• facebook
  • twitter
  • whatsapp
  • telegram

ఎన్ఎండీసీలో 89 పోస్టులు

భార‌త ప్ర‌భుత్వరంగానికి చెందిన హైద‌రాబాద్ ప్ర‌ధాన‌కేంద్రంగా ఉన్న నేష‌న‌ల్ మిన‌ర‌ల్ డెవ‌ల‌ప్‌మెంట్ కార్పొరేష‌న్ (ఎన్ఎండీసీ)కి చెందిన ఝార్ఖండ్‌లోని టాకిసుడ్ నార్త్ కోల్‌మైన్‌లో ఒప్పంద ప్రాతిప‌దిక‌న కింది పోస్టుల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.

వివ‌రాలు..

* మొత్తం ఖాళీలు: 89

1) కొల్లియ‌రీ ఇంజినీర్ (మెకానిక‌ల్‌, ఎల‌క్ట్రిక‌ల్‌): 02

2) లెయిజ‌నింగ్ ఆఫీస‌ర్‌: 02

3) మైనింగ్ ఇంజినీర్‌: 12

4) స‌ర్వేయ‌ర్‌: 02

5) ఎల‌క్ట్రిక‌ల్ ఓవ‌ర్‌మెన్‌: 04

6) మైన్ ఓవ‌ర్‌మెన్‌: 25

7) మెకానిక‌ల్ ఓవ‌ర్‌మెన్‌: 04

8) మైన్ సిర్దార్‌: 38

అర్హ‌త‌: పోస్టును అనుస‌రించి ప‌దో త‌ర‌గ‌తి, సంబంధిత సబ్జెక్టుల్లో ఇంజినీరింగ్ డిప్లొమా, ఇంజినీరింగ్ డిగ్రీ, పీజీ డిగ్రీ/ పీజీ డిప్లొమా ఉత్తీర్ణ‌త‌తో పాటు వాలిడ్ సిర్దార్ స‌ర్టిఫికెట్ ఉండాలి. సంబంధిత ప‌నిలో అనుభ‌వం ఉండాలి.

ఎంపిక విధానం: ఎగ్జిక్యూటివ్ గ్రేడ్ పోస్టులు ఇంట‌ర్వ్యూ ఆధారంగా, సూప‌ర్‌వైజ‌ర్లు, నాన్ ఎగ్జిక్యూటివ్ పోస్టులు రాత ప‌రీక్ష‌, సూప‌ర్‌విజ‌రీ స్కిల్ టెస్ట్‌, స్కిల్ టెస్ట్ ఆధారంగా ఎంపిక ప్ర‌క్రియ నిర్వ‌హిస్తారు. 

ప‌రీక్షా విధానం: రాత ప‌రీక్ష మ‌ల్టిపుల్ ఛాయిస్ ప్ర‌శ్న‌ల రూపంలో 100 మార్కుల‌కు ఉంటుంది. ఈ ప‌రీక్ష‌ను ఇంగ్లిష్‌, హిందీ భాష‌ల్లో నిర్వ‌హిస్తారు. రాత ప‌రీక్ష‌లో అర్హ‌త సాధించిన సూపర్‌వైజ‌రీ పోస్టు అభ్య‌ర్థుల‌ను సూప‌ర్‌వైజ‌రీ స్కిల్ టెస్ట్‌కి, నాన్ ఎగ్జిక్యూటివ్ అభ్య‌ర్థుల‌ను స్కిల్ టెస్ట్‌కి ఎంపిక చేస్తారు. రాత ప‌రీక్ష‌లో సాధించిన మార్కుల

ఆధారంగా మాత్ర‌మే తుది ఎంపిక ఉంటుంది.

ద‌ర‌ఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా ద‌ర‌ఖాస్తు చేసుకోవాలి.

ఆన్‌లైన్ ద‌ర‌ఖాస్తు ప్ర‌క్రియ ప్రారంభం: 02.06.2021.

ఆన్‌లైన్ ద‌ర‌ఖాస్తుకు చివరి తేది: 22.06.2021.

Notification Information

Posted Date: 02-06-2021

 

నోటిఫికేష‌న్స్‌ :