• facebook
  • twitter
  • whatsapp
  • telegram

టీఎస్ పాలిటెక్నిక్ ఎంట్ర‌న్స్ టెస్ట్‌-2021 

హైద‌రాబాద్‌లోని స్టేట్ బోర్డ్ ఆఫ్ టెక్నిక‌ల్ ఎడ్యుకేష‌న్ అండ్ ట్రెయినింగ్ తెలంగాణ (ఎస్‌బీటీఈటీ) 2021-2022 విద్యాసంవ‌త్స‌రానికి పాలిటెక్నిక్ కామ‌న్ ఎంట్ర‌న్స్ టెస్ట్ (పాలీసెట్‌-2021) నోటిఫికేష‌న్ విడుద‌ల చేసింది. దీని ద్వారా ప‌దో త‌ర‌గతి పూర్తి చేసుకున్న విద్యార్థుల‌కు ఇంజినీరింగ్‌/  నాన్ ఇంజినీరింగ్ డిప్లొమా కోర్సుల్లో ప్ర‌వేశాలు క‌ల్పిస్తారు. 

వివ‌రాలు..

* పాలిటెక్నిక్ కామ‌న్ ఎంట్ర‌న్స్ టెస్ట్ (పాలీసెట్‌-2021)

అందిస్తున్న సంస్థ‌లు: ప్రొఫెస‌ర్ జ‌య‌శంక‌ర్ తెలంగాణ స్టేట్ అగ్రిక‌ల్చ‌ర్ యూనివ‌ర్సిటీ (పీజేటీఎస్ఏయూ), పీవీ న‌ర‌సింహారావు తెలంగాణ వెట‌ర్న‌రీ యూనివ‌ర్సిటీ (పీవీఎన్ఆర్‌టీవీయూ), అనుబంధ పాలిటెక్నిక‌ల్ కళాశాలలు.

అర్హ‌త‌: ప‌దో త‌ర‌గ‌తి/ త‌త్స‌మాన ఉత్తీర్ణ‌త‌. కంపార్ట్‌మెంట‌ల్ ప‌ద్ధ‌తిలో ఉత్తీర్ణులైన విద్యార్థులు ద‌ర‌ఖాస్తు చేసుకోవ‌చ్చు.

ఎంపిక విధానం: కామ‌న్ ఎంట్ర‌న్స్ టెస్ట్ ఆధారంగా ఎంపిక ప్ర‌క్రియ నిర్వ‌హిస్తారు.

ద‌ర‌ఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా ద‌ర‌ఖాస్తు చేసుకోవాలి.

ముఖ్య‌మైన తేదీలు:

* ఆన్‌లైన్ ద‌ర‌ఖాస్తు ప్ర‌క్రియ ప్రారంభం: 24.05.2021

* ఆల‌స్య రుసుం లేకుండా ద‌ర‌ఖాస్తుకు చివ‌రి తేది: 18.06.2021

* రూ.100 ఆల‌స్య రుసుంతో ద‌ర‌ఖాస్తుకు చివ‌రి తేది: 13.06.2021.

* రూ.300 ఆల‌స్య రుసుంతో ద‌ర‌ఖాస్తుకు చివ‌రి తేది: 15.06.2021.

* ప‌రీక్ష తేది (పాలీసెట్‌-2021): వెల్ల‌డించాల్సి ఉంది.

* ఫ‌లితాలు: ప‌రీక్ష నిర్వ‌హించిన 10 రోజుల అనంత‌రం ఫ‌లితాలు వెల్ల‌డిస్తారు.  
 

Notification Information

Posted Date: 11-06-2021

 

నోటిఫికేష‌న్స్‌ :