• facebook
  • twitter
  • whatsapp
  • telegram

ఇండియ‌న్ ఆర్మీ-బీఎస్సీ న‌ర్సింగ్ కోర్సు 2021

ఇండియ‌న్ ఆర్మీ అర్హ‌త క‌లిగిన మ‌హిళా అభ్య‌ర్థుల నుంచి 2021 సంవ‌త్స‌రానికి గాను నాలుగేళ్ల బీఎస్సీ(న‌ర్సింగ్‌) కోర్సులో ప్ర‌వేశాల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది. ఈ కోర్సు పూర్తి చేసిన వారికి మిలిట‌రీ న‌ర్సింగ్ స‌ర్వీస్‌లో ప‌ర్మినెంట్‌/ షార్ట్ స‌ర్వీస్ క‌మిష‌న్‌లో ఉద్యోగం క‌ల్పిస్తారు. 

వివ‌రాలు..

* బీఎస్సీ(నర్సింగ్‌) కోర్సు-2021

అర్హ‌త‌: క‌నీసం 50% మార్కుల‌కు త‌గ్గ‌కుండా ఫిజిక్స్‌, కెమిస్ట్రీ, బ‌యాల‌జీ(బోట‌నీ & జువాల‌జీ), ఇంగ్లిష్ స‌బ్జెక్టుల‌తో మొద‌టి ప్ర‌య‌త్నంలోనే ఇంట‌ర్మీడియ‌ట్‌(10+2)/ త‌త్స‌మాన ప‌రీక్ష ఉత్తీర్ణ‌త‌. నిర్దిష్ఠ శారీర‌క ప్ర‌మాణాలు క‌లిగి ఉండాలి. అవివాహిత‌/ విడాకులు/ లీగ‌ల్‌గా విడిపోయిన మ‌హిళ‌లు ద‌ర‌ఖాస్తు చేసుకోవ‌చ్చు.

వ‌య‌సు: 01 అక్టోబ‌రు 1996 - 30 సెప్టెంబ‌రు 2004 మ‌ధ్య జ‌న్మించి ఉండాలి.

ఎంపిక విధానం: క‌ంప్యూట‌ర్ బేస్డ్ ఎగ్జామినేష‌న్‌(సీబీఈ), ఇంట‌ర్వ్యూ ఆధారంగా ఎంపిక ప్ర‌క్రియ ఉంటుంది. అర్హ‌త క‌లిగిన అభ్య‌ర్థుల‌ను ఆబ్జెక్టివ్ టైప్ కంప్యూట‌ర్ ‌బేస్డ్ ప‌రీక్ష‌కు పిలుస్తారు. ఈ ప‌రీక్ష 90 నిమిషాలు ఉంటుంది. దీన్ని ఏప్రిల్ 2021లో నిర్వహిస్తారు. ఈ ప‌రీక్ష‌లో మెరిట్ సాధించిన వారిని జూన్ 2021లో ఇంట‌ర్వ్యూకి పిలుస్తారు. కంప్యూట‌ర్ బేస్డ్ టెస్ట్‌, ఇంట‌ర్వ్యూలో సాధించిన మెరిట్ ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది. దీనిలో అర్హ‌త సాధించిన వారికి మెడిక‌ల్ ఫిట్‌నెస్ టెస్ట్ ఉంటుంది.

ద‌ర‌ఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా ద‌ర‌ఖాస్తు చేసుకోవాలి.

ఆన్‌లైన్ ద‌ర‌ఖాస్తు ప్ర‌క్రియ ప్రారంభం: 17.02.2021.

ఆన్‌లైన్ ద‌ర‌ఖాస్తుకు చివ‌రి తేది: 10.03.2021.

Notification Information

Posted Date: 16-02-2021

 

నోటిఫికేష‌న్స్‌ :