• facebook
  • twitter
  • whatsapp
  • telegram

ఐఐఐటీడీఎం, క‌ర్నూలులో ఫ్యాక‌ల్టీ పోస్టులు

భార‌త ప్ర‌భుత్వ విద్యామంత్రిత్వ‌శాఖ‌కు చెందిన క‌ర్నూలు(ఏపీ)లోని ఇండియ‌న్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫ‌ర్మేష‌న్ టెక్నాల‌జీ డిజైన్ అండ్ మాన్యూఫ్యాక్చ‌రింగ్ (ఐఐఐటీడీఎం) కింది టీచింగ్ పోస్టుల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.

వివ‌రాలు..

* మొత్తం ఖాళీలు: 10

పోస్టులు: ప్రొఫెస‌ర్‌, అసోసియేట్ ప్రొఫెస‌ర్, అసిస్టెంట్ ప్రొఫెస‌ర్‌.

విభాగాలు: కంప్యూట‌ర్ సైన్స్ అండ్ ఇంజినీరింగ్-05‌, ఎల‌క్ట్రానిక్స్ అండ్ క‌మ్యూనికేష‌న్ ఇంజినీరింగ్‌-01, మెకానిక‌ల్ ఇంజినీరింగ్-02, సైన్సెస్‌-02.

అర్హ‌త‌: సంబంధిత స‌బ్జెక్టుల్లో పీహెచ్‌డీ ఉత్తీర్ణ‌త‌. సంబంధిత ప‌నిలో అనుభ‌వం ఉండాలి.ఎంపిక విధానం: దీన్ని రెండు విధాలుగా నిర్వ‌హిస్తారు. అవి 1) సెమినార్ 2) ఇంట‌ర్వ్యూ ఆధారంగా. కొన్ని విభాగాలు స్క్రీనింగ్ టెస్ట్ కూడా నిర్వ‌హించే అవ‌కాశం ఉంది. మొద‌ట‌గా షార్ట్‌లిస్ట్ అయిన అభ్య‌ర్థుల్ని సెమినార్‌కి పిలుస్తారు.

సెమినార్‌లో ప్ర‌తిభ ఆధారంగా ఎంపికైన వారిని ఇంట‌ర్వ్యూకి పిలుస్తారు.

ద‌ర‌ఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా ద‌ర‌ఖాస్తు చేసుకోవాలి.

ద‌ర‌ఖాస్తు ఫీజు: రూ.500 చెల్లించాలి.

ఆన్‌లైన్ ద‌ర‌ఖాస్తుకు చివ‌రి తేది: 15.05.2021.

Notification Information

Posted Date: 14-04-2021

 

నోటిఫికేష‌న్స్‌ :