• facebook
  • twitter
  • whatsapp
  • telegram

టీఎస్-ఎడ్‌సెట్ 2021 

తెలంగాణ రాష్ట్ర ఉన్న‌త విద్యామండ‌లి 2021-2022 విద్యాసంవ‌త్స‌రానికి తెలంగాణ స్టేట్ ఎడ్యుకేష‌న్ కామ‌న్ ఎంట్ర‌న్స్ టెస్ట్ (టీఎస్ ఎడ్‌సెట్‌) నోటిఫికేష‌న్ విడుద‌ల చేసింది. ఈ ప‌రీక్ష‌ను హైద‌రాబాద్‌లోని ఉస్మానియా యూనివ‌ర్సిటీ నిర్వ‌హిస్తోంది. దీని ద్వారా రెండేళ్ల రెగ్యుల‌ర్‌ బీఈడీ కోర్సుల్లో ప్ర‌వేశాలు క‌ల్పిస్తారు. 

వివ‌రాలు..

* తెలంగాణ స్టేట్ ఎడ్యుకేష‌న్ కామ‌న్ ఎంట్ర‌న్స్ టెస్ట్ (టీఎస్ ఎడ్‌సెట్‌) 2021

అర్హ‌త‌: ఏదైనా బ్యాచిల‌ర్స్ డిగ్రీ ఉత్తీర్ణ‌త‌. డిగ్రీ చివ‌రి ఏడాది ప‌రీక్ష‌ల‌కు హాజ‌ర‌వుతున్న విద్యార్థులు దీనికి ద‌ర‌ఖాస్తు చేసుకోవ‌చ్చు.

వ‌య‌సు: 01.07.2021 నాటికి 19 ఏళ్లు నిండి ఉండాలి. గ‌రిష్ఠ వ‌య‌సుతో సంబంధం లేదు.

ఎంపిక విధానం: ఉమ్మ‌డి ప్ర‌వేశ ప‌రీక్ష ఆధారంగా ఎంపిక ప్ర‌క్రియ నిర్వ‌హిస్తారు. 

ద‌రఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా ద‌ర‌ఖాస్తు చేసుకోవాలి.

ద‌ర‌ఖాస్తు ఫీజు: ఇత‌రులు రూ.650, ఎస్సీ/ ఎస్టీ/  పీహెచ్ అభ్య‌ర్థులు రూ.450 చెల్లించాలి.

ముఖ్య‌మైన తేదీలు: 

* ఆన్‌లైన్ ద‌ర‌ఖాస్తు ప్ర‌క్రియ ప్రారంభం: 19.04.2021.

* ఆన్‌లైన్ ద‌ర‌ఖాస్తుకు చివ‌రి తేది: 15.06.2021.

రూ.250 ఆల‌స్య రుసుంతో  చివ‌రి తేది: 25.06.2021.

రూ.500 ఆల‌స్య రుసుంతో చివ‌రి తేది: 05.07.2021.

రూ.1000 ఆల‌స్య రుసుంతో చివ‌రి తేది: 20.07.2021.

ప‌రీక్ష తేదీలు: 2021 ఆగ‌స్టు 24, 25.

Notification Information

Posted Date: 16-04-2021

 

నోటిఫికేష‌న్స్‌ :