• facebook
  • twitter
  • whatsapp
  • telegram

ఐజీసీఏఆర్‌లో 337 పోస్టులు

భార‌త ప్ర‌భుత్వ అణు శ‌క్తి విభాగానికి చెందిన క‌ల్ప‌క్కం(త‌మిళ‌నాడు)లోని ఇందిరా గాంధీ సెంట‌ర్ ఫ‌ర్ అటామిక్ రిసెర్చ్ (ఐజీసీఏఆర్‌) కింది పోస్టుల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.

వివ‌రాలు..

* మొత్తం ఖాళీలు: 337

1) డైరెక్ట్ రిక్రూట్‌మెంట్‌: 98

పోస్టులు: సైంటిఫిక్ ఆఫీస‌ర్‌, టెక్నిక‌ల్ ఆఫీస‌ర్‌, టెక్నీషియ‌న్‌, స్టెనోగ్రాఫ‌ర్‌, అప్ప‌ర్ డివిజ‌న్ క్ల‌ర్క్‌, సెక్యూరిటీ గార్డ్‌, వ‌ర్క్ అసిస్టెంట్ త‌దిత‌రాలు.

అర్హ‌త‌: పోస్టును అనుస‌రించి ప‌దో త‌ర‌గ‌తి, ఇంట‌ర్మీడియ‌ట్‌, డిగ్రీ, సంబంధిత స‌బ్జెక్టుల్లో బీఎస్సీ, బీఈ/  బీటెక్‌, ఎమ్మెస్సీ/ ఎంటెక్‌, పీహెచ్‌డీ ఉత్తీర్ణ‌త‌. సంబంధిత ప‌నిలో అనుభ‌వం ఉండాలి.

ఎంపిక విధానం: పోస్టుల్ని అనుస‌రించి  రాత ప‌రీక్ష‌/ ప‌ర్స‌న‌ల్ ఇంట‌ర్వ్యూ, స్కిల్ టెస్ట్ (స్టెనోగ్ర‌ఫీ, ఫిజిక‌ల్ టెస్ట్‌, డ్రైవింగ్‌), అడ్వాన్స్ టెస్ట్ ఆధారంగా ఎంపిక ప్ర‌క్రియ నిర్వ‌హిస్తారు.  ‌

2) స్టైపెండ‌రీ ట్రెయినీ: 239

* స్టైపెండ‌రీ ట్రెయినీ కేట‌గిరీ-1: 68

విభాగాలు: కెమిక‌ల్‌, సివిల్‌, ఎల‌క్ట్రిక‌ల్‌, ఎల‌క్ట్రానిక్స్‌/ ఇనుస్ట్రుమెంటేష‌న్‌, కెమిస్ట్రీ, ఫిజిక్స్‌.

అర్హ‌త‌: సంబంధిత స‌బ్జెక్టుల్లో ఇంజినీరింగ్ డిప్లొమా, బీఎస్సీ ఉత్తీర్ణ‌త‌.

ఎంపిక విధానం: రాత ప‌రీక్ష‌, ప‌ర్స‌న‌ల్ ఇంట‌ర్వ్యూ ఆధారంగా ఎంపిక ప్ర‌క్రియ నిర్వ‌హిస్తారు. 

* స్టైపెండ‌రీ ట్రెయినీ కేట‌గిరీ-2: 171

ట్రేడులు: డ్రాఫ్ట్స్‌మెన్ (మెకానిక‌ల్‌), ఫిట్ట‌ర్‌/ రిగ్గ‌ర్‌, ప్లంబ‌ర్‌, వెల్డ‌ర్‌, ల్యాబ్ అసిస్టెంట్ త‌దిత‌రాలు.

అర్హ‌త‌: క‌నీసం 60% మార్కుల‌తో ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథ‌మేటిక్స్ స‌బ్జెక్టుల‌తో ఇంట‌ర్మీడియ‌ట్‌తో పాటు సంబంధిత ట్రేడుల్లో ఐటీఐ ఉత్తీర్ణ‌త‌. 

ఎంపిక విధానం: ప్రిలిమిన‌రీ టెస్ట్‌, అడ్వాన్స్‌డ్ టెస్ట్, ట్రేడ్‌/ స్కిల్ టెస్ట్ ఆధారంగా ఎంపిక ప్ర‌క్రియ ఉంటుంది.

ద‌ర‌ఖాస్తు విధానం: ఆన్‌లైన్/ ఆఫ్‌లైన్‌ ద్వారా ద‌ర‌ఖాస్తు చేసుకోవ‌చ్చు.

* ఆన్‌లైన్ ద‌ర‌ఖాస్తు ప్ర‌క్రియ ప్రారంభం: 15.04.2021.

* ఆన్‌లైన్ ద‌ర‌ఖాస్తుకు చివ‌రి తేది: 14.05.2021.

* ద‌ర‌ఖాస్తు హార్డ్‌కాపీల‌ను పంప‌డానికి చివ‌రి తేది: 20.05.2021.

చిరునామా: అసిస్టెంట్ ప‌ర్స‌న‌ల్ ఆఫీస‌ర్‌, ఐజీసీఏఆర్‌, క‌ల్ప‌క్కం-603102.

Notification Information

Posted Date: 15-04-2021

 

నోటిఫికేష‌న్స్‌ :