• facebook
  • twitter
  • whatsapp
  • telegram

ఆర్‌జీఎన్ఏయూలో వివిధ ప్రోగ్రాములు

భార‌త ప్ర‌భుత్వ పౌర‌విమాన‌యాన మంత్రిత్వ‌శాఖ‌కు చెందిన ఉత్త‌ర‌ప్ర‌దేశ్ (అమేథీ)లోని రాజీవ్ గాంధీ నేష‌న‌ల్ ఏవియేష‌న్ యూనివ‌ర్సిటీ (ఆర్‌జీఎన్ఏయూ) 2021 విద్యాసంవ‌త్స‌రానికి కింది ప్రోగ్రాముల్లో ప్ర‌వేశాల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.

వివ‌రాలు..

1) పోస్టు గ్రాడ్యుయేట్ డిప్లొమా ఇన్ ఎయిర్‌పోర్ట్ ఆప‌రేష‌న్స్ (పీజీడీఏఓ)

* జీఎంఆర్ ఏవియేష‌న్ అకాడ‌మీతో క‌లిసి ఈ ప్రోగ్రాం నిర్వ‌హిస్తారు. ఈ కోర్సు వ్య‌వ‌ధి-12 నెల‌లు క్లాస్ రూం ట్రెయినింగ్‌, 06 నెల‌లు జీఎంఆర్ ఎయిర్‌పోర్ట్స్‌లో ఇంట‌ర్న్‌షిప్ చేయాల్సి ఉంటుంది.

అర్హ‌త‌: క‌నీసం 55% మార్కుల‌తో ఏదైనా బ్యాచిల‌ర్స్ డిగ్రీ ఉత్తీర్ణ‌త‌. ఫ‌లితాల కోసం చూస్తున్న విద్యార్థులు ద‌ర‌ఖాస్తు చేసుకోవ‌చ్చు.

వ‌య‌సు: 31.07.2021 నాటికి 25 ఏళ్లు మించ‌కుండా ఉండాలి.

ఎంపిక విధానం: గ్రాడ్యుయేష‌న్‌లో మార్కులు, ఆన్‌లైన్ ఇంట‌ర్వ్యూలో ప్ర‌తిభ ఆధారంగా ఎంపిక ప్ర‌క్రియ నిర్వ‌హిస్తారు. 

2) బ్యాచిల‌ర్ ఆఫ్ మేనేజ్‌మెంట్ స్ట‌డీస్ (బీఎంఎస్‌) ఇన్ ఏవియేష‌న్ స‌ర్వీసెస్ అండ్ ఎయిర్ కార్గో

* లాజిస్టిక్ సెక్టార్ స్కిల్ కౌన్సిల్‌తో క‌లిసి ఈ ప్రోగ్రాం నిర్వ‌హిస్తారు. ఈ కోర్సు మూడు సంవ‌త్స‌రాల అప్రెంటిస్‌షిప్-ఎంబ‌డెడ్ డిగ్రీ ప్రోగ్రాం.

అర్హ‌త‌: క‌నీసం 50% మార్కుల‌తో మ్యాథ‌మేటిక్స్‌/ బిజినెస్ స్టాటిస్టిక్స్‌/ బిజినెస్ మ్యాథ‌మేటిక్స్ ఒక స‌బ్జెక్టుగా ఇంట‌ర్మీడియ‌ట్ (10+2) ఉత్తీర్ణ‌త‌.

వ‌య‌సు: 31.07.2021 నాటికి 21 ఏళ్లు మించ‌కుండా ఉండాలి.

ఎంపిక విధానం: ఇంట‌ర్మీడియ‌ట్‌ మార్కులు, ఆన్‌లైన్ ఇంట‌ర్వ్యూలో ప్ర‌తిభ ఆధారంగా ఎంపిక ప్ర‌క్రియ నిర్వ‌హిస్తారు. 

ద‌ర‌ఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా ద‌ర‌ఖాస్తు చేసుకోవాలి.

ఆన్‌లైన్ ద‌ర‌ఖాస్తుకు చివ‌రి తేది: 06.07.2021.

Notification Information

Posted Date: 11-06-2021

 

నోటిఫికేష‌న్స్‌ :