• facebook
  • twitter
  • whatsapp
  • telegram

పీజీఐఎంఈఆర్, చండీగ‌ఢ్‌లో వివిధ ఖాళీలు

చండీగ‌ఢ్‌లోని పోస్టు గ్రాడ్యుయేట్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడిక‌ల్ ఎడ్యుకేష‌న్ అండ్ రిసెర్చ్ (పీజీఐఎంఈఆర్) కింది పోస్టుల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.

వివ‌రాలు..

* మొత్తం ఖాళీలు: 73

1) సీనియ‌ర్ రెసిడెంట్లు: 64

విభాగాలు: అనెస్తీషియా, అనాటమీ, బ‌యోకెమిస్ట్రీ, డెర్మ‌టాల‌జీ, ఫోరెన్సిక్ మెడిసిన్‌, జ‌న‌ర‌ల్ స‌ర్జ‌రీ, ఆప్త‌ల్మాల‌జీ, పీడియాట్రిక్స్‌ త‌దిత‌రాలు.

అర్హ‌త‌: సంబంధిత స్పెష‌లైజేష‌న్ల‌లో మెడిక‌ల్ పీజీ డిగ్రీ (ఎండీ/ ఎంఎస్‌) ఉత్తీర్ణ‌త‌. 

వ‌య‌సు: 45 ఏళ్లు మించ‌కుండా ఉండాలి.

2) సీనియ‌ర్ మెడిక‌ల్ ఆఫీస‌ర్ (క్యాజువాలిటీ ఇన్ ఎమ‌ర్జెన్సీ): 01

అర్హ‌త‌: సంబంధిత స్పెష‌లైజేష‌న్ల‌లో మెడిక‌ల్ పీజీ డిగ్రీ (ఎండీ/ ఎంఎస్‌) ఉత్తీర్ణ‌త‌.

వ‌య‌సు: 45 ఏళ్లు మించ‌కుండా ఉండాలి.

3) సీనియ‌ర్‌, జూనియ‌ర్ డెమాన్‌స్ట్రేట‌ర్స్‌: 08

విభాగాలు: న్యూక్లియ‌ర్ మెడిసిన్‌, క‌మ్యూనిటీ మెడిసిన్‌, ఆప్త‌ల్మాల‌జీ, ఇమ్యూనోపాథాల‌జీ, న్యూక్లియ‌ర్ మెడిసిన్ త‌దిత‌రాలు. 

అర్హ‌త‌: పోస్టును అనుస‌రించి సంబంధిత స‌బ్జెక్టుల్లో ఎమ్మెస్సీ, పీహెచ్‌డీ ఉత్తీర్ణ‌త‌. 

వ‌య‌సు: 45 ఏళ్లు మించ‌కూడ‌దు.

ఎంపిక విధానం:  కంప్యూట‌ర్ బేస్డ్ టెస్ట్‌, డిపార్ట్‌మెంట‌ల్ ఇంట‌ర్వ్యూ అండ్ అసెస్‌మెంట్ ఆధారంగా ఎంపిక ప్ర‌క్రియ నిర్వ‌హిస్తారు. ఇందులో కంప్యూట‌ర్ బేస్డ్ టెస్ట్‌కి 75 మార్కులు, డిపార్ట్‌మెంట‌ల్ ఇంట‌ర్వ్యూ అండ్ అసెస్‌మెంట్‌కి 25 మార్కులు కేటాయిస్తారు. 

ప‌రీక్ష తేది: 14.06.2021.

ద‌ర‌ఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా ద‌ర‌ఖాస్తు చేసుకోవాలి.

ఆన్‌లైన్ ద‌ర‌ఖాస్తుకు చివ‌రి తేది: 10.05.2021.

Notification Information

Posted Date: 20-04-2021

 

నోటిఫికేష‌న్స్‌ :