• facebook
  • twitter
  • whatsapp
  • telegram

ప‌వ‌ర్‌గ్రిడ్‌లో 35 డిప్లొమా ట్రెయినీలు

భార‌త ప్ర‌భుత్వ‌రంగానికి చెందిన ప‌వ‌ర్ గ్రిడ్ కార్పొరేష‌న్ ఆఫ్ ఇండియా లిమిటెడ్, నార్త‌ర్న్ రీజియ‌న్ ట్రాన్స్‌మిష‌న్ సిస్టం కింది పోస్టుల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.

వివ‌రాలు..

* డిప్లొమా ట్రెయినీ

* మొత్తం ఖాళీలు: 35

స‌బ్జెక్టులు: ఎల‌క్ట్రిక‌ల్‌, సివిల్‌

1) డిప్లొమా ట్రెయినీ (ఎల‌క్ట్రిక‌ల్‌): 30

అర్హ‌త‌: క‌నీసం 70% మార్కుల‌తో సంబంధిత స‌బ్జెక్టుల్లో మూడేళ్లు రెగ్యుల‌ర్ ఇంజినీరింగ్ డిప్లొమా ఉత్తీర్ణ‌త‌. డిప్లొమా అర్హ‌త లేకుండా బీఈ/  బీటెక్‌/ ఎంఈ/ ఎంటెక్ వంటి అర్హ‌త‌లు ఉన్నా ప‌రిగ‌ణ‌న‌లోకి తీసుకోరు.

వ‌య‌సు: 15.06.2021 నాటికి 27 ఏళ్లు మించ‌కూడ‌దు.

2) డిప్లొమా ట్రెయినీ (సివిల్‌): 05

అర్హ‌త‌: క‌నీసం 70% మార్కుల‌తో సంబంధిత స‌బ్జెక్టుల్లో మూడేళ్లు రెగ్యుల‌ర్ ఇంజినీరింగ్ డిప్లొమా ఉత్తీర్ణ‌త‌. డిప్లొమా అర్హ‌త లేకుండా బీఈ/  బీటెక్‌/ ఎంఈ/ ఎంటెక్ వంటి అర్హ‌త‌లు ఉన్నా ప‌రిగ‌ణ‌న‌లోకి తీసుకోరు.

వ‌య‌సు: 15.06.2021 నాటికి 27 ఏళ్లు మించ‌కూడ‌దు.

ఎంపిక విధానం: రాత ప‌రీక్ష‌/ కంప్యూట‌ర్ బేస్డ్ టెస్ట్ ఆధారంగా మాత్ర‌మే ఎంపిక ప్ర‌క్రియ నిర్వ‌హిస్తారు. 

ప‌రీక్షా విధానం: ఈ ప‌రీక్ష‌ ఆబ్జెక్టివ్ టైప్ ప‌ద్ధ‌తిలో ఉంటుంది. దీన్ని రెండు భాగాలుగా విభ‌జిస్తారు. ఇందులో పార్ట్‌-1 120 ప్ర‌శ్న‌లు టెక్నిక‌ల్ నాలెడ్జ్/ ప్రొఫెష‌న‌ల్ నాలెడ్జ్ నుంచి ఉంటాయి. పార్ట్‌-2లో ఆప్టిట్యూడ్ టెస్ట్ ఉంటుంది. దీనిలో 50 ప్ర‌శ్న‌లు వొకాబుల‌రీ, వ‌ర్బ‌ల్ కాంప్ర‌హెన్ష‌న్‌, క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్‌, రీజ‌నింగ్ ఎబిలిటీ, డేటా స‌ఫిషియ‌న్సీ అండ్ ఇంట‌ర్‌ప్రిటేష‌న్, న్యూమ‌రిక‌ల్ ఎబిలిటీ  విభాగాల నుంచి ఉంటాయి. ప‌రీక్షా సమ‌యం 2 గంట‌లు ఉంటుంది. దీనికి నెగిటివ్ మార్కింగ్ ఉంటుంది. ప్ర‌తి తప్పు స‌మాధానానికి పావు మార్కు కోత విధిస్తారు. 

ద‌ర‌ఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా ద‌ర‌ఖాస్తు చేసుకోవాలి.

ఆన్‌లైన్ ద‌ర‌ఖాస్తు ప్ర‌క్రియ ప్రారంభం: 24.05.2021.

ఆన్‌లైన్ ద‌ర‌ఖాస్తుకు చివ‌రి తేది: 15.06.2021.

Notification Information

Posted Date: 24-05-2021

 

నోటిఫికేష‌న్స్‌ :