• facebook
  • twitter
  • whatsapp
  • telegram

ఐఐఎస్సీలో బ్యాచిల‌ర్ ఆఫ్ సైన్స్ ప్రోగ్రాం 

బెంగ‌ళూరులోని ఇండియ‌న్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్‌(ఐఐఎస్సీ) 2021-2022 విద్యాసంవ‌త్స‌రానికి కింది ప్రోగ్రాములో ప్ర‌వేశాల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.

వివ‌రాలు..

* నాలుగేళ్ల బ్యాచిల‌ర్ ఆఫ్ సైన్స్ (రిసెర్చ్‌) ప్రోగ్రాం

స‌బ్జెక్టులు: బ‌యాల‌జీ, కెమిస్ట్రీ, ఎర్త్ అండ్ ఎన్విరాన్‌మెంటల్ సైన్స్‌, మెటీరియ‌ల్స్‌, మ్యాథ‌మేటిక్స్‌, ఫిజిక్స్‌.

అర్హ‌త‌: 2020లో ఇంట‌ర్మీడియ‌ట్ పూర్తి చేసిన విద్యార్థులు, 2021లో ఇంట‌ర్మీడియ‌ట్ పూర్త‌య్యే విద్యార్థులు దీనికి అర్హులు. ఇంట‌ర్మీడియ‌ట్‌లో ఫిజిక్స్, మ్యాథ‌మేటిక్స్‌, కెమిస్ట్రీ స‌బ్జెక్టులు చ‌దివి ఉండాలి. వీటితో పాటు బ‌యాల‌జీ, స్టాటిస్టిక్స్‌, ఎల‌క్ట్రానిక్స్‌, కంప్యూట‌ర్ సైన్స్ త‌దిత‌ర స‌బ్జెక్టులు చ‌దివి ఉండాలి.

ఎంపిక విధానం:  కింద సూచించిన జాతీయ ప‌రీక్ష‌ల్లో ఏదో ఒక‌దానిలో సాధించిన మెరిట్ ఆధారంగా ఎంపిక చేస్తారు.

1) కిశోర్ వైజ్ఞానిక్ ప్రోత్సాహ‌న్ యోజ‌న‌: 2019 లేదా 2020లో దీనికి ఎంపికై స్కాల‌ర్‌షిప్ పొందుతూ ఉండాలి.

2) ఐఐటీ జేఈఈ మెయిన్‌: 2021లో హాజ‌రై క‌నీసం 60% మార్కులు సాధించి ఉండాలి.‌

3) ఐఐటీ జేఈఈ అడ్వాన్స్‌డ్‌: 2021లో హాజ‌రై క‌నీసం 60% మార్కులు సాధించి ఉండాలి.‌

4) నీట్‌-యూజీ: 2021లో హాజ‌రై క‌నీసం 60% మార్కులు సాధించి ఉండాలి.‌

ద‌ర‌ఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా ద‌ర‌ఖాస్తు చేసుకోవాలి.

ద‌ర‌ఖాస్తు ఫీజు: జ‌న‌ర‌ల్‌/ ఓబీసీ అభ్య‌ర్థులు రూ.500, ఎస్సీ/ ఎస్టీ/ పీడ‌బ్ల్యూడీ అభ్య‌ర్థులు రూ.250 చెల్లించాలి.

ఆన్‌లైన్ ద‌ర‌ఖాస్తుకు చివ‌రి తేది: 30.04.2021.

నోటిఫికేష‌న్: https://ug.iisc.ac.in/

Notification Information

Posted Date: 01-03-2021

 

నోటిఫికేష‌న్స్‌ :