అణుశక్తి విభాగానికి చెందిన హైదరాబాద్‌లోని ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్(ఈసీఐఎల్) గ్రాడ్యుయేట్, టెక్నీషియన్(డిప్లొమా) అప్రెంటిస్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
వివరాలు..
* అప్రెంటిస్
* మొత్తం ఖాళీలు: 180
అప్రెంటిస్-ఖాళీలు: గ్రాడ్యుయేట్ ఇంజినీర్ అప్రెంటిస్-160, టెక్నీషియన్(డిప్లొమా)అప్రెంటిస్-20.
విభాగాలు: ఈసీఈ, సీఎస్ఈ, మెకానికల్, ఈఈఈ, సివిల్.
1) గ్రాడ్యుయేట్ అప్రెంటిస్: 160 ఖాళీలు
శిక్షణా వ్యవధి: ఏడాది.
అర్హత: 01 ఏప్రిల్ 2018 తర్వాత ఎవరైతే సంబంధిత బ్రాంచుల్లో బీఈ/ బీటెక్ ఉత్తీర్ణత పొందిన వారు అర్హులు.
వయసు: 31.01.2021 నాటికి 25 ఏళ్లు మించకూడదు. ఎస్సీ/ ఎస్టీలకు ఐదేళ్లు, ఓబీసీలకు మూడేళ్లు గరిష్ఠ వయసులో సడలింపు ఉంటుంది.
స్టైపెండ్: నెలకు రూ.9000 చెల్లిస్తారు.
2) టెక్నీషియన్(డిప్లొమా) అప్రెంటిస్: 20 ఖాళీలు
శిక్షణా వ్యవధి: ఏడాది.
అర్హత: 01 ఏప్రిల్ 2018 తర్వాత ఎవరైతే సంబంధిత బ్రాంచుల్లో ఇంజినీరింగ్ డిప్లొమా ఉత్తీర్ణత పొందిన వారు అర్హులు.
వయసు: 31.01.2021 నాటికి 25 ఏళ్లు మించకూడదు. ఎస్సీ/ ఎస్టీలకు ఐదేళ్లు, ఓబీసీలకు మూడేళ్లు గరిష్ఠ వయసులో సడలింపు ఉంటుంది.
స్టైపెండ్: నెలకు రూ.8000 చెల్లిస్తారు.
ఎంపిక విధానం: సంబంధిత అర్హత పరీక్షలో సాధించిన మెరిట్ ఆధారంగా ఎంపిక ఉంటుంది. గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ అయితే బీఈ/ బీటెక్‌లో సాధించిన మార్కులు, డిప్లొమా అప్రెంటిస్ అయితే డిప్లొమా(ఇంజినీరింగ్)లో సాధించిన మార్కుల ఆధారంగా ఎంపిక చేస్తారు.
దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా(నాట్స్ పోర్టల్) దరఖాస్తు చేసుకోవాలి.
దరఖాస్తుకు చివరి తేది: 15.01.2021.
అప్రెంటిస్ ట్రెయినింగ్ మొదలయ్యే తేది: 04.02.2021.
బీఎల్డబ్ల్యూలో 374 అప్రెంటిస్ ఖాళీలు
ఐఆర్డీఈలో అప్రెంటిస్‌షిప్ ఖాళీలు
ఏఏఐలో 180 అప్రెంటిస్ ఖాళీలు
బెల్-బెంగళూరులో అప్రెంటిస్ ఖాళీలు
ఎన్ఈఈపీసీఓ-షిల్లాంగ్‌లో అప్రెంటిస్‌షిప్ ఖాళీలు
డీఆర్డీఓ-జీటీఆర్‌ఈ, బెంగళూరులో 150 ఖాళీలు
తాండూర్ సిమెంట్ ఫ్యాక్టరీలో అప్రెంటిస్ ఖాళీలు