• facebook
  • twitter
  • whatsapp
  • telegram

ఏడ‌బ్ల్యూఈఎస్‌-బీఎస్సీ(న‌ర్సింగ్‌) ప్ర‌వేశాలు

గువ‌హ‌టిలోని ఆర్మీ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ న‌ర్సింగ్‌, జ‌లంధ‌ర్‌లోని ఆర్మీ కాలేజ్ ఆఫ్ న‌ర్సింగ్‌లో 2021 బీఎస్సీ(న‌ర్సింగ్‌)లో ప్ర‌వేశాల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతున్నాయి. 

వివ‌రాలు..

* బీఎస్సీ (న‌ర్సింగ్‌) ప్ర‌వేశాలు

అర్హ‌త‌: క‌నీసం 50% మార్కుల‌తో ఫిజిక్స్‌, కెమిస్ట్రీ, బ‌యాల‌జీ, ఇంగ్లిష్ స‌బ్జెక్టుల‌తో మొద‌టి ప్ర‌య‌త్నంలోనే ఇంట‌ర్మీడియ‌ట్ ఉత్తీర్ణ‌త‌. ఆర్మీలో ప‌ని చేసి రిటైరైన వారి కూతుళ్లకి 90% సీట్లు, సాధార‌ణ మ‌హిళా అభ్య‌ర్థులకు 10% సీట్లు కేటాయిస్తారు. 

సీట్ల సంఖ్య‌: ఏఐఎన్ (గువ‌హ‌టి)లో 50 సీట్లు, ఏసీఎన్ (జ‌లంధ‌ర్‌)లో 60 సీట్లు కేటాయించారు. 

ఎంపిక విధానం: ఆన్‌లైన్ అడ్మిష‌న్ టెస్ట్ ఆధారంగా ఎంపిక ప్ర‌క్రియ నిర్వ‌హిస్తారు.

ఆన్‌లైన్ అడ్మిష‌న్ టెస్ట్ తేది: 27.06.2021.

ద‌ర‌ఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా ద‌ర‌ఖాస్తు చేసుకోవాలి. 

ద‌ర‌ఖాస్తు ఫీజు: రూ.1000 చెల్లించాలి.

ఆన్‌లైన్ ద‌ర‌ఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 15.04.2021.

ఆన్‌లైన్ ద‌ర‌ఖాస్తుకు చివ‌రి తేది: 15.05.2021.

రూ.100 ఆలస్య రుసుంతో చివ‌రి తేది: 16.05.2021 నుంచి 31.05.2021 వ‌ర‌కు.

Notification Information

Posted Date: 14-04-2021

 

నోటిఫికేష‌న్స్‌ :