• facebook
  • twitter
  • whatsapp
  • telegram

ఎన్‌పీటీఐలో పీజీ డిప్లొమా కోర్సులు

భార‌త ప్ర‌భుత్వ విధ్యుచ్ఛ‌క్తి మంత్రిత్వ‌శాఖ‌కు చెందిన నేష‌న‌ల్ ప‌వ‌ర్ ట్రెయినింగ్ ఇన్‌స్టిట్యూట్ (ఎన్‌పీటీఐ) 2021 సంవ‌త్స‌రానికి కింది కోర్సుల్లో ప్ర‌వేశాల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు..
* వింట‌ర్ సెష‌న్ (2021) పోస్టు గ్రాడ్యుయేట్ డిప్లొమా కోర్సులు
* కోర్సు వ్య‌వ‌ధి: ఏడాది.
కోర్సులు: 
1) ప‌వ‌ర్ ప్లాంట్ ఇంజినీరింగ్‌
అర్హ‌త‌: మెకానిక‌ల్‌/ ఎల‌క్ట్రిక‌ల్‌/ ఎల‌క్ట్రిక‌ల్ అండ్ ఎల‌క్ట్రానిక్స్‌/ సీ&ఐ/ ప‌వ‌ర్ ఇంజినీరింగ్‌, సంబంధిత బ్రాంచుల్లో 60% మార్కుల‌తో బీఈ/ బీటెక్‌/ త‌త్స‌మాన ఉత్తీర్ణ‌త‌.
2) స్మార్ట్ గ్రిడ్ టెక్నాల‌జీస్ 
అర్హ‌త‌: ఎల‌క్ట్రిక‌ల్‌/ ఎల‌క్ట్రిక‌ల్ అండ్ ఎల‌క్ట్రానిక్స్‌/ ఎల‌క్ట్రానిక్స్ అండ్ క‌మ్యూనికేష‌న్/  సీ&ఐ/ క‌ంప్యూట‌ర్ సైన్స్‌/ ఇన్ఫ‌ర్మేష‌న్ అండ్ క‌మ్యూనికేష‌న్ టెక్నాల‌జీ/ ఐటీ, సంబంధిత బ్రాంచుల్లో క‌నీసం 60% మార్కుల‌తో బీఈ/ బీటెక్‌/ త‌త్స‌మాన ఉత్తీర్ణ‌త‌.
3) ప‌వ‌ర్ సిస్టం ఆప‌రేష‌న్‌
అర్హ‌త‌: ఎల‌క్ట్రిక‌ల్‌/ ఎల‌క్ట్రిక‌ల్ అండ్ ఎల‌క్ట్రానిక్స్‌/ సీ&ఐ/ ప‌వ‌ర్ ఇంజినీరింగ్‌, సంబంధిత బ్రాంచుల్లో క‌నీసం 60% మార్కుల‌తో బీఈ/ బీటెక్‌/ త‌త్స‌మాన ఉత్తీర్ణ‌త‌.
4) రెన్యువ‌బుల్ ఎన‌ర్జీ అండ్ గ్రిడ్ ఇంట‌ర్‌ఫేజ్ టెక్నాల‌జీస్
అర్హ‌త‌: ఎల‌క్ట్రిక‌ల్‌/ ఎల‌క్ట్రిక‌ల్ అండ్ ఎల‌క్ట్రానిక్స్‌/ సీ&ఐ/ మెకానిక‌ల్‌/ ప‌వ‌ర్ ఇంజినీరింగ్‌, సంబంధిత బ్రాంచుల్లో 60% మార్కుల‌తో బీఈ/ బీటెక్/ త‌త్స‌మాన‌ ఉత్తీర్ణ‌త‌.
5) ఎన‌ర్జీ మార్కెట్ మేనేజ్‌మెంట్‌.
అర్హ‌త‌: ఎల‌క్ట్రిక‌ల్‌/ ఎల‌క్ట్రిక‌ల్ అండ్ ఎల‌క్ట్రానిక్స్‌/ ఎల‌క్ట్రానిక్స్ అండ్ క‌మ్యూనికేష‌న్/ సీ&ఐ/ క‌ంప్యూట‌ర్ సైన్స్‌/ ఇన్ఫ‌ర్మేష‌న్ అండ్ క‌మ్యూనికేష‌న్ టెక్నాల‌జీ/ ఐటీ, మెకానిక‌ల్‌, ప‌వ‌ర్ ఇంజినీరింగ్‌ సంబంధిత బ్రాంచుల్లో క‌నీసం 60% మార్కుల‌తో బీఈ/ బీటెక్‌/ త‌త్స‌మాన ఉత్తీర్ణ‌త‌.
వ‌య‌సు: పోస్టు గ్రాడ్యుయేట్ డిప్లొమా కోర్సుల‌కు వ‌య‌సుతో సంబంధం లేదు.
ఎంపిక విధానం: అక‌డ‌మిక్ మెరిట్‌, ఇంట‌ర్వ్యూ ఆధారంగా ఎంపిక ప్ర‌క్రియ ఉంటుంది. ఇంజినీరింగ్ డిగ్రీలో వ‌చ్చిన మార్కుల‌కు 90% వెయిటేజ్‌, ఇంట‌ర్వ్యూకి 10% వెయిటేజ్ ఉంటుంది. ఇంట‌ర్వ్యూ ఆన్‌లైన్ ప‌ద్ధ‌తిలో ఉంటుంది. ఇంట‌ర్వ్యూలో అర్హ‌త సాధించిన అభ్య‌ర్థుల జాబితాను వెబ్‌సైట్‌లో పొందుప‌రుస్తారు.
ద‌ర‌ఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా ద‌ర‌ఖాస్తు చేసుకోవాలి.
ద‌ర‌ఖాస్తు ఫీజు: రూ.1000
ద‌ర‌ఖాస్తుకు చివ‌రి తేది: 10.02.2021.

Notification Information

Posted Date: 13-01-2021