• facebook
  • twitter
  • whatsapp
  • telegram

ఎన్ఎండీసీలో 211 పోస్టులు

భార‌త ప్ర‌భుత్వ ఉక్కు మంత్రిత్వ‌శాఖ‌కు చెందిన హైద‌రాబాద్‌లోని నేష‌న‌ల్ మిన‌ర‌ల్ డెవ‌ల‌ప్‌మెంట్ కార్పొరేష‌న్ (ఎన్ఎండీసీ) వివిధ విభాగాల్లో ఎగ్జిక్యూటివ్‌, నాన్ ఎగ్జిక్యూటివ్ పోస్టుల భ‌ర్తీకి ద‌రఖాస్తులు కోరుతోంది.

వివ‌రాలు..

* మొత్తం ఖాళీలు: 211

1) ఎగ్జిక్యూటివ్ పోస్టులు: 97

విభాగాలు: ఎన‌ర్జీ మేనేజ్‌మెంట్, సేప్టీ, మెటీరియ‌ల్స్ మేనేజ్‌మెంట్, కాంట్రాక్ట్స్ మేనేజ్‌మెంట్‌, సెంట్ర‌లైజ్డ్ మెయింటెనెన్స్ మెకానిక‌ల్‌, కంప్రెస్డ్ ఎయిర్ స్టేష‌న్, క్రేన్ ఇంజినీరింగ్.

అర్హ‌త‌: ఏదైనా బ్రాంచుల్లో బీఈ/ బీటెక్ ఉత్తీర్ణ‌త‌. సంబంధిత ప‌నిలో అనుభ‌వం ఉండాలి.

2) సూప‌ర్‌వైజ‌రీ అండ్ నాన్ ఎగ్జిక్యూటివ్ పోస్టులు: 114

విభాగాలు: ఎన‌ర్జీ మేనేజ్‌మెంట్, హాట్ స్ట్రిప్ మిల్‌, సెంట్ర‌ల్‌ మెయింటెనెన్స్ మెకానిక‌ల్‌, కంప్రెస్డ్ ఎయిర్ స్టేష‌న్, క్రేన్ ఇంజినీరింగ్.

అర్హ‌త‌: పోస్టును అనుస‌రించి ప‌దోత‌ర‌గ‌తి, సంబంధిత ట్రేడుల్లో/ స‌బ్జెక్టుల్లో ఐటీఐ, ఇంజినీరింగ్ డిప్లొమా ఉత్తీర్ణ‌త‌, సంబంధిత ప‌నిలో అనుభ‌వం ఉండాలి.

ఎంపిక విధానం: ఎగ్జిక్యూటివ్ పోస్టుల‌కు ఇంట‌ర్వ్యూ, నాన్ ఎగ్జిక్యూటివ్ పోస్టుల‌కు రాత ప‌రీక్ష‌, సూప‌ర్‌వైజ‌రీ స్కిల్ టెస్ట్‌, స్కిల్ టెస్ట్ ఆధారంగా ఎంపిక ప్ర‌క్రియ నిర్వ‌హిస్తారు. 

ద‌ర‌ఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా ద‌ర‌ఖాస్తు చేసుకోవాలి.

ఆన్‌లైన్ ద‌ర‌ఖాస్తు ప్ర‌క్రియ ప్రారంభం: 31.03.2021.

ఆన్‌లైన్ ద‌ర‌ఖాస్తుకు చివ‌రి తేది: 15.04.2021.

Notification Information

Posted Date: 31-03-2021

 

నోటిఫికేష‌న్స్‌ :