• facebook
  • twitter
  • whatsapp
  • telegram

ఎన్ఐబీఏం, పుణెలో పీజీడీఎం ప్రోగ్రాం 

రిజ‌ర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఆర్‌బీఐ)కి చెందిన బ్యాంకింగ్ అండ్ ఫైనాన్స్‌లో అగ్ర‌సంస్థ అయిన పుణెలోని నేష‌నల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ బ్యాంక్ మేనేజ్‌మెంట్ (ఎన్ఐబీఎం) 2021-2023 విద్యాసంవ‌త్స‌రానికి కింది ప్రోగ్రాములో ప్ర‌వేశాల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.

వివ‌రాలు...

* పోస్టు గ్రాడ్యుయేట్ డిప్లొమా ఇన్ మేనేజ్‌మెంట్ (బ్యాకింగ్ అండ్ ఫైనాన్షియ‌ల్ స‌ర్వీసెస్‌) 2021-2023

అర్హ‌త‌: క‌నీసం 50% మార్కుల‌తో/ త‌త్స‌మాన సీజీపీఏతో ఏదైనా బ్యాచిల‌ర్స్ డిగ్రీ ఉత్తీర్ణ‌త‌. డిగ్రీ చివ‌రి ఏడాది ప‌రీక్ష‌ల‌కు హాజ‌ర‌వుతున్న విద్యార్థులు ద‌ర‌ఖాస్తు చేసుకోవ‌చ్చు. 

ఎంపిక విధానం: పీజీడీఎం(బీ&ఎఫ్ఎస్‌)లో ప్ర‌వేశాలు పొందాలంటే ఎన్ఐబీఏం కింది జాతీయ అర్హ‌త ప‌రీక్ష‌ల స్కోరును ప‌రిగ‌ణ‌న‌లోకి తీసుకుంటో్ంది. అభ్య‌ర్థుల‌ను  2020/ గ‌్జాట్ 2021/ సీమ్యాట్ 2021 ప‌రీక్ష‌ల వాలిడ్ స్కోర్ ఆధారంగా షార్ట్‌లిస్టింగ్ చేస్తారు. షార్ట్‌లిస్ట్ అయిన వారిని రైటింగ్ ఎబిలిటీ టెస్ట్‌/ ఓర‌ల్ క‌మ్యూనికేష‌న్ టెస్ట్‌, ఇంట‌ర్వ్యూకి పిలుస్తారు. కింద సూచించిన‌ మార్కుల వెయిటేజి ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది.

క్యాట్‌/ గ‌్జాట్/ సీమ్యాట్ స్కోర్స్‌: 35%

విద్యార్హ‌త‌లు: 25%

రైటింగ్ ఎబిలిటీ టెస్ట్‌/ ఓర‌ల్ క‌మ్యూనికేష‌న్ టెస్ట్ అండ్ ప‌ర్స‌న‌ల్ ఇంట‌ర్వ్యూ: 35%

ఎక్స్‌ట్రాక‌రిక్యుల‌ర్ యాక్టివిటీస్‌, స్పోర్ట్స్ త‌దితరాలు: 5%

ద‌ర‌ఖాస్తు విధానం: ఆన్‌లైన్‌/ ఆఫ్‌లైన్ ద్వారా ద‌ర‌ఖాస్తు చేసుకోవ‌చ్చు.

ద‌ర‌ఖాస్తుకు చివ‌రి తేది: 20.03.2021.

చిరునామా: Education & Principal, National Institute of Bank Management, NIBM PO, Kondhwe Khurd, Pune 411 048.
 

Notification Information

Posted Date: 10-01-2021

 

నోటిఫికేష‌న్స్‌ :