• facebook
  • twitter
  • whatsapp
  • telegram

టీఎస్‌పీఎస్సీ-ఆర్ఐఎంసీలో ఎనిమిదో త‌ర‌గ‌తి ప్ర‌వేశాలు 

భార‌త ప్ర‌భుత్వ ర‌క్ష‌ణ మంత్రిత్వశాఖ‌కు చెందిన దెహ్రాదూన్‌లోని రాష్ట్రీయ ఇండియ‌న్ మిలిట‌రీ కాలేజీ(ఆర్ఐఎంసీ)లో జ‌న‌వ‌రి 2022 ట‌ర్మ్‌ ఎనిమిదో త‌ర‌గ‌తి ప్ర‌వేశాల‌కు తెలంగాణ‌కు చెందిన బాలుర నుంచి తెలంగాణ స్టేట్ ప‌బ్లిక్ స‌ర్వీస్ క‌మిష‌న్(టీఎస్‌పీఎస్సీ) ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.

వివ‌రాలు..

* ఆర్ఐఎంసీలో ఎనిమిదో త‌ర‌గ‌తి ప్ర‌వేశాలు

అర్హ‌త‌: ఏడో త‌ర‌గ‌తి చదువుతున్న లేదా ఎడో త‌ర‌గ‌తి ఉత్తీర్ణులైన విద్యార్థులు అర్హులు. 

వ‌య‌సు: 01.01.2022 నాటికి ప‌ద‌కొండున్న‌ర ఏళ్ల‌కు త‌గ్గ‌కుండా ప‌ద‌మూడేళ్ల‌కు మించ‌కుండా ఉండాలి. 02.01.2009-01.07.2010 మ‌ధ్య జ‌న్మించి ఉండాలి.

ఎంపిక విధానం: రాత ప‌రీక్ష‌, వైవా వాయిస్‌, మెడిక‌ల్ ఎగ్జామినేషన్ ఆధారంగా ఎంపిక ప్ర‌క్రియ ఉంటుంది.

ప‌రీక్షా విధానం: రాత ప‌రీక్ష‌లో మొత్తం మూడు పేప‌ర్లు ఉంటాయి. అవి మ్యాథ‌మేటిక్స్‌, జ‌న‌ర‌ల్ నాలెడ్జ్, ఇంగ్లిష్. ఇందులో మ్యాథ‌మేటిక్స్ 200 మార్కుల‌కు, జ‌న‌ర‌ల్ నాలెడ్జ్ 75 మార్కుల‌కు, ఇంగ్లిష్ 125 మార్కుల‌కు ఉంటుంది. ప్ర‌తి పేప‌ర్‌లో క‌నీస ఉత్తీర్ణ‌త మార్కులు 50% ఉండాలి.

రాత పరీక్ష‌లో అర్హ‌త సాధించిన అభ్య‌ర్థుల‌కు వైవా వాయిస్ నిర్వ‌హిస్తారు. దీనిలో క‌నీస ఉత్తీర్ణ‌త మార్కులు 50% ఉండాలి‌. ఈ రెండింటిలో అర్హ‌త సాధించిన అభ్య‌ర్థుల‌కు చివ‌రిగా మెడిక‌ల్ టెస్ట్ ఉంటుంది. 

ద‌ర‌ఖాస్తు విధానం: ఆఫ్‌లైన్ ద్వారా ద‌ర‌ఖాస్తు చేసుకోవాలి.

ద‌ర‌ఖాస్తు ఫీజు: జ‌న‌ర‌ల్ అభ్య‌ర్థుల‌కు రూ.600, ఎస్సీ/ ఎస్టీ అభ్య‌ర్థులు రూ.555 చెల్లించాలి.

చిరునామా: The Rastriya Indian Military College, Garhi Cantt, Dehradun, Uttarakhand, PIN – 248003.

ముఖ్య‌మైన తేదీలు:

* ద‌ర‌ఖాస్తుకు చివ‌రి తేది: 15.04.2021.

* ప‌రీక్ష తేది: 05.06.2021.
 

Notification Information

Posted Date: 15-02-2021

 

నోటిఫికేష‌న్స్‌ :