• facebook
  • twitter
  • whatsapp
  • telegram

టీటీడ‌బ్ల్యూఆర్‌డీసీఎస్‌, అశోక్‌న‌గ‌ర్‌లో ప్ర‌వేశాలు 

తెలంగాణ ప్ర‌భుత్వానికి చెందిన వ‌రంగ‌ల్ జిల్లా అశోక్‌న‌గ‌ర్‌లోని టీటీడ‌బ్ల్యూఆర్ఈఐఎస్‌-తెలంగాణ ట్రైబ‌ల్ వెల్ఫేర్ రెసిడెన్షియ‌ల్ ఆర్మ్‌డ్ ఫోర్సెస్ ప్రిప‌రేట‌రీ డిగ్రీ కాలేజ్ ఫ‌ర్ మెన్ (టీటీడ‌బ్ల్యూఆర్‌డీసీఎస్‌) 2021-2022 విద్యాసంవ‌త్స‌రానికి కింది ప్రోగ్రాముల్లో డిగ్రీ మొద‌టి ఏడాది ప్ర‌వేశాల‌కు ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.

వివ‌రాలు..

* టీటీడ‌బ్ల్యూఆర్ఏఎఫ్‌పీడీసీలో డిగ్రీ మొద‌టి ఏడాది ప్ర‌వేశాలు (బాలురు)

కోర్సులు: బీఎస్సీ (ఎంపీసీ), బీఏ (హెచ్ఈపీ)

అర్హ‌త‌: క‌నీసం 60% మార్కుల‌తో 2020-2021 విద్యాసంవ‌త్స‌రంలో ఇంట‌ర్మీడియ‌ట్ ద్వితీయ సంవ‌త్స‌రం ప‌రీక్ష‌కు హాజ‌ర‌వుతున్న/ ఉత్తీర్ణులైన విద్యార్థులు అర్హులు. నిర్ధిష్ఠ శారీర‌క ప్ర‌మాణాలు ఉండాలి. కుటుంబ వార్షికాదాయం ప‌ట్ట‌ణాల్లో రెండు ల‌క్ష‌ల రూపాయ‌లు, గ్రామాల్లో ల‌క్ష యాబేవేల రూపాయ‌లు మించ‌కూడ‌దు.

వ‌య‌సు: 01.07.2021 నాటికి 16 ఏళ్లు నిండి ఉండాలి.

ఎంపిక విధానం: ఫిజిక‌ల్ ఫిట్‌నెస్ టెస్ట్‌, సైకో అన‌లైటిక‌ల్ టెస్ట్‌, మెడిక‌ల్ టెస్టులు, లెక్చ‌ర్‌, ఇంట‌ర్వ్యూ ఆధారంగా ఎంపిక ప్రక్రియ నిర్వ‌హిస్తారు. 

ప‌రీక్షా విధానం: రాత ప‌రీక్ష‌ను 100 మార్కులకు నిర్వ‌హిస్తారు. ప్ర‌శ్న‌లు మ‌ల్టిపుల్ ఛాయిస్ రూపంలో ఉంటాయి. దీనిలో అర్హ‌త సాధించిన అభ్య‌ర్థుల‌ను త‌దుప‌రి ఎంపిక ప్ర‌క్రియ‌కి పిలుస్తారు. 

ద‌ర‌ఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా ద‌ర‌ఖాస్తు చేసుకోవాలి.

ద‌ర‌ఖాస్తు ఫీజు: రూ.100 చెల్లించాలి.

ద‌ర‌ఖాస్తుకు చివ‌రి తేది: 31.05.2021.
 

Notification Information

Posted Date: 03-05-2021

 

నోటిఫికేష‌న్స్‌ :