• facebook
  • twitter
  • whatsapp
  • telegram

డీఎస్ఎస్ఎస్‌బీలో 5807 టీజీటీ పోస్టులు 

నేష‌న‌ల్ క్యాపిట‌ల్ టెరిట‌రీ ఆఫ్ దిల్లీ(ఎన్‌సీటీ దిల్లీ) ప్ర‌భుత్వానికి చెందిన దిల్లీ స‌బార్డినేట్ స‌ర్వీసెస్ సెల‌క్ష‌న్ బోర్డ్ (డీఎస్ఎస్ఎస్‌బీ) అర్హులైన స్త్రీ, పురుష అభ్య‌ర్థుల నుంచి కింది పోస్టుల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.

వివ‌రాలు..

ట్రెయిన్డ్ గ్రాడ్యుయేట్ టీచ‌ర్ (టీజీటీ)

* మొత్తం ఖాళీలు: 5807

స‌బ్జెక్టులు: బెంగాలీ, ఇంగ్లిష్‌, ఉర్దూ, సంస్కృతం, పంజాబీ.

అర్హ‌త‌: మోడ్ర‌న్ ఇండియ‌న్ లాంగ్వేజెస్ (ఎంఐఎల్‌)లో ఏదో ఒక స‌బ్జెక్టులో బీఏ(ఆన‌ర్స్), సంబంధిత స‌బ్జెక్టుల్లో బ్యాచిల‌ర్స్ డిగ్రీ ఉత్తీర్ణ‌త‌. టీచింగ్‌లో డిగ్రీ/ డిప్లొమా ఉత్తీర్ణులై ఉండాలి. హిందీలో మంచి నాలెడ్జ్ ఉండాలి. సీబీఎస్ఈ నుంచి సీటెట్‌లో అర్హ‌త.

వ‌య‌సు: 32 ఏళ్లు మించ‌కూడ‌దు. ఎస్సీ/ ఎస్టీల‌కు ఐదేళ్లు, ఓబీసీల‌కు మూడేళ్లు, పీడ‌బ్ల్యూడీల‌కు ప‌దేళ్లు గ‌రిష్ఠ వ‌య‌సులో స‌డ‌లింపు ఉంటుంది.

ఎంపిక విధానం: వ‌న్ టైర్‌/ టూ టైర్ రాత ప‌రీక్ష ద్వారా ఎంపిక ప్ర‌క్రియ నిర్వ‌హిస్తారు.

ద‌ర‌ఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా ద‌ర‌ఖాస్తు చేసుకోవాలి.

ఆన్‌లైన్ ద‌ర‌ఖాస్తు ప్ర‌క్రియ ప్రారంభం: 04.06.2021.

ఆన్‌లైన్ ద‌ర‌ఖాస్తుకు చివ‌రి తేది: 03.07.2021.
 

Notification Information

Posted Date: 28-05-2021

 

నోటిఫికేష‌న్స్‌ :