• facebook
  • twitter
  • whatsapp
  • telegram

నిఫ్ట్‌లో ఆర్టిజ‌న్స్‌/ చిల్డ్ర‌న్ ఆఫ్ ఆర్టిజ‌న్స్ ప్ర‌వేశాలు

భార‌త ప్ర‌భుత్వ టెక్స్‌టైల్ మంత్రిత్వ‌శాఖ‌కు చెందిన నేష‌న‌ల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాల‌జీ(నిఫ్ట్‌) దేశ‌వ్యాప్తంగా ఉన్న వివిధ ప్రాంగ‌ణాల్లో 2021 సంవ‌త్స‌రానికి గాను కింది ప్రోగ్రాముల్లో ప్ర‌వేశాల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.

వివ‌రాలు..

* బ్యాచిల‌ర్ ఆఫ్ డిజైన్ - ఆర్టిజ‌న్స్‌/ చిల్డ్ర‌న్ ఆఫ్ ఆర్టిజ‌న్స్

విభాగాలు: ఫ్యాష‌న్ డిజైన్‌/ లెథ‌ర్ డిజైన్‌/ యాక్సెస‌రీ డిజైన్‌/ టెక్స్‌టైల్ డిజైన్‌/ నిట్‌వేర్ డిజైన్‌/ ఫ‌్యాష‌న్ క‌మ్యూనికేష‌న్‌.

అర్హ‌త‌: ఇంట‌ర్మీడియ‌ట్‌(10+2)/ మూడు లేదా నాలుగేళ్ల డిప్లొమా ఉత్తీర్ణ‌త‌.

వ‌య‌సు: 01.08.2021 నాటికి 24 ఏళ్లు మించ‌కూడ‌దు. ఎస్సీ/ ఎస్టీ/ పీడ‌బ్ల్యూడీ అభ్య‌ర్థుల‌కు ఐదేళ్లు గ‌రిష్ఠ వ‌య‌సులో స‌డ‌లింపు ఉంటుంది.

ఎంపిక విధానం: స్టూడియో టెస్ట్‌, ప‌ర్స‌న‌ల్ ఇంట‌ర్వ్యూ, డాక్యుమెంట్ వెరిఫికేష‌న్ ఆధారంగా ఎంపిక ప్ర‌క్రియ ఉంటుంది. స్టూడియో టెస్ట్ ప్రోగ్రాంకి సంబంధించి అభ్య‌ర్థుల‌ నాలెడ్జ్, స్కిల్ ఆప్టిట్యూడ్ తెలుసుకోవ‌డానికి నిర్వ‌హిస్తారు. స్టూడియో టెస్ట్‌, ఇంట‌ర్వ్యూలో సాధించిన మార్కుల ఆధారంగా మెరిట్

జాబితా త‌యారుచేస్తారు. స్టూడియో టెస్ట్‌-40, ఇంట‌ర్వ్యూకి-20 వెయిటేజ్ కేటాయించారు.

ద‌ర‌ఖాస్తు విధానం: ఆఫ్‌లైన్ ద్వారా ద‌ర‌ఖాస్తు చేసుకోవాలి.

ద‌ర‌ఖాస్తు ఫీజు: జ‌న‌ర‌ల్‌/ ఓబీసీ అభ్య‌ర్థులు రూ.2000, ఎస్సీ/ ఎస్టీ/ పీడ‌బ్ల్యూడీ అభ్య‌ర్థులు రూ.1000 చెల్లించాలి.

ఆఫ్‌లైన్ ద‌ర‌ఖాస్తు ప్ర‌క్రియ ప్రారంభం: 18.02.2021.

ద‌ర‌ఖాస్తుకు చివ‌రి తేది: 21.03.2021.

Notification Information

Posted Date: 18-02-2021

 

నోటిఫికేష‌న్స్‌ :