• facebook
  • twitter
  • whatsapp
  • telegram

ఎయిమ్స్‌, జోధ్‌పూర్‌లో ఫ్యాక‌ల్టీ పోస్టులు 

భార‌త ప్ర‌భుత్వ ఆరోగ్య‌, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ‌శాఖ‌కు చెందిన జోధ్‌పూర్‌(రాజ‌స్థాన్‌)లోని ఆల్ ఇండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడిక‌ల్ సైన్సెస్‌(ఎయిమ్స్‌) కింది పోస్టుల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.

వివ‌రాలు..

* మొత్తం ఖాళీలు: 86

పోస్టులు-ఖాళీలు: ప్రొఫెస‌ర్‌-32, అడిష‌న‌ల్‌ ప్రొఫెస‌ర్‌-10, అసోసియేట్ ప్రొఫెస‌ర్-30, అసిస్టెంట్ ప్రొఫెసర్-14.

విభాగాలు: అనెస్తీషియాల‌జీ అండ్ క్రిటిక‌ల్ కేర్‌, అనాట‌మీ, కార్డియాల‌జీ, డెర్మ‌టాల‌జీ, ఫోరెన్సిక్ మెడిసిన్ & టాక్సికాల‌జీ, న్యూరాల‌జీ త‌దిత‌రాలు.

అర్హ‌త‌: సంబంధిత స్పెష‌లైజేష‌న్ల‌లో పోస్టు గ్రాడ్యుయేట్ మెడిక‌ల్ డిగ్రీ (ఎండీ/ ఎంఎస్) ఉత్తీర్ణ‌త‌. సంబంధిత ప‌నిలో అనుభ‌వం ఉండాలి.

ఎంపిక విధానం: షార్ట్‌లిస్టింగ్‌, ఇంట‌ర్వ్యూ ఆధారంగా ఎంపిక ప్ర‌క్రియ నిర్వ‌హిస్తారు. 

ద‌ర‌ఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా ద‌ర‌ఖాస్తు చేసుకోవాలి.

ఆన్‌లైన్ ద‌ర‌ఖాస్తుకు చివ‌రి తేది: 17.05.2021.

Notification Information

Posted Date: 19-04-2021

 

నోటిఫికేష‌న్స్‌ :