• facebook
  • twitter
  • whatsapp
  • telegram

ఐఐటీ, జోధ్‌పూర్‌లో నాన్ టీచింగ్ పోస్టులు

భార‌త ప్ర‌భుత్వ విద్యామంత్రిత్వ‌శాఖ‌కు చెందిన జోధ్‌పూర్‌(రాజ‌స్థాన్‌) లోని ఇండియ‌న్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ(ఐఐటీ) కింది నాన్ టీచింగ్ పోస్టుల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.

వివ‌రాలు..

* మొత్తం ఖాళీలు: 50

1) సీనియర్ లైబ్ర‌రీ ఇన్ఫ‌ర్మేష‌న్ అసిస్టెంట్: 01

అర్హ‌త‌: లైబ్ర‌రీ సైన్స్‌లో పోస్టు గ్రాడ్యుయేట్ డిగ్రీ ఉత్తీర్ణ‌త‌. కంప్యూట‌రైడ్జ్ లైబ్ర‌రీ విధానంలో రెండేళ్ల అనుభ‌వం ఉండాలి.

వ‌య‌సు: 32 ఏళ్లు మించ‌కూడ‌దు.

జీత‌భ‌త్యాలు: నెల‌కు రూ.35400 చెల్లిస్తారు. 

‌2) జూనియ‌ర్ అసిస్టెంట్ (అడ్మినిస్ట్రేష‌న్‌): 15‌

అర్హ‌త‌: ఏదైనా విభాగంలో బ్యాచిల‌ర్స్ డిగ్రీ ఉత్తీర్ణ‌త‌. ఆఫీస్ అడ్మినిస్ట్రేష‌న్ విభాగంలో క‌నీసం రెండేళ్ల అనుభ‌వం ఉండాలి.

వ‌య‌సు: 27 ఏళ్లు మించ‌కుండా ఉండాలి.

జీత‌భ‌త్యాలు: నెల‌కు రూ.21700 చెల్లిస్తారు. 

3) జూనియ‌ర్ టెక్నిక‌ల్ అసిస్టెంట్: 34

విభాగాలు: మెకానిక‌ల్ ఇంజినీరింగ్, ఎల‌క్ట్రిక‌ల్‌, బ‌యోఇంజినీరింగ్, కెమిస్ట్రీ, కెమిక‌ల్ ఇంజినీరింగ్, సివిల్ ఇంజినీరింగ్‌, ఫిజిక్స్ త‌దిత‌రాలు.

అర్హ‌త: సంబంధిత స‌బ్జెక్టుల్లో ఎంఈ/ ఎంటెక్‌/ ఎమ్మెస్సీ ఉత్తీర్ణ‌త‌. సంబంధిత ప‌నిలో రెండేళ్ల అనుభ‌వం ఉండాలి.

ఎంపిక విధానం: రాత ప‌రీక్ష‌, ట్రేడ్ టెస్ట్‌, ఇంట‌ర్వ్యూ ఆధారంగా ఎంపిక ప్ర‌క్రియ నిర్వ‌హిస్తారు. 

ద‌ర‌ఖాస్తు విధానం: ఆన్‌లైన్/ ఆఫ్‌లైన్ ద్వారా ద‌రఖాస్తు చేసుకోవాలి.

ఆన్‌లైన్ ద‌ర‌ఖాస్తుకు చివ‌రి తేది: 11.05.2021.

ద‌ర‌ఖాస్తు హార్డ్‌కాపీల‌ను పంప‌డానికి చివ‌రి తేది: 20.05.2021.

చిరునామా: Assistant Registrar, Office of Establishment-II, Indian Institute of Technology Jodhpur, NH-62, Nagaur Road, Karwar, Jodhpur-342 037.

Notification Information

Posted Date: 15-04-2021

 

నోటిఫికేష‌న్స్‌ :