• facebook
  • twitter
  • whatsapp
  • telegram

ఎన్‌బీఈ-నీట్ పీజీ 2021 

భారత ప్ర‌భుత్వ ఆరోగ్య‌, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ‌శాఖ‌కు చెందిన న్యూదిల్లీలోని నేష‌నల్ బోర్డ్ ఆఫ్ ఎగ్జామినేష‌న్స్‌(ఎన్‌బీఈ) 2021 సంవ‌త్స‌రానికి నేష‌న‌ల్ ఎలిజిబిలిటీ క‌మ్ ఎంట్ర‌న్స్ టెస్ట్ (నీట్) పోస్టు గ్రాడ్యుయేష‌న్(పీజీ) నోటిఫికేష‌న్ విడుద‌ల చేసింది. దీని ద్వారా ఎండీ/ ఎంఎస్‌/  పీజీ డిప్లొమా కోర్సుల్లో ప్ర‌వేశాలు క‌ల్పిస్తారు.

వివ‌రాలు..

* నేష‌న‌ల్ ఎలిజిబిలిటీ క‌మ్ ఎంట్ర‌న్స్ టెస్ట్ (నీట్) పీజీ-2021

అర్హ‌త‌: ఎంబీబీఎస్ డిగ్రీ/ ప‌్రొవిజ‌న‌ల్ ఎంబీబీఎస్ ఉత్తీర్ణ‌త‌. 30.06.2021 నాటికి ఏడాది ఇంట‌ర్న్‌షిప్ పూర్తి చేసి ఉండాలి.

ఎంపిక విధానం: క‌ంప్యూట‌ర్ బేస్డ్ టెస్ట్ ఆధారంగా ఎంపిక ప్ర‌క్రియ ఉంటుంది. 

ప‌రీక్షా విధానం: ఈ ప‌రీక్ష మ‌ల్టిపుల్ ఛాయిస్ ప‌ద్ధ‌తిలో ఉంటుంది. దీనిలో 200 ప్ర‌శ్న‌లు ఉంటాయి. ప్ర‌తి ప్ర‌శ్న‌కు 4 మార్క‌లు కేటాయిస్తారు. దీనికి నెగిటివ్ మార్కింగ్ ఉంటుంది. ప్ర‌తి తప్పు స‌మాధానానికి 1 మార్కు తీసెస్తారు. ఈ ప‌రీక్ష ఇంగ్లిష్ మాధ్య‌మంలో మాత్ర‌మే ఉంటుంది. ప‌రీక్షా స‌మ‌యం 3 గంట‌ల 30 నిమిషాలు ఉంటుంది.

ద‌ర‌ఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా ద‌ర‌ఖాస్తు చేసుకోవాలి.

ముఖ్య‌మైన తేదీలు: 

* ఆన్‌లైన్ ద‌ర‌ఖాస్తు ప్ర‌క్రియ ప్రారంభం: 23.02.2021.

* ఆన్‌లైన్ ద‌ర‌ఖాస్తుకు చివ‌రి తేది: 15.03.2021.

* ఎడిట్ చేసుకోవ‌డానికి చివ‌రి తేది: 19.03.2021 నుంచి 21.03.2021 వ‌ర‌కు.

* హాల్‌టికెట్ డౌన్‌లోడ్‌కి చివ‌రి తేది: 12.04.2021.

* ప‌రీక్ష తేది: 18.04.2021.

* ఫ‌లితాల వెల్ల‌డి తేది: 31.05.2021.
 

Notification Information

Posted Date: 23-02-2021

 

నోటిఫికేష‌న్స్‌ :