• facebook
  • twitter
  • whatsapp
  • telegram

ఎన్‌బీసీసీలో 120 సైట్ ఇన్‌స్పెక్ట‌ర్లు

నేష‌న‌ల్ బిల్డింగ్స్ క‌న్‌స్ట్ర‌క్షన్ కార్పొరేష‌న్(ఎన్‌బీసీసీ) ఒప్పంద ప్రాతిప‌దిక‌న కింది పోస్టుల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.

వివ‌రాలు..

* సైట్ ఇన్‌స్పెక్ట‌ర్లు

* మొత్తం ఖాళీలు: 120

1) సైట్ ఇన్‌స్పెక్ట‌ర్ (సివిల్): 80

అర్హ‌త‌: 60% మార్కుల‌తో సివిల్ ఇంజినీరింగ్ స‌బ్జెక్టులో మూడేళ్ల ఫుల్ టైం డిప్లొమా ఉత్తీర్ణ‌త‌. సంబంధిత ప‌నిలో క‌నీసం నాలుగేళ్ల అనుభ‌వం ఉండాలి. కంప్యూట‌ర్ నాలెడ్జ్ ఉండాలి.

వ‌య‌సు: 35 ఏళ్లు మించకూడ‌దు.

జీత‌భ‌త్యాలు: నెల‌కు రూ.31000 చెల్లిస్తారు.

2) సైట్ ఇన్‌స్పెక్ట‌ర్ (ఎల‌క్ట్రిక‌ల్‌): 40

అర్హ‌త‌: 60% మార్కుల‌తో ఎల‌క్ట్రిక‌ల్ ఇంజినీరింగ్ స‌బ్జెక్టులో మూడేళ్ల ఫుల్ టైం డిప్లొమా ఉత్తీర్ణ‌త‌. సంబంధిత ప‌నిలో క‌నీసం నాలుగేళ్ల అనుభ‌వం ఉండాలి. కంప్యూట‌ర్ నాలెడ్జ్ ఉండాలి.

వ‌య‌సు: 35 ఏళ్లు మించకూడ‌దు.

జీత‌భ‌త్యాలు: నెల‌కు రూ.31000 చెల్లిస్తారు.

ఎంపిక విధానం: కంప్యూట‌ర్ బేస్డ్ టెస్ట్ ఆధారంగా ఎంపిక చేస్తారు. సీబీటీలో వ‌చ్చిన మెరిట్ మార్కుల ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది. 

తెలుగు రాష్ట్రాల్లో ప‌రీక్షా కేంద్రాలు: హైద‌రాబాద్‌, విశాఖ‌ప‌ట్నం.

ద‌ర‌ఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా ద‌ర‌ఖాస్తు చేసుకోవాలి. 

ద‌ర‌ఖాస్తు ఫీజు: ఇత‌రులు రూ.500 చెల్లించాలి. ఎస్సీ/ ఎస్టీ/ పీడ‌బ్ల్యూడీ, డిపార్ట్‌మెంట‌ల్ అభ్య‌ర్థుల‌కు ఫీజు లేదు.‌

ద‌ర‌ఖాస్తు ప్ర‌క్రియ ప్రారంభం: 25.03.2021.

ద‌ర‌ఖాస్తుకు చివ‌రి తేది: 14.04.2021.

ప‌రీక్ష తేది: వెల్ల‌డించాల్సి ఉంది.

Notification Information

Posted Date: 25-03-2021

 

నోటిఫికేష‌న్స్‌ :