• facebook
  • twitter
  • whatsapp
  • telegram

ఎఫ్‌డీడీఐలో యూజీ, పీజీ ప్రోగ్రాములు 

భార‌త ప్ర‌భుత్వ కామ‌ర్స్ అండ్ ప‌రిశ్ర‌మ‌ల మంత్రిత్వ‌శాఖ‌కు చెందిన ఫుట్‌వేర్ డిజైన్ అండ్ డెవ‌ల‌ప్‌మెంట్ ఇన్‌స్టిట్యూట్‌(ఎఫ్‌డీడీఐ) 2021-2022 విద్యాసంవ‌త్స‌రానికి కింది యూజీ, పీజీ ప్రోగ్రాముల్లో ప్ర‌వేశాల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.

వివ‌రాలు..

1) బ్యాచిల‌ర్ డిగ్రీ ప్రోగ్రాములు (బీ.డిజైన్‌/ బీబీఏ)

అర్హ‌త‌: ఏదేనా విభాగంలో ఇంట‌ర్మీడియ‌ట్(10+2) ఉత్తీర్ణ‌త‌. ప్ర‌స్తుత విద్యాసంవ‌త్స‌రంలో ఇంట‌ర్మీడియ‌ట్ రెండో ఏడాది ప‌రీక్ష‌ల‌కు హాజ‌ర‌వుతున్న విద్యార్థులు ద‌ర‌ఖాస్తు చేసుకోవ‌చ్చు, అయితే సెప్టెంబ‌రు 30, 2021 నాటికి సంబంధిత స‌ర్టిఫికెట్లు స‌మ‌ర్పించాలి.ఇంగ్లిష్‌లో మంచి క‌మ్యూనికేష‌న్ స్కిల్స్ ఉండాలి.

వ‌య‌సు: 01.07.2021 నాటికి 25 ఏళ్లు మించ‌కూడ‌దు.

2) మాస్ట‌ర్స్ డిగ్రీ ప్రోగ్రాములు (ఎం.డిజైన్‌/ ఎంబీఏ)

* మాస్ట‌ర్ ఆఫ్ డిజైన్ (ఫుడ్ వేర్ డిజైన్ అండ్ ప్రొడ‌క్ష‌న్‌)

అర్హ‌త‌: పుట్‌వేర్‌/ లెద‌ర్ గూడ్స్‌/ డిజైన్‌/ ఫ‌్యాష‌న్/ ఫైన్ ఆర్ట్స్/ ఆర్కిటెక్చ‌ర్‌/ ఇంజినీరింగ్‌/ ప్రొడ‌క్ష‌న్‌లో బ్యాచిల‌ర్స్ డిగ్రీ ఉత్తీర్ణ‌త‌.ఇంగ్లిష్‌లో మంచి క‌మ్యూనికేష‌న్ స్కిల్స్ ఉండాలి.

* మాస్ట‌ర్ ఆఫ్ బిజినెస్ అడ్మినిస్ట్రేష‌న్(ఎంబీఏ-రిటైల్ అండ్ ఫ్యాష‌న్ మ‌ర్కండైజ్‌)

అర్హ‌త‌: ఏదైనా విభాగంలో బ్యాచిల‌ర్స్ డిగ్రీ ఉత్తీర్ణ‌త‌. ఇంగ్లిష్‌లో మంచి క‌మ్యూనికేష‌న్ స్కిల్స్ ఉండాలి.

వ‌య‌సు: మాస్ట‌ర్ డిగ్రీ ప్రోగ్రాముల‌కు వ‌య‌సుతో సంబంధం లేదు.

ఎంపిక విధానం: ప‌్ర‌వేశ ప‌రీక్ష ఆధారంగా ఎంపిక ప్ర‌క్రియ ఉంటుంది. 

ప‌రీక్షా విధానం: ఈ ప‌రీక్షను పేప‌ర్ బేస్డ్ ప‌ద్ధ‌తిలో నిర్వ‌హిస్తారు. ఇది ఇంగ్లిష్ మాధ్య‌మంలో మాత్ర‌మే ఉంటుంది. దీన్ని 200 మార్కుల‌కు నిర్వ‌హిస్తారు, 150 ప్ర‌శ్న‌లు ఉంటాయి. 

* క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్   25 ప్ర‌శ్న‌లు   25 మార్కులు

* వ‌ర్బ‌ల్ ఎబిలిటీ          40 ప్రశ్న‌లు   40 మార్కులు

* జ‌న‌ర‌ల్ అవేర్‌నెస్         35 ప్ర‌శ్న‌లు   35 మార్కులు

* బిజినెస్ ఆప్టిట్యూడ్ టెస్ట్‌ & డిజైన్ ఆప్టిట్యూడ్ టెస్ట్      50 ప్ర‌శ్న‌లు    100 మార్కులు

* మాస్ట‌ర్స్ ప్రోగ్రాముకి సంబంధించి 175 ప్ర‌శ్న‌లు, 200 మార్కుల‌కు ఈ ప‌రీక్ష ఉంటుంది. ఇందులో

* క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్         25 ప్ర‌శ్న‌లు   50 మార్కులు

* ఇంగ్లిష్ కాంప్ర‌హెన్ష‌న్             50 ప్రశ్న‌లు   50 మార్కులు

* జ‌న‌ర‌ల్ నాలెడ్జ్ & క‌రెంట్ అఫైర్స్  50 ప్రశ్న‌లు   50 మార్కులు

* మేనేజ్‌మెంట్ ఆప్టిట్యూడ్ టెస్ట్ అండ్ అన‌లైటిక్ ఎబిలిటీ  50 ప్ర‌శ్న‌లు   50 మార్కులు.

ద‌ర‌ఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా ద‌ర‌ఖాస్తు చేసుకోవాలి.

ముఖ్య‌మైన తేదీలు: 

* ఆన్‌లైన్ ద‌ర‌ఖాస్తుకు చివ‌రి తేది: 15.06.2021

* హాల్ టికెట్ డౌన్‌లోడ్ తేదీ: 24.06.2021.

* ప్ర‌వేశ ప‌రీక్ష తేది(ఏఐఎస్‌టీ 2021): 04.07.2021.
 

Notification Information

Posted Date: 23-02-2021

 

నోటిఫికేష‌న్స్‌ :