• facebook
  • twitter
  • whatsapp
  • telegram

నైస‌ర్, భువ‌నేశ్వ‌ర్‌లో సైంటిస్ట్ పోస్టులు 

భార‌త ప్ర‌భుత్వ అణు శ‌క్తి విభాగానికి చెందిన భువ‌నేశ్వ‌ర్‌లోని నేష‌న‌ల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఎడ్యుకేష‌న్ అండ్ రిసెర్చ్ (నైస‌ర్‌) కింది పోస్టుల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.

వివ‌రాలు..

* సైంటిఫిక్ అసిస్టెంట్-బి

విభాగాలు: మెకానిక‌ల్‌, ఎల‌క్ట్రానిక్స్ అండ్ ఇనుస్ట్రుమెంటేష‌న్‌.

పోస్టులు: 02

అర్హ‌త‌: క‌నీసం 60% మార్కుల‌తో సంబంధిత స‌బ్జెక్టుల్లో ఇంజినీరింగ్ డిప్లొమా ఉత్తీర్ణ‌త‌.

వ‌య‌సు: క‌నీస వ‌య‌సు 18 ఏళ్లు నిండి, గ‌రిష్ఠ వ‌య‌సు పోస్టుల్ని అనుస‌రించి 33 ఏళ్లు, 30 ఏళ్లు మించ‌కూడ‌దు.

ఎంపిక విధానం: రాత ప‌రీక్ష, ప‌ర్స‌న‌ల్ ఇంట‌ర్వ్యూ, ట్రేడ్ టెస్ట్ ఆధారంగా ఎంపిక ప్ర‌క్రియ నిర్వ‌హిస్తారు. 

ద‌ర‌ఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా ద‌ర‌ఖాస్తు చేసుకోవాలి.

ఆన్‌లైన్ ద‌ర‌ఖాస్తుకు చివ‌రి తేది: 10.08.2021.

Notification Information

Posted Date: 11-06-2021

 

నోటిఫికేష‌న్స్‌ :