• facebook
  • twitter
  • whatsapp
  • telegram

స‌ద‌ర‌న్ రైల్వేలో 3378 ఖాళీలు  

చెన్నై ప్ర‌ధాన‌కేంద్రంగా ఉన్న స‌ద‌ర‌న్ రైల్వే, పెరంబూర్‌లోని క్యారేజ్ & వేగ‌న్ వ‌ర్క్స్‌కి చెందిన చీఫ్ వ‌ర్క్‌షాప్ మేనేజ‌ర్ కార్యాల‌యం వివిధ ట్రేడుల్లో కింది అప్రెంటిస్ ఖాళీల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.

వివ‌రాలు..

* అప్రెంటిస్‌

* మొత్తం ఖాళీలు: 3378

ప‌ని చేసే ప్ర‌దేశాలు: క్యారేజ్ & వేగ‌న్ వ‌ర్క్స్‌, రైల్వే హాస్పిట‌ల్‌, ఎల‌క్ట్రిక‌ల్ వ‌ర్క్‌షాప్‌, లోకో వ‌ర్క్స్‌, ఇంజినీరింగ్ వ‌ర్క్‌షాప్‌, చెన్నై డివిజ‌న్‌.

విభాగాలు: ఫ్రెష‌ర్ కేట‌గిరి, ఎక్స్ ఐటీఐ, ఎంఎల్‌టీ. 

ట్రేడులు: ఫిట్ట‌ర్‌, వెల్డ‌ర్‌, కార్పెంట‌ర్‌, పెయింట‌ర్‌, మెషినిస్ట్‌, ఎల‌క్ట్రీషియ‌న్‌, డీజిల్ మెకానిక్‌, ఎల‌క్ట్రానిక్ మెకానిక్‌, పాసా త‌దిత‌రాలు.

అర్హ‌త‌: ప‌దో త‌ర‌గ‌తితో పాటు సంబంధిత ట్రేడుల్లో ఐటీఐ, ఇంట‌ర్మీడియ‌ట్ (ఫిజిక్స్‌, కెమిస్ట్రీ, మ్యాథ‌మేటిక్స్‌, బ‌యాల‌జీ) ఉత్తీర్ణ‌త‌.

వ‌య‌సు: 15 ఏళ్లు నిండి ఉండాలి, 22/ 24 ఏళ్లు మించ‌కుండా ఉండాలి. ఓబీసీల‌కు మూడేళ్లు, ఎస్సీ/ ఎస్టీల‌కే ఐదేళ్లు, పీడ‌బ్ల్యూడీ అభ్య‌ర్థుల‌కు ప‌దేళ్లు గ‌రిష్ఠ వ‌య‌సులో స‌డ‌లింపు ఉంటుంది.

ఎంపిక విధానం: అక‌డ‌మిక్ మెరిట్ ఆధారంగా ఎంపిక ప్ర‌క్రియ నిర్వ‌హిస్తారు. ప‌దో త‌ర‌గ‌తి, ఐటీఐ, ఇంట‌ర్మీడియ‌ట్ మార్కుల ప్రాతిప‌దిక‌న తుది ఎంపిక ఉంటుంది.

ద‌ర‌ఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా ద‌ర‌ఖాస్తు చేసుకోవాలి.

ఆన్‌లైన్ ద‌ర‌ఖాస్తు ప్ర‌క్రియ ప్రారంభం: 01.06.2021.

ఆన్‌లైన్ ద‌ర‌ఖాస్తుకు చివ‌రి తేది: 30.06.2021.

Notification Information

Posted Date: 01-06-2021

 

నోటిఫికేష‌న్స్‌ :