• facebook
  • twitter
  • whatsapp
  • telegram

మ‌నూలో రెగ్యుల‌ర్ యూజీ, పీజీ, పీహెచ్‌డీ ప్రోగ్రాములు

హైద‌రాబాద్‌లోని కేంద్రీయ విశ్వ‌విద్యాల‌య‌మైన‌ మౌలానా ఆజాద్ నేష‌న‌ల్ ఉర్దూ యూనివ‌ర్సిటీ (మ‌నూ)2021-2022 విద్యాసంవ‌త్స‌రానికి కింది ప్రోగ్రాముల్లో ప్ర‌వేశాల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.

వివ‌రాలు..

1) అడ్మిష‌న్ టెస్ట్ ద్వారా ప్ర‌వేశాలు

* యూజీ ప్రోగ్రాములు: బీఈడీ అండ్ బీటెక్ (కంప్యూట‌ర్ సైన్స్‌).

* పీజీ ప్రోగ్రాములు: ఎంబీఏ, ఎంసీఏ, ఎంటెక్ (కంప్యూట‌ర్ సైన్స్‌), ఎంఈడీ.

* ప్రొఫెష‌న‌ల్ డిప్లొమా: డిప్లొమా ఇన్ ఎలిమెంట‌రీ ఎడ్యుకేష‌న్‌, పాలిటెక్నిక్ డిప్లొమా ఇన్ ఇంజినీరింగ్ (సివిల్‌, కంప్యూట‌ర్ సైన్స్ త‌దిత‌రాలు).

* పీహెచ్‌డీ ప్రోగ్రాములు: ఉర్దూ, ఇంగ్లిష్‌, హిందీ, ప‌ర్షియ‌న్‌, ట్రాన్స్‌లేష‌న‌ల్ స్ట‌డీస్‌, ప‌బ్లిక్ అడ్మినిస్ట్రేష‌న్‌, పొలిటిక‌ల్ సైన్స్ త‌దిత‌రాలు.

ఎంపిక విధానం: అడ్మిష‌న్ టెస్ట్ ద్వారా ఎంపిక ప్ర‌క్రియ నిర్వ‌హిస్తారు.

ద‌ర‌ఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా ద‌ర‌ఖాస్తు చేసుకోవాలి.

ద‌ర‌ఖాస్తుకు చివ‌రి తేది: 12.07.2021.

2) మెరిట్ ద్వారా ప్ర‌వేశాలు

* పీజీ ప్రోగ్రాములు: ఉర్దూ, ఇంగ్లిష్‌, హిందీ, అర‌బిక్‌, ట్రాన్స్‌లేష‌న్ స్ట‌డీస్, ఉమెన్ స్ట‌డీస్‌, పబ్లిక్ అడ్మినిస్ట్రేష‌న్‌, పొలిటిక‌ల్ సైన్స్ త‌దిత‌రాలు.

* యూజీ ప్రోగ్రాములు: బీఏ, బీఏ (ఆన‌ర్స్‌), బీకాం, బీఎస్సీ( ఎంపీసీ), బీఎస్సీ (ఎంపీసీఎస్‌), బీఎస్సీ (జ‌డ్‌బీసీ).

* బ్రిడ్జి కోర్సులు: మ‌ద‌ర్సాల నుంచి ఉత్తీర్ణులైన అభ్య‌ర్థుల‌కు అండ‌ర్‌గ్రాడ్యుయేట్ కోర్సులు( బీకాం/ బీఎస్సీ).

* బ్యాచిల‌ర్ ఆఫ్ ఒకేష‌న‌ల్ కోర్సులు: మెడిక‌ల్ ఇమేజింగ్ టెక్నాల‌జీ (ఎంఐటీ), మెడిక‌ల్ ల్యాబొరేట‌రీ టెక్నాల‌జీ (ఎంఎల్‌టీ).

* లేట‌ర‌ల్ ఎంట్రీ: బీటెక్ అండ్ పాలిటెక్నిక్స్‌.

* పార్ట్ టైం డిప్లొమా ప్రోగ్రాములు: ఉర్దూ, హిందీ, అర‌బిక్‌, ప‌ర్షియ‌న్ అండ్ ఇస్లామిక్ స్ట‌డీస్ త‌దిత‌రాలు.

ఎంపిక విధానం: అక‌డ‌మిక్ మెరిట్ ఆధారంగా ఎంపిక ప్ర‌క్రియ నిర్వ‌హిస్తారు. 

ద‌ర‌ఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా ద‌ర‌ఖాస్తు చేసుకోవాలి.

ఆన్‌లైన్ ద‌ర‌ఖాస్తు ప్ర‌క్రియ ప్రారంభం: 10.06.2021.

ద‌ర‌ర‌ఖాస్తుకు చివ‌రి తేది: 04.09.2021.

Notification Information

Posted Date: 10-06-2021

 

నోటిఫికేష‌న్స్‌ :