• facebook
  • twitter
  • whatsapp
  • telegram

సీఎస్ఐఆర్‌-సీఐఎంఎఫ్ఆర్‌లో ప్రాజెక్ట్ స్టాఫ్ 

ఝార్ఖండ్‌లోని సీఎస్ఐఆర్‌-సెంట్ర‌ల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మైనింగ్ అండ్ ఫ్యూయల్ రిసెర్చ్ (సీఐఎంఎఫ్ఆర్‌) తాత్కాలిక ప్రాతిప‌దిక‌న కింది పోస్టుల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.

వివ‌రాలు..

* మొత్తం ఖాళీలు: 07

1) ప్రాజెక్ట్ అసిస్టెంట్‌: 03

అర్హ‌త‌: 70% మార్కుల‌తో బీఎస్సీ/ ఆన‌ర్స్ ఇన్ జియాల‌జీ/ మైనింగ్ ఇంజినీరింగ్‌లో డిప్లొమా ఉత్తీర్ణ‌త‌. సంబంధిత ప‌నిలో నాలెడ్జ్ ఉండాలి.

వ‌య‌సు: 50 ఏళ్లు మించ‌కుండా ఉండాలి.

స్టైపెండ్‌: నెల‌కి రూ.20000 చెల్లిస్తారు. 

2) ప్రాజెక్ట్ అసోసియేట్: 04

అర్హ‌త‌: సంబంధిత స‌బ్జెక్టుల్లో బీఈ/ బీటెక్‌, పోస్టు గ్రాడ్యుయేట్ మాస్ట‌ర్స్ డిగ్రీ ఇన్ జియాలజీ/ అప్లైడ్ జియాల‌జీ ఉత్తీర్ణ‌త‌. సంబంధిత ప‌నిలో ఏడాది అనుభ‌వం ఉండాలి.

వ‌య‌సు: 35 ఏళ్లకు మించ‌కుండా ఉండాలి.

స్టైపెండ్‌: గేట్‌/ సీఎస్ఐఆర్‌-యూజీసీ నెట్ అభ్య‌ర్థుల‌కు నెల‌కి రూ.31000, నాన్ గేట్ అభ్య‌ర్థుల‌కి రూ.25000 చెల్లిస్తారు.

ఎంపిక విధానం: ఇంట‌ర్వ్యూ ఆధారంగా ఎంపిక ప్ర‌క్రియ నిర్వ‌హిస్తారు. 

ద‌ర‌ఖాస్తు విధానం: ఆఫ్‌లైన్ ద్వారా ద‌ర‌ఖాస్తు చేసుకోవాలి.

ద‌ర‌ఖాస్తుకు చివ‌రి తేది: 03.07.2021.

చిరునామా: Administrative Officer, CSIR-CIMFR, Barwa Road, Dhanbad,Jharkhand- 826001.
 

Notification Information

Posted Date: 11-06-2021

 

నోటిఫికేష‌న్స్‌ :