• facebook
  • twitter
  • whatsapp
  • telegram

ఎస్‌బీటీఈటీ-ఎల్‌పీసెట్ 2021 

హైద‌రాబాద్‌లోని స్టేట్ బోర్డ్ ఆఫ్ టెక్నిక‌ల్ ఎడ్యుకేష‌న్ అండ్ ట్రెయినింగ్ తెలంగాణ (ఎస్‌బీటీఈటీ) 2021-2022 విద్యాసంవ‌త్సరానికి లేట‌ర‌ల్ ఎంట్రీ పాలిటెక్నిక‌ల్ కామ‌న్ ఎంట్ర‌న్స్ టెస్ట్ (ఎల్‌పీసెట్‌) నోటిఫికేష‌న్ విడుద‌ల చేసింది. దీని ద్వారా ఐటీఐ అభ్య‌ర్థుల‌కు ఇంజినీరింగ్ డిప్లొమా రెండో ఏడాదిలో ప్ర‌వేశాలు క‌ల్పిస్తారు. 

వివ‌రాలు..

* లేట‌ర‌ల్ ఎంట్రీ పాలిటెక్నిక్ కామ‌న్ ఎంట్ర‌న్స్ టెస్ట్ (ఎల్‌పీసెట్‌)-2021

అర్హ‌త‌: క‌నీసం 60% మార్కుల‌తో రెండేళ్ల ఐటీఐ కోర్సు ఉత్తీర్ణ‌త‌తో పాటు డిపార్ట్‌మెంట్ ఆఫ్ ఎంప్లాయిమెంట్ అండ్ ట్రెయినింగ్ (డీఈటీ) నిర్వ‌హించే బ్రిడ్జ్ కోర్సు చేసి ఉండాలి.

ద‌ర‌ఖాస్తు విధానం: ఆఫ్‌లైన్ ద్వారా ద‌ర‌ఖాస్తు చేసుకోవాలి.

ద‌ర‌ఖాస్తు ఫీజు: ఇత‌రులు రూ.500, ఎస్సీ/ ఎస్టీ అభ్యర్థులు రూ.300 చెల్లించాలి.

ముఖ్య‌మైన తేదీలు: 

* ద‌ర‌ఖాస్తు ప్ర‌క్రియ ప్రారంభం: 11.06.2021.

* ఆల‌స్య రుసుం లేకుండా ద‌ర‌ఖాస్తుకు చివ‌రి తేది: 21.06.2021.

* రూ.100 ఆల‌స్య రుసుంతో ద‌ర‌ఖాస్తుకు చివ‌రి తేది: 22.06.2021.

* ద‌ర‌ఖాస్తుల‌కు చివ‌రి తేది: 23.06.2021.

* ఎల్‌పీసెట్‌-2021 ప‌రీక్ష తేది: వెల్ల‌డించాల్సి ఉంది.

Notification Information

Posted Date: 10-06-2021

 

నోటిఫికేష‌న్స్‌ :