• facebook
  • twitter
  • whatsapp
  • telegram

ఐఐటీటీఎంలో బీబీఏ, ఎంబీఏ ప్రోగ్రాములు 

గ్వాలియ‌ర్ (మ‌ధ్య‌ప్ర‌దేశ్‌)లోని ఇండియ‌న్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టూరిజం అండ్ ట్రావెల్ మేనేజ్‌మెంట్ (ఐఐటీటీఎం), అమ‌ర్‌కంఠ‌క్(మ‌ధ్య‌ప్ర‌దేశ్‌)లోని ఇందిరా గాంధీ నేష‌న‌ల్ ట్రైబ‌ల్ యూనివ‌ర్సిటీ (ఐజీఎన్‌టీయూ) సంయుక్తంగా 2021-2024 విద్య‌సంవత్స‌రానికి కింది ప్రోగ్రాముల్లో ప్ర‌వేశానికి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.

వివ‌రాలు..

కోర్సులు అందిస్తున్న ప్రాంగ‌ణాలు: గ్వాలియ‌ర్‌, భువ‌నేశ్వ‌ర్‌, నోయిడా, నెల్లూరు.

1) బ్యాచిల‌ర్ ఆఫ్ బిజినెస్ అడ్మినిస్ట్రేష‌న్ (బీబీఏ) ఇన్ టూరిజం అండ్ ట్రావెల్‌

అర్హ‌త‌: క‌నీసం 50% మార్కుల‌తో ఇంట‌ర్మీడియ‌ట్ ఉత్తీర్ణ‌త‌. ఇంట‌ర్‌ చివ‌రి ఏడాది ప‌రీక్ష‌ల‌కు హాజ‌ర‌వుతున్న విద్యార్థులు ద‌ర‌ఖాస్తు చేసుకోవ‌చ్చు.

వ‌య‌సు: 01.07.2021 నాటికి 22 ఏళ్లు మించ‌కుండా ఉండాలి. ఎస్సీ/ ఎస్టీలకు ఐదేళ్లు గ‌రిష్ఠ వ‌య‌సులో స‌డ‌లింపు ఉంటుంది.

ఎంపిక విధానం: ఐజీఎన్‌టీయూ ఐఐటీటీఎం అడ్మిష‌న్ టెస్ట్‌(ఐఐఏటీ), గ్రూప్ డిస్క‌ష‌న్‌, ప‌ర్స‌న‌ల్ ఇంట‌ర్వ్యూ ఆధారంగా ఎంపిక ప్ర‌క్రియ నిర్వ‌హిస్తారు. 

ప‌రీక్ష తేది: 06.06.2021.

ప‌రీక్షా కేంద్రాలు: గ్వాలియ‌ర్‌, భువ‌నేశ్వ‌ర్‌, నోయిడా, నెల్లూరు.

2) మాస్ట‌ర్ ఆఫ్ బిజినెస్ అడ్మినిస్ట్రేష‌న్ (ఎంబీఏ) ఇన్ టూరిజం అండ్ ట్రావెల్ మేనేజ్‌మెంట్‌

అర్హ‌త‌: క‌నీసం 50% మార్కుల‌తో బ్యాచిలర్స్ డిగ్రీ ఉత్తీర్ణ‌త. 

వ‌య‌సు: 01.07.2021 నాటికి 27 ఏళ్లు మించ‌కుండా ఉండాలి.

ఎంపిక విధానం: ఏదైనా మేనేజ్‌మెంట్ ప్ర‌వేశ ప‌రీక్ష (మ్యాట్‌/ క్యాట్‌/ సీమ్యాట్/ గ్జాట్‌/ జీమ్యాట్‌/ ఏటీఎంఏ) వాలిడ్ స్కోర్ కార్డ్‌, గ్రూప్ డిస్క‌ష‌న్‌, ప‌ర్స‌న‌ల్ ఇంట‌ర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు. ఒక‌వేళ మేనేజ్‌మెంట్ ప్ర‌వేశ ప‌రీక్ష‌ల వాలిడ్ స్కోర్ కార్డ్ లేన‌ట్ల‌యితే ఐజీఎన్‌టీయూ, ఐఐటీటీఎం అడ్మిష‌న్ టెస్ట్‌(ఐఐఏటీ) రాయాల్సి ఉంటుంది.

ద‌రఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా ద‌ర‌ఖాస్తు చేసుకోవాలి.

ద‌ర‌ఖాస్తుకు చివ‌రి తేది: 21.05.2021.
 

Notification Information

Posted Date: 18-04-2021

 

నోటిఫికేష‌న్స్‌ :