• facebook
  • twitter
  • whatsapp
  • telegram

టీటీడ‌బ్ల్యూఆర్ఈఐఎస్‌-ఎస్ఓఈ స్కూల్స్‌లో ఎనిమిదో త‌ర‌గ‌తి ప్ర‌వేశాలు 

హైద‌రాబాద్ (మాస‌బ్‌ట్యాంక్‌)లోని తెలంగాణ ట్రైబ‌ల్ వెల్ఫేర్ రెసిడెన్షియ‌ల్ ఎడ్యుకేష‌నల్ ఇన్‌స్టిట్యూష‌న్స్ సొసైటీ (టీటీడ‌బ్ల్యూఆర్ఈఐఎస్‌) 2021-2022 విద్యాసంవ‌త్స‌రానికి ఖ‌మ్మం, ప‌రిగిలోని స్కూల్ ఆఫ్ ఎక్స్‌లెన్స్ (ఎస్ఓఈ)లో ఎనిమిదో త‌ర‌గ‌తి ప్ర‌వేశాల భ‌ర్తీకి అర్హులైన బాలురు, బాలిక‌ల నుంచి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.

వివ‌రాలు..

* స్కూల్ ఆఫ్ ఎక్స్‌లెన్స్ (ప్ర‌తిభా పాఠశాల‌లు)లో ఎనిమిదో త‌ర‌గ‌తి ప్ర‌వేశాలు

1) స్కూల్ ఆఫ్ ఎక్స్‌లెన్స్-ఖ‌మ్మం (బాలురు) 90 సీట్లు

2) స్కూల్ ఆఫ్ ఎక్స్‌లెన్స్‌-ప‌రిగి (బాలిక‌లు) 40 సీట్లు

మీడియం: ఇంగ్లిష్ మీడియం.

అర్హ‌త‌: ఏడో త‌ర‌గ‌తి పూర్తి చేసుకున్న బాలురు, బాలిక‌లు అర్హులు. త‌ల్లిదండ్రుల వార్షికాదాయం గ్రామీణ ప్రాంతాల్లో రూ.1,50,000 ప‌ట్ట‌ణ ప్రాంతాల్లో రూ. 2,00,000 మించ‌కూడ‌దు.

వ‌య‌సు: 01.08.2007 త‌ర్వాత జ‌న్మించి ఉండాలి.

ఎంపిక విధానం: స్క్రీనింగ్ టెస్ట్ ఆధారంగా ఎంపిక ప్ర‌క్రియ నిర్వ‌హిస్తారు. 

ప‌రీక్షా విధానం: ఈ ప‌రీక్ష‌ను ఆబ్జెక్టివ్ టైప్ విధానంలో 100 మార్కుల‌కు నిర్వ‌హిస్తారు. గ‌తేడాది సిల‌బ‌స్‌ను ఆధారంగా చేసుకొని ప్ర‌శ్న‌ల స‌ర‌ళి ఉంటుంది. దీనిలో ఇంగ్లిష్‌, మ్యాథ‌మేటిక్స్‌, సోష‌ల్, సైన్స్ ప్ర‌తి దానినుంచి 25 మార్కుల చొప్పున 100 మార్కులకు ఈ ప‌రీక్ష ఉంటుంది.

ద‌ర‌ఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా ద‌ర‌ఖాస్తు చేసుకోవాలి.

ద‌ర‌ఖాస్తు ఫీజు: రూ.100 చెల్లించాలి.

నోటిఫికేష‌న్ విడుద‌ల తేది: 10.06.2021.

ఆన్‌లైన్ ద‌ర‌ఖాస్తు ప్ర‌క్రియ ప్రారంభం: 11.06.2021.

ఆన్‌లైన్ ద‌ర‌ఖాస్తుల‌కు చివ‌రి తేది: 26.06.2021.

ప్ర‌వేశ ప‌రీక్ష తేది: వెల్ల‌డించాల్సి ఉంది.

Notification Information

Posted Date: 10-06-2021

 

నోటిఫికేష‌న్స్‌ :