• facebook
  • twitter
  • whatsapp
  • telegram

బిర్లా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో ఎంబీఏ 

మెస్రా(రాంచీ)లోని బిర్లా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాల‌జీ 2021-2023 విద్యాసంవ‌త్స‌రానికి ఎంబీఏ ప్రోగ్రాములో ప్ర‌వేశాల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.

వివ‌రాలు..

* మాస్ట‌ర్ ఆఫ్ బిజినెస్ అడ్మినిస్ట్రేష‌న్ (ఎంబీఏ) 2021

కోర్సు వ్య‌వ‌ధి: రెండేళ్లు.

కోర్సును అందిస్తున్న ప్రాంగ‌ణాలు: బిట్, మెస్రా(మెయిన్ క్యాంప‌స్‌), జ‌య‌పుర‌, లాల్‌పూర్‌, నోయిడా, పాట్నా.

అర్హ‌త‌: బ‌్యాచిల‌ర్స్ డిగ్రీ/ త‌త్స‌మాన ఉత్తీర్ణ‌త‌తో పాటు క్యాట్ 2020/ గ‌్జాట్ 2021/ సీమ్యాట్ 2021/ మ‌్యాట్ సెప్టెంబ‌రు 2020/ మ‌్యాట్ డిసెంబ‌రు 2020/ మ‌్యాట్ ఫిబ్ర‌వ‌రి 2021లో సాధించిన అర్హ‌త స్కోర్ ఉండాలి.

ఎంపిక విధానం: క్యాట్ 2020/ గ‌్జాట్ 2021/ సీమ్యాట్ 2021/ మ‌్యాట్ సెప్టెంబ‌రు 2020/ మ‌్యాట్ డిసెంబ‌రు 2020/ మ‌్యాట్ ఫిబ్ర‌వ‌రి 2021లో సాధించిన మెరిట్‌ స్కోర్ ఆధారంగా అభ్య‌ర్థుల్ని షార్ట్‌లిస్ట్ చేస్తారు. షార్ట్‌లిస్ట్ చేసిన అభ్య‌ర్థుల్ని గ్రూప్ డిస్క‌ష‌న్‌, ప‌ర్స‌న‌ల్ ఇంట‌ర్వ్యూకి పిలుస్తారు. 

గ్రూప్ డిస్క‌ష‌న్‌, ప‌ర్స‌న‌ల్ ఇంట‌ర్వ్యూ తేది: 3-4 మే 2021.

ద‌ర‌ఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా ద‌ర‌ఖాస్తు చేసుకోవాలి.

ఆన్‌లైన్ ద‌ర‌ఖాస్తుకు చివ‌రి తేది: 20.04.2021.
 

Notification Information

Posted Date: 01-03-2021

 

నోటిఫికేష‌న్స్‌ :