• facebook
  • twitter
  • whatsapp
  • telegram

ఆర్‌జీసీఏలో యంగ్ ప్రొఫెష‌న‌ల్ పోస్టులు

భార‌త ప్ర‌భుత్వ కామ‌ర్స్ అండ్ ప‌రిశ్ర‌మ‌ల మంత్రిత్వ‌శాఖ‌కు చెందిన త‌మిళ‌నాడులోని రాజీవ్ గాంధీ సెంట‌ర్ ఫ‌ర్ అక్వాక‌ల్చర్‌(ఆర్‌జీసీఏ) యంగ్ ప్రొఫెష‌న‌ల్ పోస్టుల భ‌ర్తీకి వాక్ఇన్ నిర్వ‌హిస్తోంది.
వివ‌రాలు..
* యంగ్ ప్రొఫెష‌న‌ల్ (బ‌య‌లాజికల్‌/ మార్కెటింగ్‌)
* మొత్తం ఖాళీలు: 06
అర్హ‌త‌: బ‌యాల‌జీ/ ఆక్వాక‌ల్చ‌ర్‌/ ఫిష‌రీస్‌, అనుబంధ స‌బ్జెక్టుల్లో గ్రాడ్యుయేష‌న్ ఉత్తీర్ణ‌త‌. కంప్యూట‌ర్ అప్లికేష‌న్స్‌/ బీబీఏ(మార్కెటింగ్‌)లో బేసిక్ నాలెడ్జ్ ఉండాలి. ష్రింప్ మెచ్యురేష‌న్‌/ బ్రీడింగ్‌, సీడ్ ప్రొడ‌క్ష‌న్/ ఆక్వాక‌ల్చ‌ర్ విభాగం మార్కెటింగ్‌లో క‌నీసం ఏడాది అనుభ‌వం ఉండాలి.
వ‌య‌సు: 01.01.2021 నాటికి 40 ఏళ్లు మించ‌కూడ‌దు.
ఎంపిక విధానం: రాత‌ప‌రీక్ష‌, ఇంట‌ర్వ్యూ ఆధారంగా ఎంపిక ప్ర‌క్రియ ఉంటుంది.
జీత‌భ‌త్యాలు: నెల‌కు రూ.25,000 చెల్లిస్తారు.
వాక్ఇన్ తేది: 2021 జ‌న‌వ‌రి 25, 29.
వేదిక‌: 1) 25.01.2021 - The Marine Products Export Development Authority (MPEDA), Regional Division, 2nd Floor,33-25-35, Bellapu Sobhanadri Street, Surya Rao Pet, Vijayawada – 520 002, Andhra Pradesh.
2) 29.01.2021 - The Marine Products Export Development Authority (MPEDA), Regional Division No.167, First Floor, Interpretation Building TNFDC ECOPARK, Poonamallee High Road, Chetpet, Kilpauk, Chennai-600 010.
 

Notification Information

Posted Date: 13-01-2021