• facebook
  • twitter
  • whatsapp
  • telegram

ఐఐటీ, గాంధీన‌గ‌ర్‌లో నాన్ టీచింగ్ పోస్టులు 

గాంధీన‌గ‌ర్‌(గుజ‌రాత్)లోని ఇండియ‌న్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాల‌జీ (ఐఐటీ) కింది నాన్ టీచింగ్ పోస్టుల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.

వివ‌రాలు..

* మొత్తం ఖాళీలు: 37

1) లైబ్రేరియ‌న్‌: 01 పోస్టు

అర్హ‌త‌: స‌ంబంధిత స‌బ్జెక్టుల్లో మాస్ట‌ర్స్ డిగ్రీ, పీహెచ్‌డీ ఉత్తీర్ణ‌త‌. డిప్యూటీ లైబ్రేరియ‌న్‌గా ప‌ని చేసిన అనుభ‌వం ఉండాలి.

వ‌య‌సు: ద‌ర‌ఖాస్తు చివ‌రి తేది నాటికి 57 ఏళ్లు మించ‌కూడ‌దు.

2) డిప్యూటీ లైబ్రేరియ‌న్‌: 02 పోస్టులు

అర్హ‌త‌: లైబ్ర‌రీ సైన్స్‌/ ఇన్ఫ‌ర్మేష‌న్ సైన్స్‌/ డాక్యుమెంటేష‌న్‌లో పోస్టు గ్రాడ్యుయేట్ డిగ్రీ ఉత్తీర్ణ‌త‌. అసిస్టెంట్ లైబ్రేరియ‌న్‌గా ప‌ని చేసిన అనుభ‌వం ఉండాలి.

వ‌య‌సు: ద‌ర‌ఖాస్తు చివ‌రి తేది నాటికి 50 ఏళ్లు మించ‌కూడ‌దు.

3) ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ (సివిల్‌/ ఎల‌క్ట్రిక‌ల్‌): 01 పోస్టు

అర్హ‌త‌: సివిల్‌/ ఎల‌క్ట్రిక‌ల్ ఇంజినీరింగ్‌‌లో బ్యాచిల‌ర్స్ డిగ్రీ ఉత్తీర్ణ‌త‌. అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్‌గా క‌నీసం ఐదేళ్లు ప‌ని చేసిన అనుభ‌వం ఉండాలి.

వ‌య‌సు: ద‌ర‌ఖాస్తు చివ‌రి తేది నాటికి 45 ఏళ్లు మించ‌కూడదు.

4) జూనియ‌ర్ టెక్నిక‌ల్ సూప‌రింటెండెంట్‌: 03 పోస్టులు

అర్హ‌త‌: క‌నీసం 55% మార్కుల‌తో స‌ంబంధిత స‌బ్జెక్టుల్లో ఇంజినీరింగ్ డిగ్రీ/ మాస్ట‌ర్స్ డిగ్రీ/ ఎంటెక్ ఉత్తీర్ణ‌త‌. సంబంధిత ప‌నిలో క‌నీసం ఏడాది అనుభ‌వం ఉండాలి.

వ‌య‌సు: ద‌ర‌ఖాస్తు చివ‌రి తేది నాటికి 32 ఏళ్లు మించ‌కూడ‌దు. 

5) జూనియ‌ర్ సూప‌రింటెండెంట్‌: 05 పోస్టులు

అర్హ‌త‌: క‌నీసం 55% మార్కుల‌తో సంబంధిత స‌బ్జెక్టుల్లో బ్యాచిల‌ర్స్ డిగ్రీ/ మాస్ట‌ర్స్ డిగ్రీ ఉత్తీర్ణ‌త‌. సంబంధిత ప‌నిలో క‌నీసం ఐదేళ్ల అనుభ‌వం ఉండాలి.

వ‌య‌సు: ద‌రఖాస్తు చివ‌రి తేది నాటికి 32 ఏళ్లు మించ‌కూడ‌దు.

6) జూనియ‌ర్ అసిస్టెంట్‌: 10 పోస్టులు

అర్హ‌త‌: క‌నీసం 55% మార్కుల‌తో ఏదైనా విభాగంలో బ్యాచిల‌ర్స్ డిగ్రీ ఉత్తీర్ణ‌త‌. సంబంధిత ప‌నిలో క‌నీసం రెండేళ్ల అనుభ‌వం ఉండాలి.

వ‌య‌సు: ద‌ర‌ఖాస్తు చివ‌రి తేది నాటికి 27 ఏళ్లు మించ‌కూడ‌దు.

7) జూనియ‌ర్ ల్యాబొరేట‌రీ అసిస్టెంట్‌: 10 పోస్టులు

అర్హ‌త‌: క‌నీసం 55% మార్కుల‌తో సంబంధిత స‌బ్జెక్టుల్లో ఐటీఐ (ఆరు సంవ‌త్స‌రాల అనుభ‌వం)/ ఇంజినీరింగ్ డిప్లొమా/ బీఎస్సీ/ బీఈ/ బీటెక్ ఉత్తీర్ణ‌త‌. సంబంధిత ప‌నిలో క‌నీసం రెండేళ్ల అనుభ‌వం ఉండాలి.

వ‌య‌సు: ద‌ర‌ఖాస్తు చివ‌రి తేది నాటికి 27 ఏళ్లు మించ‌కూడ‌దు.

8) జూనియ‌ర్ ల్యాబొరేట‌రీ అటెండెంట్‌/ జూనియ‌ర్ హెల్ప‌ర్‌: 05 పోస్టులు 

అర్హ‌త‌: ప‌దోత‌ర‌గ‌తి, సంబంధిత ట్రేడుల్లో ఐటీఐ ఉత్తీర్ణ‌త‌. సంబంధిత ప‌నిలో క‌నీసం మూడేళ్ల అనుభ‌వం ఉండాలి.

వ‌య‌సు: ద‌ర‌ఖాస్తు చివ‌రి తేది నాటికి 27 ఏళ్లు మించ‌కూడ‌దు.

ఎంపిక విధానం: షార్ట్‌లిస్టింగ్‌, టెస్ట్‌/ ప‌్ర‌జంటేష‌న్‌/ ఇంట‌ర్వ్యూ ఆధారంగా ఎంపిక ప్ర‌క్రియ ఉంటుంది. అభ్య‌ర్థులు పంపించిన ద‌ర‌ఖాస్తుల నుంచి ఉత్త‌మ విద్యార్హ‌తలు, సంబంధిత అనుభ‌వం, ఇత‌ర వివ‌రాల ఆధారంగా షార్ట్‌లిస్ట్ చేస్తారు. షార్ట్‌లిస్ట్ చేసిన అభ్య‌ర్థుల‌ను టెస్ట్‌/ ప‌్రజంటేష‌న్/ ఇంట‌ర్వ్యూ ద్వారా తుది ఎంపిక చేస్తారు.

ద‌ర‌ఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా ద‌ర‌ఖాస్తు చేసుకోవాలి.

ద‌ర‌ఖాస్తు ప్ర‌క్రియ ప్రారంభం: 13.01.2021.

ద‌ర‌ఖాస్తుకు చివ‌రి తేది: 25.02.2021.
 

Notification Information

Posted Date: 13-01-2021