• facebook
  • twitter
  • whatsapp
  • telegram

మ‌హాత్మా జ్యోతిబాపూలే ఆర్‌జేసీ, ఆర్‌డీసీ సెట్‌-2021 

తెలంగాణ ప్ర‌భుత్వానికి చెందిన హైద‌రాబాద్‌లోని మ‌హాత్మా జ్యోతిబాపూలే తెలంగాణ వెనుక‌బ‌డిన త‌ర‌గ‌తుల సంక్షేమ గురుకుల విద్యాల‌యాల సంస్థ 2021-2022 విద్యాసంవ‌త్స‌రానికి ఇంట‌ర్మీడియ‌ట్‌, డిగ్రీ కోర్సుల్లో ప్ర‌వేశాల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.

వివ‌రాలు..

* ఎంజేపీటీబీసీడ‌బ్ల్యూ ఆర్‌జేసీ & ఆర్‌డీసీ సెట్-2021

కోర్సులు: ఇంట‌ర్మీడియ‌ట్‌, డిగ్రీ మొద‌టి ఏడాది.

1) ఇంట‌ర్మీడియ‌ట్ (ఇంగ్లిష్ మీడియం)

మొత్తం క‌ళాశాలలు: 134 (బాలురు-66, బాలిక‌లు-68)

గ్రూపులు: ఎంపీసీ, బైపీసీ, సీఈసీ, హెచ్ఈసీ, ఎంఈసీ, ఇత‌ర వృత్తివిద్యా కోర్సులు.

అర్హ‌త‌: 2021-22 విద్యాసంవ‌త్స‌రంలో ప‌దో త‌ర‌గ‌తి ప‌రీక్ష‌కు హాజ‌ర‌వుతున్న తెలంగాణ రాష్ట్రానికి చెందిన 33 జిల్లాల విద్యార్థులు అర్హులు. 

2) మ‌హిళా డిగ్రీ క‌ళాశాల‌-1 (ఇంగ్లిష్ మీడియం)

కోర్సులు: 1) బీఎస్సీ, ఎంపీసీ 2) బీఎస్సీ ఎంఎస్‌సీఎస్ 3) బీఎస్సీ ఎంపీసీఎస్ 4) బీఎస్సీ బీజ‌డ్‌సీ 5) బీఎస్సీ బీబీసీ 6) బీఎస్సీ డేటా సైన్స్ 7) బీఏ హెచ్ఈపీ  8) బీఏ హెచ్ఈపీ  9) బీకాం (జ‌న‌ర‌ల్‌)  10) బీకాం (కంప్యూట‌ర్స్‌) 11) బీకాం (బిజినెస్ అన‌లైటిక్స్‌).

అర్హ‌త‌: 2021-22 విద్యాసంవ‌త్స‌రంలో ఇంట‌ర్మీడియ‌ట్ ద్వితీయ సంవ‌త్స‌రం ప‌రీక్ష‌కు హాజ‌ర‌వుతున్న తెలంగాణ రాష్ట్రానికి చెందిన 33 జిల్లాల విద్యార్థులు అర్హులు.

ఎంపిక విధానం: ప్ర‌వేశ ప‌రీక్ష‌లో ప్ర‌తిభ‌, రిజ‌ర్వేష‌న్ ఆధారంగా ఎంపిక ప్ర‌క్రియ నిర్వ‌హిస్తారు.

ద‌ర‌ఖాస్తు ఫీజు:  రూ.200 చెల్లించాలి.

ముఖ్య‌మైన తేదీలు:  

ద‌ర‌ఖాస్తు ప్ర‌క్రియ ప్రారంభం: 23.04.2021.

ద‌ర‌ఖాస్తుకు చివ‌రి తేది: 31.05.2021.

హాల్‌టికెట్లు డౌన్‌లోడ్ తేదీ: 04.06.2021.

ప్ర‌వేశ ప‌రీక్ష తేది: 13.06.2021.

Notification Information

Posted Date: 21-04-2021

 

నోటిఫికేష‌న్స్‌ :