• facebook
  • twitter
  • whatsapp
  • telegram

టీఎస్ ఈసెట్ - 2021

తెలంగాణ ప్ర‌భుత్వానికి చెందిన తెలంగాణ రాష్ట్ర ఉన్న‌త విద్యా మండ‌లి (టీఎస్‌సీహెచ్ఈ) టీఎస్ ఈసెట్-2021 నోటిఫికేష‌న్ విడుద‌ల చేసింది. దీని ద్వారా డిప్లొమా, బీఎస్సీ(మ్యాథ‌మేటిక్స్‌) అభ్య‌ర్థుల‌కు 2021-2022 విద్యాసంవ‌త్స‌రానికి బీఈ/ బీటెక్‌/ బీఫార్మ‌సీ కోర్సుల్లో లేట‌ర‌ల్ ఎంట్రీ క‌ల్పిస్తారు. దీన్ని హైద‌రాబాద్‌లోని జ‌వ‌హ‌ర్‌లాల్ నెహ్రూ టెక్న‌లాజిక‌ల్ యూనివ‌ర్సిటీ(జేఎన్‌టీయూ) నిర్వ‌హిస్తోంది.

వివ‌రాలు..

* తెలంగాణ స్టేట్ ఇంజినీరింగ్ కామ‌న్ ఎంట్ర‌న్స్ టెస్ట్ (టీఎస్ ఈసెట్‌) 2021

ఎంపిక విధానం: క‌ంప్యూట‌ర్ బేస్డ్ ఉమ్మ‌డి ప్ర‌వేశ ప‌రీక్ష(కంప్యూట‌ర్ బేస్డ్ టెస్ట్‌) ఆధారంగా ఎంపిక ప్ర‌క్రియ ఉంటుంది.

ద‌ర‌ఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా ద‌ర‌ఖాస్తు చేసుకోవాలి.

ద‌ర‌ఖాస్తు ఫీజు: ఎస్సీ/ ఎస్టీలు రూ.400, ఇత‌రులు రూ.800 చెల్లించాలి.

ముఖ్య‌మైన తేదీలు: 

* నోటిఫికేష‌న్ వెలువ‌డే తేదీ: 17.03.2021.

* ఆన్‌లైన్ ద‌ర‌ఖాస్తు ప్ర‌క్రియ ప్రారంభం: 22.03.2021.

* ఆన్‌లైన్ ద‌ర‌ఖాస్తుకు చివ‌రి తేది: 17.05.2021.

* రూ.500 ఆల‌స్య రుసుంతో చివ‌రి తేది: 14.06.2021.

* రూ.2500 ఆల‌స్య రుసుంతో చివ‌రి తేది: 24.06.2021.

* రూ.5000 ఆల‌స్య రుసుంతో చివ‌రి తేది: 28.06.2021.

* ప‌రీక్ష తేది: 01.07.2021 (ఉద‌యం, మ‌ధ్యాహ్నం రెండు సెష‌న్లు ఉంటుంది.)

* ఈ ప‌రీక్ష (టీఎస్ ఈసెట్-2021) మొత్తం 18 రీజిన‌ల్ సెంట‌ర్ల‌లో నిర్వ‌హిస్తారు. ఇందులో తెలంగాణ‌లో 14, ఏపీలో 4 సెంట‌ర్లు ఉన్నాయి.

Notification Information

Posted Date: 09-03-2021

 

నోటిఫికేష‌న్స్‌ :