికి చెందిన హైదారాబాద్‌లోని నిజామ్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్(నిమ్స్) కింది పారా మెడికల్ పోస్టు గ్రాడ్యుయేట్ డిప్లొమా కోర్సుల్లో ప్రవేశానికి రీ-నోటిఫికేషన్ ద్వారా దరఖాస్తులు కోరుతోంది.
వివరాలు..
* పారా-మెడికల్ పోస్టు గ్రాడ్యుయేట్ డిప్లొమా కోర్సులు
కోర్సు వ్యవధి: రెండేళ్లు.
మొత్తం సీట్లు: 104
కోర్సులు: పీజీ డిప్లొమా (మెడికల్ ల్యాబొరేటరీ టెక్నాలజీ, అనెస్తీషియా టెక్నాలజీ, కార్డియోవాసుక్యులర్ టెక్నాలజీ, డయాలసిస్ టెక్నాలజీ, ఎమర్జెన్సీ మెడికల్ టెక్నాలజీ, న్యూక్లియర్ మెడిసిన్ టెక్నాలజీ, రేడియేషన్ థెరపీ టెక్నాలజీ, రేడియోగ్రఫీ అండ్ ఇమేజింగ్ టెక్నాలజీ, రెస్పిరేటరీ థెరపీ టెక్నాలజీ, ట్రాన్స్ఫ్యూజన్ మెడిసిన్ టెక్నాలజీ.
అర్హత: ఏదైనా సైన్స్/ లైఫ్‌సైన్సెస్ సబ్జెక్టుల్లో బీఎస్సీ ఉత్తీర్ణత.
వయసు: 31.12.2020 నాటికి 30 ఏళ్లు మించకూడదు. ఎస్సీ/ ఎస్టీలకు గరిష్ఠ వయసులో మూడేళ్ల సడలింపు ఉంటుంది.
ఎంపిక విధానం: ప్రవేశ పరీక్ష ఆధారంగా ఎంపిక ప్రక్రియ ఉంటుంది.
పరీక్ష విధానం: ఈ ప్రవేశ పరీక్షను 60 మార్కులకు నిర్వహిస్తారు. ప్రశ్నలు మల్టిపుల్ ఛాయిస్ రూపంలో ఉంటాయి. పరీక్షా సమయం ఒక గంట. పరీక్ష ఇంగ్లిష్ మాధ్యమంలో ఉంటుంది. ఇందులో ప్రశ్నలు కింద సూచించిన విధంగా వివిధ సబ్జెక్టుల నుంచి వస్తాయి.
1) బయలాజికల్ సైన్స్ - 20 మార్కులు
2) ఫిజికల్ సైన్సెస్ - 20 మార్కులు
3) కమ్యూనిటీ మెడిసిన్, బయో స్టాటిస్టిక్స్, కంప్యూటర్ సైన్స్, జనరల్ నాలెడ్జ్, ఇంగ్లిష్ - 20 మార్కులు
* ప్రవేశ పరీక్షలో మెరిట్ ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది. పరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థుల జాబితా వెబ్సైట్లో ఉంచుతారు.
దరఖాస్తు విధానం: ఆన్లైన్/ ఆఫ్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. ఆన్లైన్ దరఖాస్తు హార్డ్‌కాపీని సంబంధిత ధ్రువపత్రాలు జతచేసి కింది చిరునామాకి పంపించాలి.
చిరునామా: Associate Dean, Academic-2, 2nd floor, Old OPD Block, NIMS, Hyderabad 500 082.
ముఖ్యమైన తేదీలు:
* ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 11.01.2021.
* ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేది: 30.01.2021.
* దరఖాస్తు హార్డ్‌కాపీలను పంపడానికి చివరి తేది: 01.02.2021.
* పరీక్ష తేది: 10.02.2021.
వైఎస్సార్ఏఎఫ్యూ-ఏడీసెట్ 2020
ఇండియన్ నేవీలో కేడెట్ ఎంట్రీ స్కీమ్
ఎన్‌పీటీఐలో పీజీ డిప్లొమా కోర్సులు
కేఎన్ఆర్యూహెచ్ఎస్లో యూజీ ఆయుష్ కోర్సులు
ఎన్ఐఈపీఐడీ, సికింద్రాబాద్‌లో వివిధ కోర్సులు
ఎన్ఐఏలో పీజీడీఎం ప్రోగ్రాం
ఎన్ఐబీఏం, పుణెలో పీజీడీఎం ప్రోగ్రాం
బార్క్‌లో ఎంఎస్సీ కోర్సులో ప్రవేశాలు
ఐఐటీల్లో ఏంబీఏ ప్రోగ్రాం
ఎస్వీ ఓరియంటల్ డిగ్రీ కాలేజ్, తిరుపతిలో ప్రవేశాలు
ఎన్టీపీసీ స్కూల్ ఆఫ్ బిజినెస్‌లో పీజీడీఎం ప్రోగ్రాములు
నార్మ్-హైదరాబాద్‌లో పీజీడీఎం-ఏబీఎం ప్రవేశాలు
ఎస్వీవీయూ, తిరుపతిలో మాస్టర్స్, పీహెచ్డీ ప్రోగ్రాములు
క్లాట్-2021
ఎన్టీఏ-జీప్యాట్ 2021
ఎన్టీఏ-సీమ్యాట్ 2021
ఐఐఎఫ్ఎం, భోపాల్‌లో పీజీ డిప్లొమా ప్రోగ్రాములు
నిఫ్ట్‌లో యూజీ, పీజీ ప్రోగ్రాములు
జస్ట్-2021
బీహెచ్‌యూలో ఎంబీఏ ప్రోగ్రాములు