భారత ప్రభుత్వ ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వశాఖకు చెందిన న్యూదిల్లీలోని నేషనల్ బోర్డ్ ఆఫ్ ఎగ్జామినేషన్స్(ఎన్బీఈ) ఫెలోషిప్ ఎంట్రన్స్ టెస్ట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిని ఫెలోషిప్ ప్రోగ్రాం ఫర్ ఇంటర్నేషనల్ స్టూడెంట్స్(ఎఫ్‌పీఐఎస్) కింద ఇంటర్నేషనల్ స్టూడెంట్స్‌కి ఆఫర్ చేస్తున్నారు.
వివరాలు..
* నేషనల్ బోర్డ్ ఆఫ్ ఎగ్జామినేషన్స్(ఎన్బీఈ)-ఫెలోషిప్ ఎంట్రన్స్ టెస్ట్, 2021 (ఇంటర్నేషనల్ స్టూడెంట్స్)
* ఫెలోషిప్ పొందడానికి ఎన్బీఈ ఆఫర్ చేస్తున్న కోర్సులు: హ్యాండ్ అండ్ మైక్రో సర్జరీ, మెటర్నల్ అండ్ ఫీటల్ మెడిసిన్, ఇన్ఫెక్టియస్ డిసీజెస్, ఇంటర్వెన్షినల్ కార్డియాలజీ, మినిమల్ యాక్సెస్ సర్జరీ, పీడియాట్రిక్ హెమటో ఆంకాలజీ, రిప్రొడక్టివ్ మెడిసిన్, స్పైన్ సర్జరీ, స్పోర్ట్స్ మెడిసిన్, ట్రామా అండ్ అక్యూట్ కేర్ సర్జరీ.
అర్హత: సంబంధిత స్పెషలైజేషన్లలో పోస్టు గ్రాడ్యుయేట్ మెడికల్ డిగ్రీ/ తత్సమాన ఉత్తీర్ణత.
వయసు: ఈ ఫెలోషిప్ కోర్సులకు వయసుతో సంబంధం లేదు.
ఎంపిక విధానం: ఫెలోషిప్ ఎంట్రన్స్ టెస్ట్(ఎఫ్ఈటీ) ఆధారంగా ఎంపిక ప్రక్రియ నిర్వహిస్తారు.
పరీక్ష విధానం: మల్టిపుల్ ఛాయిస్ ప్రశ్నల రూపంలో కంప్యూటర్ బేస్డ్ పరీక్ష ఉంటుంది. మొత్తం పరీక్షా సమయం 105 నిమిషాలుగా ఉంటుంది. ఇందులో పార్ట్-ఏకి 45 నిమిషాలు, పార్ట్-బికి 60 నిమిషాలు కేటాయిస్తారు. ఈ పరీక్ష మొత్తం 100 మార్కులకు ఉంటుంది. దీనిలో పార్ట్-ఏ, పార్ట్-బి రెండు విభాగాలు ఉంటాయి. పార్ట్-ఏలో ఎంచుకున్న సంబంధిత స్పెషలైజేషన్ నుంచి మల్టిపుల్ ఛాయిస్ ప్రశ్నలు ఉంటాయి. దీని నుంచి 40 ప్రశ్నలు వస్తాయి. పార్ట్-బిలో క్లినికల్ ప్రాక్టిస్, బేసిక్ సైన్సెస్ నుంచి ప్రశ్నలు ఉంటాయి. దీని నుంచి 60 ప్రశ్నలు వస్తాయి.
* ఈ పరీక్షకు నెగిటివ్ మార్కింగ్ ఉంటుంది.
దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
ముఖ్యమైన తేదీలు:
* ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 04.01.2021.
* ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేది: 03.02.2021.
* పరీక్ష తేది: 14.03.2021.
కామన్వెల్త్ మాస్టర్స్ స్కాలర్షిప్ 2021