• facebook
  • twitter
  • whatsapp
  • telegram

నెస్ట్‌-2021 

భార‌త ప్ర‌భుత్వ అణు శ‌క్తి విభాగానికి చెందిన భువ‌నేశ్వ‌ర్‌లోని నైస‌ర్‌, ముంబ‌యిలోని యూఎం-డీఏఈ సీఈబీఎస్ సంయుక్తంగా 2021 సంవ‌త్స‌రానికి  నేష‌న‌ల్ ఎంట్ర‌న్స్ స్క్రీనింగ్ టెస్ట్‌(నెస్ట్‌-2021) నోటిఫికేష‌న్ విడుద‌ల చేశాయి. దీని ద్వారా ఐదేళ్ల ఇంటిగ్రేటెడ్ ఎమ్మెస్సీలో ప్ర‌వేశాలు క‌ల్పిస్తారు.

వివ‌రాలు..

* నేష‌న‌ల్ ఎంట్ర‌న్స్ స్క్రీనింగ్ టెస్ట్‌(నెస్ట్‌)-2021

అర్హ‌త‌: సైన్స్ విభాగాల్లో క‌నీసం 60%/ త‌త్స‌మాన సీజీపీఏతో 2019/ 2020లో ఇంట‌ర్మీడియ‌ట్ పూర్తి చేసినవారు అర్హులు. 2021లో ఇంట‌ర్మీడియ‌ట్ ప‌రీక్ష‌ల‌కు హాజ‌ర‌వుతున్న వారు ద‌ర‌ఖాస్తు చేసుకోవ‌చ్చు.

వ‌య‌సు: జ‌న‌ర‌ల్‌, ఓబీసీ విద్యార్థులు ఆగ‌స్టు 01, 2001 త‌ర్వాత జ‌న్మించి ఉండాలి. ఎస్సీ/ ఎస్టీ/  పీడ‌బ్ల్యూడీ అభ్య‌ర్థుల‌కు గ‌రిష్ఠ వ‌య‌సులో ఐదేళ్ల స‌డ‌లింపు ఉంటుంది. 

ఎంపిక విధానం: క‌ంప్యూట‌ర్ బేస్డ్ టెస్ట్ ఆధారంగా ఎంపిక ప్ర‌క్రియ ఉంటుంది. 

ప‌రీక్షా విధానం: ఈ ప‌రీక్షలో నాలుగు సెక్ష‌న్లు ఉంటాయి. ప్రతి సెక్ష‌న్‌ మ‌ల్టిపుల్ ఛాయిస్ రూపంలో ఉంటుంది. ప్ర‌తి సెక్ష‌న్‌కు 50 మార్కులు ఉంటాయి. బ‌యాల‌జీ, కెమిస్ట్రీ, మ్యాథ‌మేటిక్స్‌, ఫిజిక్స్ స‌బ్జెక్టుల నుంచి ప్ర‌శ్న‌లు ఉంటాయి. ఈ నాలుగు సెక్ష‌న్ల‌లో అభ్య‌ర్థి ప్ర‌తిభ‌క‌న‌బ‌రిచిన‌ మూడు సెక్ష‌న్ల‌ను ప్రాతిప‌దిక‌గా తీసుకొని, స‌రిగా చేయ‌ని సెక్ష‌న్‌కు వ‌దిలేస్తారు. మెరిట్ జాబితా ఈ మూడు సెక్ష‌న్ల‌లో సాధించిన మార్కుల ఆధారంగా త‌యారు చేస్తారు. దీనికి నెగిటివ్ మార్కింగ్ ఉంటుంది.

తెలుగు రాష్ట్రాల్లో ప‌రీక్షా కేంద్రాలు:  గుంటూరు, క‌ర్నూలు, రాజ‌మండ్రి, తిరుప‌తి, విజ‌య‌వాడ‌, విశాఖ‌ప‌ట్నం, విజ‌య‌న‌గ‌రం, హైద‌రాబాద్‌, క‌రీంన‌గ‌ర్‌, వ‌రంగ‌ల్‌.

ద‌రఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా ద‌ర‌ఖాస్తు చేసుకోవాలి. 

ద‌ర‌ఖాస్తు ఫీజు: జ‌న‌ర‌ల్‌, ఓబీసీ అభ్య‌ర్థులు రూ.1200, ఎస్సీ/ ఎస్టీ/ పీడ‌బ్ల్యూడీ అభ్య‌ర్థులు రూ.600 చెల్లించాలి.

ముఖ్య‌మైన తేదీలు:

* ఆన్‌లైన్ ద‌ర‌ఖాస్తు ప్ర‌క్రియ ప్రారంభం: 24.02.2021.

* ఆన్‌లైన్ ద‌ర‌ఖాస్తుకు చివ‌రి తేది: 30.04.2021.

* హాల్‌టికెట్ డౌన్‌లోడ్ తేదీ: 20.05.2021.

* నెస్ట్ 2021 ప‌రీక్ష తేది: 14.06.2021.

* ఫ‌లితాల వెల్ల‌డి: 30.06.2021.
 

Notification Information

Posted Date: 12-02-2021

 

నోటిఫికేష‌న్స్‌ :