• facebook
  • twitter
  • whatsapp
  • telegram

ఐఎండీలో 54 సైంటిస్టు ఖాళీలు 

భార‌త ప్ర‌భుత్వ ఎర్త్ సైన్సెస్ మంత్రిత్వ‌శాఖ‌కు చెందిన న్యూదిల్లీలోని ఇండియా మెటీయోరాలాజిక‌ల్ డిపార్ట్‌మెంట్ (ఐఎండీ) కింది పోస్టుల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.

వివ‌రాలు..

* మొత్తం ఖాళీలు: 54

1) సైంటిస్ట్‌-ఈ: 08 పోస్టులు

విభాగాలు: ఫోర్‌కాస్టింగ్‌, ఇనుస్ట్రుమెంటేష‌న్‌, కంప్యూట‌ర్‌/ ఇన్ఫ‌ర్మేష‌న్ టెక్నాల‌జీ.

అర్హ‌త‌: క‌నీసం 60% మార్కుల‌తో సంబంధిత స‌బ్జెక్టుల్లో బీఈ/ బీటెక్‌/ మాస్ట‌ర్స్ డిగ్రీ ఉత్తీర్ణ‌త‌. సంబంధిత ప‌నిలో అనుభ‌వం ఉండాలి.

వ‌య‌సు: ద‌ర‌ఖాస్తు తేదీ ముగిసే నాటికి 50 ఏళ్లు మించ‌కూడ‌దు. 

2) సైంటిస్ట్‌-డి: 29 పోస్టులు

విభాగాలు: ఫోర్‌కాస్టింగ్‌, ఇనుస్ట్రుమెంటేష‌న్‌, కంప్యూట‌ర్‌/ ఇన్ఫ‌ర్మేష‌న్ టెక్నాల‌జీ, అగ్రిక‌ల్చ‌ర్ మెటీయోరాల‌జి.

అర్హ‌త‌: క‌నీసం 60% మార్కుల‌తో సంబంధిత స‌బ్జెక్టుల్లో బీఈ/ బీటెక్‌/ మాస్ట‌ర్స్ డిగ్రీ ఉత్తీర్ణ‌త‌. సంబంధిత ప‌నిలో అనుభ‌వం ఉండాలి.

వ‌య‌సు: ద‌ర‌ఖాస్తు తేదీ ముగిసే నాటికి 50 ఏళ్లు మించ‌కూడ‌దు.  

3) సైంటిస్ట్‌-సి: 17 పోస్టులు

విభాగాలు: ఫోర్‌కాస్టింగ్‌, ఇనుస్ట్రుమెంటేష‌న్.

అర్హ‌త‌: క‌నీసం 60% మార్కుల‌తో సంబంధిత స‌బ్జెక్టుల్లో బీఈ/ బీటెక్‌/ మాస్ట‌ర్స్ డిగ్రీ ఉత్తీర్ణ‌త‌. సంబంధిత ప‌నిలో అనుభ‌వం ఉండాలి.

వ‌య‌సు: ద‌ర‌ఖాస్తు తేదీ ముగిసే నాటికి 40 ఏళ్లు మించ‌కూడ‌దు.  

ఎంపిక విధానం: షార్ట్‌లిస్టింగ్‌, ఇంట‌ర్వ్యూ ఆధారంగా ఎంపిక ప్ర‌క్రియ ఉంటుంది.

ద‌ర‌ఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా ద‌ర‌ఖాస్తు చేసుకోవాలి.

ద‌ర‌ఖాస్తుకు చివ‌రి తేది: ఎంప్లాయిమెంట్ న్యూస్‌లో ఈ ప్ర‌క‌ట‌న వెలువ‌డిన తేదీ నుంచి 42రోజుల్లోపు ద‌ర‌ఖాస్తు చేసుకోవాలి.
 
Notification Information

Posted Date: 22-01-2021

నోటిఫికేష‌న్స్‌ :