• facebook
  • twitter
  • whatsapp
  • telegram

డీఆర్‌డీఓ-టీబీఆర్ఎల్‌లో ట్రేడ్ అప్రెంటిస్ 

భార‌త ప్ర‌భుత్వ ర‌క్ష‌ణ మంత్రిత్వ‌శాఖ‌కు చెందిన చండీగ‌ఢ్‌లోని డీఆర్‌డీఓ-టెర్మిన‌ల్ బాలిస్టిక్స్ రిసెర్చ్ ల్యాబొరేట‌రీ(టీబీఆర్ఎల్‌) కింది అప్రెంటిస్ ఖాళీల భ‌ర్తీకి ద‌రఖాస్తులు కోరుతోంది.

వివ‌రాలు..

* అప్రెంటిస్‌

* మొత్తం ఖాళీలు: 79

ట్రేడులు: ఫిట్ట‌ర్‌, మెషినిస్ట్‌, ట‌ర్న‌ర్‌, కార్పెంట‌ర్, ఎల‌క్ట్రీషియ‌న్‌, ఎల‌క్ట్రానిక్స్ మెకానిక్‌, మెకానిక్, వెల్డ‌ర్‌, డిజిట‌ల్ పోటోగ్రాఫ‌ర్ త‌దిత‌రాలు.

అర్హ‌త‌: సంబంధిత ట్రేడుల్లో ఐటీఐ ఉత్తీర్ణ‌త‌.

వ‌య‌సు: ద‌ర‌ఖాస్తు చివ‌రి తేది నాటికి 14 ఏళ్ల‌కు త‌గ్గ‌కుండా ఉండాలి.

ఎంపిక విధానం: అక‌డ‌మిక్ మెరిట్ ఆధారంగా ఎంపిక ప్ర‌క్రియ నిర్వ‌హిస్తారు. 

ద‌ర‌ఖాస్తు విధానం: ఈమెయిల్ ద్వారా ద‌ర‌ఖాస్తు చేసుకోవాలి.

ఈమెయిల్: admintbrl@tbrl.drdo.in

ద‌ర‌ఖాస్తుకు చివ‌రి తేది: 17.05.2021.
 

Notification Information

Posted Date: 16-04-2021