• facebook
  • twitter
  • whatsapp
  • telegram

హాల్‌లో ట్రేడ్ అప్రెంటిస్ ఖాళీలు 

హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ (హాల్‌)కి చెందిన ల‌ఖ్‌న‌వూలోని యాక్స‌స‌రీస్ విభాగం వివిధ ట్రేడుల్లో కింది అప్రెంటిస్ ఖాళీల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.

వివ‌రాలు..

* ట్రేడ్ అప్రెంటిస్‌

శిక్ష‌ణా వ్య‌వ‌ధి: ఏడాది.

ట్రేడులు:  ఫిట్ట‌ర్‌, ట‌ర్న‌ర్‌, మెషినిస్ట్‌, వెల్డ‌ర్‌, ఎల‌క్ట్రానిక్స్ మెకానిక్‌, ఎల‌క్ట్రీషియ‌న్‌, ఇనుస్ట్రుమెంట్ మెకానిక్‌, ఎల‌క్ట్రోప్లేట‌ర్‌, డ్రాఫ్ట్స్‌మెన్ మెకానిక్‌, షీట్ మెట‌ల్ వ‌ర్క‌ర్‌, కోపా/ పాసా.

అర్హ‌త‌: 2018, 2019, 2020లో సంబంధిత ట్రేడుల్లో ఐటీఐ ఉత్తీర్ణ‌త‌. 

వ‌య‌సు: 18.06.2021 నాటికి 27 ఏళ్లు మించ‌కూడ‌దు. ఎస్సీ/ ఎస్టీల‌కు ఐదేళ్లు, ఓబీసీల‌కు మూడేళ్లు, పీడ‌బ్ల్యూడీల‌కు ప‌దేళ్లు గ‌రిష్ఠ వ‌య‌సులో స‌డ‌లింపు ఉంటుంది.

ఎంపిక విధానం: అక‌డ‌మిక్ మెరిట్ (ప‌దో త‌ర‌గ‌తి, ఐటీఐ మార్కులు) ఆధారంగా ఎంపిక ప్ర‌క్రియ నిర్వ‌హిస్తారు. 

ద‌ర‌ఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా ద‌ర‌ఖాస్తు చేసుకోవాలి.

ఆన్‌లైన్ ద‌ర‌ఖాస్తు ప్ర‌క్రియ ప్రారంభం: 03.06.2021.

ఆన్‌లైన్ ద‌ర‌ఖాస్తుకు చివ‌రి తేది: 18.06.2021.
 

Notification Information

Posted Date: 01-06-2021

 

నోటిఫికేష‌న్స్‌ :